మగవాళ్లు ఈ పని చేస్తే.. త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయట!

మగవారు పడుకునే ముందు మాయిశ్చరైజర్‌ రాసుకోవద్దు. కేవలం పొడి చర్మం వారు అది కూడా స్నానానికి వెళ్లే ముందు మాత్రమే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.

మగవారు పడుకునే ముందు మాయిశ్చరైజర్‌ రాసుకోవద్దు. కేవలం పొడి చర్మం వారు అది కూడా స్నానానికి వెళ్లే ముందు మాత్రమే మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి.

  • Share this:
అందంగా ఉండటం కేవలం ఆడవారికి పరిమితమైన విషయం కాదు. ఇది మగవాళ్ల men కు కూడా వర్తిస్తుంది. మహిళలతో సమానంగా వారు కూడా తమ అందంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా.. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టడం మానేయాలి. సాధారణంగా మనం కొన్ని అలవాట్లకు వ్యసనపరులమవుతాం. వాటిని మానటానికి కొంత సమయం పడుతుంది. అయితే, హానీ కలిగించే అలవాట్లను సాధ్యమైనంత త్వరగా వదిలేయాలి. ఎందుకంటే దీంతో మీకు తెలియకుండానే మీ అందం తగ్గిపోతుంది.

  • మగవారు నిద్ర పోయేటపుడు సరైన పొజిషన్‌లో పడుకోవాలి. దీంతో వారికి ఒత్తిడి తగ్గితుంది. అలా కాకుంటే.. ముఖంపై ముడతలు కూడా ఏర్పడతాయి. బోర్లా పడుకోవడం వల్ల దిండు వల్ల ముఖం రూపు మారిపోతుంది. దీంతో ముడతలు ఏర్పడతాయి.

  • ఈ శీతకాలంలో మగవారి చర్మం త్వరగా ముడతలు పడుతుంది. పొడిబారి వృద్ధాప్య ఛాయలు ఏర్పడటానికి సోపులు ప్రధాన కారణం. ఇటువంటి సబ్బులు ఉపయోగించడం వల్ల ఏ క్రీములు వాడినా... ప్రయోజనం ఉండదు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫేస్‌వాష్‌లను వాడాలి.

  • ఇక ముఖ్యంగా ఇప్పటికి ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పారు. పొగ తాగేవారు పూర్తిగా విడిచిపెట్టాలి. దీంతో ఆరోగ్యం, అందం రెండూ పెరుగుతాయి. పొగతాగడం మానకపోతే.. కేన్సర్, బ్యాక్‌ పెయిన్, అనారోగ్యాలే కాకుండా.. అందవిహీనంగా తయారవుతారు. ముఖంపై వృద్ధాప్య ఛాయలు అతి త్వరగా ఏర్పడతాయి. అంతేకాదు.. నోటి నుంచి కూడా దుర్వాసన వస్తుంది.


మీరు వాడే పసుపు స్వచ్ఛమైందా? ఇలా కనిపెట్టేయండి!  •  ముఖం నిర్జీవంగా కనిపిస్తే.. క్లెన్సింగ్‌ చేసుకోవాలి. ముఖం తాజాగా కనిపించాలంటే ఆలివ్‌ ఆయిల్‌ తీసుకుని అందులో కొంచెం పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి ముఖానికి మసాజ్‌ చేసుకోవాలి.

  • మెన్స్‌ హెయిర్‌ కేర్‌ సరిగ్గా తీసుకోకపోతే.. త్వరగా చుండ్రు వస్తుంది. దానివల్ల ముఖంపై పొట్టుగా రాలడం వల్ల మచ్చలు, స్కిన్‌ అలర్జీ ఏర్పడి అందవిహీనంగా తయారవుతారు. అందుకే తల రుద్దుకొని, అదే చేతితో ముఖంపై తాకవద్దు. ముఖ్యంగా యాంటీ డాండ్రఫ్‌ షాంపులను మాత్రమే ఉపయోగించాలి.

  • ఇక సన్‌లైట్‌ కేవలం ఆడవారిని మాత్రమే కాదు..మగవారి చర్మంపై కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే బయటకు వెళ్లే ముందు సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిది.

Published by:Renuka Godugu
First published: