Bipolar Disorder: తీవ్రమైన నిస్పృహలో ఉంటున్నారా? అయితే ఆ వ్యాధి కావొచ్చు.. తెలుసుకోండి..

Bipolar Disorder: తీవ్రమైన నిస్పృహ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ బైపోలార్ డిజార్డర్ అంటే అందరికీ సులభంగా అర్థమవుతుంది. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే ఈ బైపోలార్ డిజార్డర్.

news18-telugu
Updated: October 20, 2020, 3:34 PM IST
Bipolar Disorder: తీవ్రమైన నిస్పృహలో ఉంటున్నారా? అయితే ఆ వ్యాధి కావొచ్చు.. తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తీవ్రమైన నిస్పృహ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ బైపోలార్ డిజార్డర్ అంటే అందరికీ సులభంగా అర్థమవుతుంది. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే రుగ్మతే ఈ బైపోలార్ డిజార్డర్. అంటే వ్యక్తుల మానసిక స్థితికి సంబంధించినదే ఈ బైపోలార్ డిజార్డర్ అని చెప్పవచ్చు. అంటే తీవ్రమైన ఆనందం లేదా నిరాశ, కోపం లాంటి భావోద్వేగాలు నియంత్రణలో లేకపోయినట్లయితే వారు బైపొలార్ డిజార్డర్ కు లోనవుతారు. విచారం, బాధ, చిరాకు, ఉల్లాసం, ఉన్మాదం ఇలా రకరకాల భావనల వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. వీటిలో నిర్దిష్ట మానసిక స్థితి సుదీర్ఘ కాలం కొనసాగినప్పుడు రోగ లక్షణాలు బయటపడతాయి. ఇతర మానసిక అనారోగ్యాలతో పోలిస్తే భారత్ లో బైపొలార్ డిజార్డర్ ప్రాబల్యం 6.9 శాతం ఉంది.  స్వల్పరూపాల్లో ఉన్న బైపొలార్ డిజార్డర్లను అంచనా వేయడంలో తరచూ మిస్ అవుతుంటాయి.

బైపొలార్డ్ డిజార్డర్ లో విభిన్న రకాలు..

బైపొలార్ డిజార్డర్-1: తీవ్రమైన నిస్పృహలో రెండు రకాల లక్షణాలుంటాయి. అవే మేనియాక్(ఉన్మాదం), డిప్రెసీవ్(కుంగిపోవడం) లక్షణాలు ఉంటాయి.
బైపొలార్ డిజార్డర్-2: ఇందులో హైపో మేనియా (మేనియాక్ కంటే తక్కువ తీవ్రత), డిప్రేషన్ లక్షణాలు ఉంటాయి.
సైక్లోపీడియా: కనీసం రెండేళ్ల పాటు హైపో మేనియా లక్షణాలు కనిపిస్తూ రోగనిర్ధరాణకు సరిపోని లక్షణాలుంటాయి.
డిస్టిమియా: కనీసం రెండేళ్ల పాటు డిప్రెషన్ స్థితిలో ఉన్నట్లయితే డిస్టిమియా లక్షణాల కింద చేరుస్తారు.

బైపొలార్ డిజార్డర్ లక్షణాలు..

1.మేనియా..
-అత్యంత ఎక్కువ శక్తి ఉంటుంది.
-అహం అత్యధిక స్థాయిలో ఉంటుంది
-గట్టిగా, పెద్దగా మాట్లాడతారు
-తక్కువ సేపు నిద్రపోతారు
-ప్రమాదకర ప్రవర్తనలు, భద్రతా లేని శృంగారం మాదిరి ప్రవర్తిస్తారు.
-శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది
-నిద్రలేమి పెరుగుతుంది.
-ఎక్కువగా కలుపుగోలుతనంతో ఉంటారు.

2.డిప్రేషన్..
-శారీరకంగా, మానసికంగా మైకంగా ఉంటారు
-వ్యక్తిగతంగా విలువలేకుండా ప్రవర్తిస్తారు
-ఎక్కువగా లేదా మరి తక్కువగా తినడం చేస్తారు
-విచారంలో ముణిగిపోతారు
-ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు.
-అలసట చెందుతారు
-తప్పు చేసిన భావన కలుగుతుంది
-ఏకాగ్రత లోపిస్తుంది
-నిర్ణయం తీసుకోవడంలో కష్టతరమవుతుంది
-శ్రద్ధ, ఆసక్తులు లోపిస్తాయి

బైపొలార్ డిజార్డర్ కు కారణామేంటి?
బైపొలార్ డిజార్డర్ రావడానికి ఒక్క కారణమంటూ ఉండదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. జీవ వ్యత్యాసాలు(బయలాజికల్ డిఫరెన్సెస్) ఇందులో మొదటి కారణం. ఇవి ఉన్నవారికి మెదడులో భౌతిక మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులు ప్రాముఖ్యత ఇప్పటికీ అనిశ్చితిగా ఉంది. అయితే ముఖ్య కారణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. సైరోటొనిన్, డోపామైన్ న్యూరో ట్రాన్స్మిటర్లు బైపొలార్ డిజార్డర్ తో సంబంధాన్ని కలిగి ఉంటాయి.

