యంగ్ ఏజ్‌లో అతిగా మద్యం తాగితే మెదడుపై తీవ్రప్రభావం

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని తెలుసు. అయితే.. యంగ్ ఏజ్‌లో మద్యం ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు నిపుణులు. ఉరకలేసే వయసులో ఉన్నప్పుడు ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుందని, అదేవిధంగా నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని తెలిపారు.

Amala Ravula | news18-telugu
Updated: March 26, 2019, 9:57 PM IST
యంగ్ ఏజ్‌లో అతిగా మద్యం తాగితే మెదడుపై తీవ్రప్రభావం
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 26, 2019, 9:57 PM IST
పరీక్షలు బాగా రాశామని మందు తాగుతారు.. పరీక్షల్లో పాస్ అయ్యామని మందు తాగుతారు.. ఒక వేళ ఫెయిల్ అయినా ఇదే పని.. లవ్‌లో పడ్డా తాగడమే.. లవ్ సక్సెస్, ఫెయిల్ అయినా తాగడమే.. పెళ్ళిళ్లు అయినా.. చావు కబురైనా ఇలా కాదేదీ తాగేందుకు అనర్హమన్నట్లు చాలామంది యువకులు పెగ్గు మీద పెగ్గు వేస్తుంటారు. ఊగుతూ.. తూలుతూ హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే.. ఇదంతా ఇప్పుడు బానే ఉంటుంది. 60ఏళ్లు వచ్చాక కానీ దాని దుష్ప్రభావాలు కనిపించవని చెబుతున్నాయి పరిశోధనలు.
అమెరికాలోని ఓ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని వింటే ఎక్కిన మత్తు కూడా దిగిపోతుంది. అవేంటంటే యంగ్ ఏజ్‌లో అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయట. ఒత్తిడి, ఆందోళన పెరిగి మళ్లీ మళ్లీ తాగాలనిపించి మందుకు బానిసలుగా మారుతారట. వీటితో పాటు.. మెదడుపై తీవ్రప్రభావం పడడమేకాకుండా, నాడీ వ్యవస్థ దెబ్బతిని స్వీయ నియంత్రణపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

యవ్వనంలో ఎక్కువగా తాగి అరవై ఏండ్ల వయస్సులో ఉన్నవారిని పరిశోధనలు జరిపారు. ఇందులో మందుతాగే అలవాటు లేనివారికి రెండు వ్యాధులుసోకితే, మందు తాగే అలవాటున్నవారికి మూడు అంతకన్నా ఎక్కువ వ్యాధులున్నట్లు తేలింది. కాబట్టి.. పెగ్ మీద పెగ్ వేసి ఎంజాయ్ చేస్తున్న యువకుల్లారా కాస్తా ఆలోచించండి.. అతిగా తాగకండని చెబుతున్నారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి..


First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు