Akshaya Tritiya 2019 : అక్షయ తృతీయ రోజున ఈ పనులు చేస్తే పట్టిందల్లా బంగారమే..

Akshaya Tritiya 2019| అక్షయ తృతీయ రోజున కొన్ని దానాలు చేస్తే ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొన్ని దానాలు చేయడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుందని.. సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

news18-telugu
Updated: May 7, 2019, 11:11 AM IST
Akshaya Tritiya 2019 : అక్షయ తృతీయ రోజున ఈ పనులు చేస్తే పట్టిందల్లా బంగారమే..
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
  • Share this:
వైశాఖ శుద్ధ తృతీయనే అక్షయ తృతీయ అంటారు. అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం.. ఈ రోజున కొన్ని దానాలు చేస్తే ఆ ఫలితం, పుణ్యం అక్షయంగానే ఉంటుందంటారు. అంటే ఎంత ఖర్చు పెట్టినా సిరిసంపదలు ఇంకా వస్తూనే ఉంటాయని చెబుతారు.. మరి ఈ రోజున ఎలాంటి పనులు చేయాలో చూద్దాం.. ఈరోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా మంచిదట.. అయితే, అందరికీ అలా కుదరదు కాబట్టి.. మనం స్నానం చేసేటప్పుడు ఆ మూడుసార్లు గంగా అని పలికి స్నానం చేయాలి..

అదేవిధంగా.. ఈరోజున పెరుగన్నం, విసనకర్ర, చెప్పులు, గొడుగు, చల్లని నీరు ఉన్న మట్టికుండను దానం చేయాలి. ఎందుకంటే.. ఈ వేసవిలో ఇవన్నీ కూడా ఈ వేసవిలో ప్రజలకు ఉపయోగపడేవి.. మీరు గమనించినట్లైతే.. భద్రాచలంలో సీతారాముల కల్యాణం జరిగే సమయంలో అక్కడ అందరికీ విసనకర్రలు ఇస్తారు.

అయితే ఏదో ఇచ్చాం కదా అన్నట్లు ఇవ్వకూడదు.. ప్రజలకు మంచిజరగాలని కోరుకుంటూ మనమైతే ఏవీ తీసుకోవడానికి ఇష్టపడతామో ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా అలాంటివే ఇవ్వాలి. వేడివేడి అన్నంలో పెరుగు కలిపి ఇవ్వాలి. ఇలా చేస్తే శరీరంలోని ఉష్ణాన్ని పోగొట్టినవారవుతాం.. విసనకర్ర.. ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఉపయోగపడేదే.. చెప్పులు.. బయటికి వెళ్లేప్పుడు అందరికీ అవసరమే.. చల్లని నీరు.. ఇది ఫ్రిజ్ నీరు కాదు.. మట్టికుండలోనీరు.. అంటే అప్పుడే కొని ఇవ్వకూడదు.. రెండు మూడురోజుల ముందే కొని ఆ కుండని మట్టివాసనపోయేవరకు ఉంచి శుభ్రం చేసి నీరు నింపి అవి చల్లగా అయ్యాక ఇవ్వాలి. ఇలా చేస్తే ఎంతో పుణ్యమని చెబుతున్నారు. అదేవిధంగా.. తెల్లని వస్త్రాలు వీటి వల్ల ఎండల ప్రభావం అంతగా ఉండదు.. ఈ కాలంలో దొరికే మామిడిపండ్లు, పనసతొనలు కూడా ఇవ్వాలి..ఇక పితృదేవతలకు పిండ ప్రదానాలు కూడా చేయడం మంచిదని చెబుతారు..

ఎప్పుడు కూడా దానం చేయడం మంచిదే.. ఈ రోజు చేస్తే ఇంకా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం చేసింది కూడా మనకు నచ్చినవారు.. ఆర్థికస్థితి మెరుగ్గా ఉన్నవారికి కాకుండా.. లేనివారికి చేస్తే చాలా మంచిది.. మనకు కూడా ఆ ఆత్మతృప్తి ఉంటుంది..



ఇవి కూడా చదవండి..
Akshaya tritiya 2019: అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలా..?

Akshaya Tritiya 2019: అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే పాపం.. చాగంటి సంచలన వ్యాఖ్యలు..
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...