వారసత్వంగా వచ్చే అవకాశం..
ఫస్డ్ డిగ్రీ రిలటీవ్ అంటే తల్లిదండ్రులు లేదా సోదరుడికి బైపొలార్ డిజార్డర్ ఉన్నట్లయితే వారి నుంచి సంక్రమించే అవకాశముంది. వారసత్వ జన్యువుల ఆధారంగా సంక్రమించే ఈ బైపొలార్ డిజార్డర్ కు సంబంధించి పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. మానసిక పరిస్థితుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీకిష్టమైన వారు లేదా ప్రేమికులు చనిపోవడం లేదా ఇతర దుర్ఘటనలు, మాదక ద్రవ్యాల, ఆల్కహాల్ వినియోగం, ఆలోచన విధానంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల బైపొలార్ డిజార్డర్ బారిన పడే అవకాశముంది. సహ ఆక్రమణ పరిస్థితులు(కో-అక్కరింగ్ కండీషన్లు) వల్ల ఆందోళన పెరగడం, ఈటింగ్ డిజార్డర్లు, ఏడీహెచ్ డీ, ఆల్కహాల్ లేదా మాదక ద్రవ్యాల సమస్యలు, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు, తలనొప్పులు, ఉబకాయం లాంటి సమస్యలు కారణమవుతాయి.

చికిత్సా విధానం..
బైపొలార్డ్ డిజార్డర్ అనేది శారీరక రోగ లక్షణాలతో ఉండని కారణంగా దీన్ని గుర్తించడం కష్టం. మానసిక స్థితులు మనిషికి మనిషికి మారుతుంటాయి. దీనికి సంబంధించి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. రోగుల భద్రతా, పూర్తి చికిత్సా విశ్లేషణం, సంభావ్య శ్రేయస్సు లాంటి లక్ష్యాల ఆధారంగా చికిత్సా విధానం ఉంటుంది. ముఖ్యంగా మూడు విధాలు చికిత్సా విధానం ఉంటుంది. సైకోఫార్మోకోథెరపీ, సైకోథెరపీ, స్టిమ్యూలేషన్ థెరపీ లాంటి మూడు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

బైపొలార్ డిజార్డర్ రోగులకు ఎలాంటి మద్ధతు ఇవ్వాలి?
బైపొలార్ డిజార్డర్ ఉన్నట్లు నిర్దారించడం లేదా బాధపడుతున్న వారిని చూసుకోవడం ఒత్తిడి, శ్రమతో కూడికొని ఉన్నది. అయితే అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికి వారిలో ఆశను చూపాలి. ఇందుకోసం కొన్ని మార్గాలు ఉన్నాయి.
-వ్యాధి గురించి సరైన అవగాహన కల్పించాలి.
-ముందుగా లక్షణాలను గుర్తించాలి. ఇదే సమయంలో సెల్ఫ్ మెడికేషన్ ను నివారించాలి.
-ఆల్కాహాల్, పొగాకు, గంజాయి, వాటికి దూరంగా ఉండాలి
-అనారోగ్యం పట్ల సహనం, సానుభూతితో ఉండాలి.
-త్వరగా కోలుకోవాలనే ఆత్రుత పనికిరాదు.
-రోగికి మాటలు వింటూ వారితో సానుభూతితో ప్రవర్తించాలి.
-నిపుణుల సాయంతో చికిత్సా విధానంలో వారికి సహకరించాలి
-ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు క్రమబద్ధంగా వ్యాయామం చేయాలి.

మేనియాక్ రోగులతో కింద వాటిని పాటించాలి..

మీకిష్టమైనవారితో సమయాన్ని గడపండి: మేనియాక్ తో బాధపడేవారు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. కాబట్టి వారితో తక్కువ సమయమే గడిపేందుకు అవకాశముంటుంది. ఒక వేళ వారు మీకిష్టమైన వ్యక్తులైతే వారితో కలిసి ఉండండి. ఇది వారిలో మంచి కదలికకు తోడ్పడుతుంది. మీ కంపెనీ వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ప్రశ్నలకు నిజాయితీగా బదులివ్వండి: మేనియాక్ రోగులతో ఎక్కువగా వాదించకండి. తీవ్రమైన సంభాషణను నివారించండి. వ్యక్తిగత వ్యాఖ్యాలను తీసుకోండి. మీకిష్టమైన వ్యక్తి ప్రతికూల అంశాలపై దృష్టి పెట్టండి. వీలైనంత వరకు వాదనలు నివారిస్తే మంచిది.

సులభ రీతిలో తినిపించేందుకు ప్రయత్నించండి: మేనియాక్ రోగి భోజనానికి కూర్చోవడం చాలా కష్టం. కాబట్టి వారికి శాండ్ వించ్, ఆపిల్, జున్ను, జ్యూస్ లు అందించడానికి ప్రయత్నించండి. సాధ్యమైనప్పుడల్లా నిద్రపుచ్చడానికి ప్రయత్నించండి.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading