Home /News /life-style /

AIR POLLUTION EFFECTS NOT ONLY LUNGS BUT ALSO BODY OTHER PARTS RNK

Air pollution: గాలి కాలుష్యం అయితే.. బాడీలోని ఈ పార్ట్‌ దారుణంగా డ్యామేజ్‌..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Air pollution effects: ప్రస్తుతం ఎయిర్‌ పొల్యూషన్‌ ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీపావళి తర్వాత పొల్యూషన్‌ మరింత దిగజారింది. ఏక్యూఐ లెవల్స్‌ మరింత డేంజర్‌గా మారింది.

ఆరోగ్య అధికారులు (Health officers)  ఎయిర్‌ పొల్యూషన్‌  (Air pollution) సంబంధించి ఎప్పటికప్పుడు అలెర్ట్‌ చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితి దారుణంగా మారింది. దీనివల్ల ఇక్కడి ప్రజలు సరైన గాలి కూడా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు  (Health problems) వస్తున్నాయి. ఈ గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులనే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాలను పాడు చేస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌  (World health organisation) ప్రకారం ప్రపంచంలో 90 శాతం జనాభా పీల్చే గాలి కాలుష్యం అయిపోయింది. దీంట్లో ప్రాణాంతక వాయువులు, ఇతర కణాలు ఉంటాయి. ఇవి మన లంగ్స్‌కు చాలా డేంజర్‌.

ఎప్పుడైనా కాలుష్యమైన గాలిని పీలిస్తే.. మనకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ డేంజర్‌ కణాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు వస్తాయి. దగ్గు, ముక్కు కారడం, అస్త్మ, ఛాతినొప్పి కూడా వస్తుంది. రానురాను ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ఇది గుండె, మెదడు, చర్మం ఇతర ముఖ్యమైన భాగాలపై ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి:  ఒకే ఒక్క మిస్డ్‌ కాల్‌.. మా 5 ఏళ్ల బంధాన్ని బ్రేక్‌ చేసింది!


డబ్ల్యూహెచ్‌ఓ అద్యయనం ప్రకారం ఇది కార్డియాక్‌ అరెస్ట్, హార్ట్‌ అటాక్‌లకు దారితీసి, ప్రాణాంతకం కూడా అవ్వొచ్చు. మీ గుండెకు ర్తం, ఆక్సిజన్‌ పోషకలను సరఫరా చేసే కరోనరీ ధమనులకు ప్రత్యక్ష సంబంధం ఉండే పలకం మధ్య వాయు కాలుష్యం ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కణాలను ముక్కుద్వారా పీల్చుకున్నప్పుడు రక్తంలోకి కలిసిపోతాయి. దీంతో బాడీలోని ఇతర భాగాలకు ఈ ప్రాణాంతక కణాలు చేరతాయి.

అంతేకాదు న్యూరాలాజికల్‌ సమస్యలైనా.. స్ట్రోక్స్,డిమెన్షియా వంటివి కూడా ఈ ఎయిర్‌ పొల్యూషన్‌తో కనెక్ట్‌ అయి ఉన్నాయి. ఇటీవలి నివేదికలు కాలుష్యం వల్ల బ్రెయిన్‌ ఎంత దారుణంగా ప్రభావితం అవుతాయో తెలిపాయి. ఈ కాలుష్యం వల్ల పిల్లల అభిజ్ఞా సామర్థ్యం కూడా తగ్గిపోయి, డిప్రెషన్‌కు లోనవుతారు.

ఇది కూడా చదవండి:  పెళ్లైన మగవారితో డేటింగ్‌ చేస్తే.. ఎంత ప్రమాదమో తెలుసా?


ఈ కాలుష్యం వల్ల స్కిన్‌ కూడా పాడవుతుంది. ఇది మన శరీరంలోని అతి పెద్ద భాగం. బయట వాతావరణానికి ఎక్స్‌పోజ్‌ అయ్యే మొదటి పార్ట్‌. ఈ ఎయిర్‌ పొల్యూషన్‌ వల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ కూడా వస్తుంది. దీనివల్ల ముఖంపై యాక్నే, రింకిల్స్, ఎజైమా పిల్లలకు వస్తుంది.

కంటి సంబంధిత వ్యాధులు..
ఈ గాలి కాలుష్యం వల్ల కళ్లు కూడా ప్రభావం చెందుతాయి. ఇది ప్రతి ఒక్క వ్యక్తిగి వేర్వేరుగా ప్రభావం చూపుతుంది.కొందరిలో ఈ ప్రభావం కనిపించదు. కానీ, కొందరిలో కళ్లు పొరిబారడం, దురదలు వస్తాయి. ప్రత్యేకించి మీ కళ్లు ఓజోన్‌ లేదా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ప్రభావానికి గురైనప్పుడు కళ్లకలక రావచ్చు. కాంటాక్ట్‌ లెన్స్‌ ధరించిన వారు ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు..
ఎయిర్‌ పొల్యూషన్‌ మరింత పెరిగినప్పుడు ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించి ఉండాలి. అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలి. ఎందుకంటే గాలి బయట విషపూరితంగా మారి ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంటి చిట్కాలను పాటించాలి.
Published by:Renuka Godugu
First published:

Tags: Air Pollution

తదుపరి వార్తలు