Zomato: జొమాటో ఉద్యోగులకు గుడ్ న్యూస్... 26 వారాల పేరెంటల్ లీవ్

Zomato Parental Leave | భారతదేశంలో మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి కానీ... పురుషులకు కూడా అన్ని రోజులు పితృత్వ సెలవులు ఇచ్చే కంపెనీలు చాలా అరుదు.

news18-telugu
Updated: June 4, 2019, 11:18 AM IST
Zomato: జొమాటో ఉద్యోగులకు గుడ్ న్యూస్... 26 వారాల పేరెంటల్ లీవ్
Zomato: జొమాటో ఉద్యోగులకు గుడ్ న్యూస్... 26 వారాల పేరెంటల్ లీవ్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: June 4, 2019, 11:18 AM IST
జొమాటోలో పనిచేస్తున్న ఉద్యోగులకు గుడ్ న్యూస్. సరికొత్త సెలవుల విధానాన్ని ప్రకటించింది జొమాటో. 26 వారాల ప్రసూతి సెలవుల్ని ప్రకటించింది. సాధారణంగా మాతృత్వ సెలవులు, పితృత్వ సెలవులు వేర్వేరుగా ఉంటాయి. మహిళలకు ఎక్కువ రోజులు, పురుషులకు కాస్త తక్కువ రోజులు సెలవులు ఇస్తాయి కంపెనీలు. కానీ జొమాటో స్త్రీలు, పురుషులకు 26 వారాల సెలవులను ప్రకటించడం విశేషం. భారతదేశంలో మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి కానీ... పురుషులకు కూడా అన్ని రోజులు పితృత్వ సెలవులు ఇచ్చే కంపెనీలు చాలా అరుదు. కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తించి ఈ కొత్త సెలవుల విధానాన్ని అమలు చేస్తోంది జొమాటో. అంతేకాదు... 1,000 డాలర్లు కూడా ఇవ్వనుంది కంపెనీ.

సాధారణంగా పిల్లల్ని కనేవారితో పాటు సరోగసీ, దత్తత, స్వలింగ సంపర్కులకు కూడా ఈ సెలవుల విధానం వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. గత ఆరు నెలల్లో పిల్లల్ని కన్నవారికి కూడా కొత్త సెలవుల విధానం వర్తిస్తుంది.
బ్లాగ్‌లో జొమాటో ఫౌండర్ దీపీందర్ గోయల్


పిల్లల్ని కనే తల్లిదండ్రులకు 26 వారాల సెలవుల్ని ప్రకటించిన కంపెనీ జొమాటో మాత్రమే కాదు... గత ఏడాది ఫర్నీచర్ కంపెనీ ఐకియా కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేసింది. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, మరో 16 వారాలు డ్యూటీ టైమింగ్స్‌లో 50 శాతం వెసులుబాటు కల్పించింది. పురుషులకు 26 వారాల సెలవు కూడా అమలు చేసింది. భారతదేశంలో మెటర్నీటీ బెనిఫిట్స్ యాక్ట్, 1961 ప్రకారం సంస్థలన్నీ 26 వారాలు మాతృత్వ సెలవులు తప్పనిసరి. కానీ పితృత్వ సెలవులపై కఠినమైన నిబంధనలేవీ లేవు. అయితే పిల్లల్ని కనడం, వారి బాగోగులు చూసుకోవడంలో తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా ఉంటుంది. డెలివరీ సమయంలో, ఆ తర్వాత తల్లితో పాటు తండ్రి కూడా పిల్లల దగ్గర సమయం గడపాల్సి ఉంటుంది. అందుకే మహారాష్ట్రకు చెందిన ఎంపీ రాజీవ్ సతవ్ గతంలో పార్లమెంట్‌లో పెటర్నిటీ బెనిఫిట్ బిల్ ప్రతిపాదించారు. తల్లితో పాటు తండ్రికి కూడా సమానమైన బెనిఫిట్స్ రావాలని కోరారు.



సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్ 551 (ఏ) ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు వర్తిస్తాయి. పిల్లలు పుట్టిన నాటి నుంచి 6 నెలల లోపు 15 రోజుల వరకు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో పితృత్వ సెలవులుపై నియమనిబంధనలు ఏవీ లేవు. అయితే కంపెనీలు స్వచ్ఛందంగా సెలవులు ఇస్తాయి. ప్రైవేట్ కంపెనీల్లో పితృత్వ సెలవులు 5 రోజుల నుంచి 16 వారాల వరకు ఉన్నాయి. ఈ సెలవులు ఆయా కంపెనీలను బట్టి ఉంటాయి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి
Loading...
ఇవి కూడా చదవండి:

సైకిల్ తొక్కితే వచ్చే 10 లాభాలు ఇవే... తెలుసుకోండి

PAN Card: ఏఏ ట్రాన్సాక్షన్స్‌కి పాన్ కార్డు అవసరమో తెలుసా?

Govinda App: తిరుమలలో రూమ్ నుంచి దర్శనం వరకు... యాప్‌లో బుక్ చేయండి ఇలా
First published: June 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...