ఆవకాడో టోస్ట్... చియా పుడ్డింగ్... అక్షయ్ కుమార్ చెప్పిన ఫుడ్ సీక్రెట్...

అభిమానులకు అత్యంత దగ్గరగా ఉండే హీరోల్లో ఒకడైన అక్షయ్ కుమార్... రెండు రకాల ఫుడ్ ఐటెమ్స్ ఎలా తయారుచెయ్యాలో చెప్పాడు. అవి మనమూ చేసుకుంటే సరి.

news18-telugu
Updated: January 12, 2020, 9:53 AM IST
ఆవకాడో టోస్ట్... చియా పుడ్డింగ్... అక్షయ్ కుమార్ చెప్పిన ఫుడ్ సీక్రెట్...
ఆవకాడో టోస్ట్... చియా పుడ్డింగ్... అక్షయ్ కుమార్ చెప్పిన ఫుడ్ సీక్రెట్...
  • Share this:
బాలీవుడ్‌లో పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్ మెయింటేన్ చేసేవారిలో అక్షయ్ కుమార్ ప్రత్యేకం. రాత్రి భోజనాన్ని సాయంత్రమే తినేసి... ఆరోగ్యం విషయంలో అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ కిలాడీ. ఈ రోజుల్లో మంచి ఆహారం తినడం చాలా ముఖ్యమంటున్న అక్షయ్... తాజాగా... తను మార్నింగ్ వేళ తినే ఆహారాల్లో రెండు బెస్ట్ ఐటెమ్స్ ఎలా తయారుచేసుకోవాలో తన ఫ్యాన్స్‌కి వివరించాడు. వాటిలో ఒకటి ఆవకాడో టోస్ట్. రెండోది చియా పుడ్డింగ్. ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మంచివంటున్న అక్కీ... అవి ఎంతో రుచికరంగా ఉంటాయనీ, వాటిని తింటే కొన్ని గంటలపాటూ ఆకలి వెయ్యదనీ... పొట్ట ఫుల్లుగానే ఉన్నట్లు అనిపిస్తుందనీ చెప్పాడు. వాటిలో ప్రోటీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నాడు. మరి అవి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. 

View this post on Instagram
 

Thank you @twinklerkhanna for nominating me. Eating clean is not an option but a way of life for me. Here’s a glimpse at what made me spring into action this morning 🕺 Sharing how you can also make my favourite avocado on toast and my chia pudding. It’s healthy, tasty, and keeps you full for hours, not to mention high in protein 😋 *Avocado on toast* Mash a ripe avocado. Add little olive oil, I like to add Rapeseed oil to it. Add a pinch of Himalayan Pink Salt, & a dash of chaat masala if you like things flavoursome. Spread the mashed avocado on two slices of toasted barley bread or any multigrain bread. Garnish with pomegranate. *Chia Pudding* Soak 3 teaspoons of chia seeds in walnut milk, overnight. Add a little honey or cinnamon to it. Top with seasonal fruits of your choice, preferably berries. Voila Bon Appetit 🙏🏽 Now you know what’s in my dabba, I nominate @katrinakaif @bhumipednekar and @shikhardofficial to give me a peek inside their dabbas. It would be great to know more healthy food options. Don’t forget to share a photo with #WhatsInYourDabba and tag @TweakIndia


A post shared by Akshay Kumar (@akshaykumar) on

Avocado on toast : ఓ పండిన ఆవకాడోను గుజ్జుగా చేసుకోవాలి. దానికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ చేర్చాలి. అక్షయ్ కుమార్... ఆలివ్ ఆయిల్ బదులు ఆవ నూనె (Rapeseed Oil) వేసుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు దీనికి కొద్దిగా హిమాలయా పింక్ సాల్ట్ (దీన్నే బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది) కలపాలి. ఫ్లేవర్ కోసం కొద్దికా చాట్ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి మొత్తం పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ చేసిన రెండు బార్లీ బ్రెడ్ ముక్కలు లేదా ఏదైనా మల్టీగ్రెయిన్ బ్రెడ్ ముక్కలపై ఆవకాడో ముక్కల గుజ్జు (పేస్టు)ను రాసుకొని... అదనంగా దానిమ్మ గింజలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు అంటున్నాడు అక్షయ్ కుమార్.

Chia Pudding : 3 టీస్పూన్ల సబ్జా గింజల్ని... బాదం పాలలో వేసి రాత్రంతా (ఫ్రిజ్‌లో ఉంచి) నానబెట్టాలి. తెల్లారి దానికి కొద్దిగా తేనె లేదా దాల్చిన చెక్క పొడి కలపాలి. మనకు నచ్చిన సీజనల్ పండ్లను ఆ పాలలో వేసుకోవాలి. బెర్రీస్ అయితే బెటర్. ఈ పుడ్డింగ్ తీసుకుంటే ఎంతో ఆరోగ్యం. మల బద్ధకం సమస్య తీరిపోతుంది. జీర్ణక్రియా వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

ఇలాంటివి తయారుచేసుకొని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అక్షయ్ కుమార్ తెలిపాడు. తన అభిమానులు కూడా ఇలాంటివి చేసుకొని... ఆ విశేషాల్ని తనతో పంచుకోమన్నాడు.
First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు