పెళ్లి అంటే అమ్మాయికి ఎన్నెన్నో కలలు. కట్టుకోబోయేవాడిని తలచుకుంటూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటుంది ఏ అమ్మాయైనా. పెళ్లి ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ ఓవైపు సంతోషం, మరోవైపు ఆందోళన, విభిన్నమైన ఉద్వేగం. ఆ అమ్మాయికి కూడా అంతే. అన్నీ అనుకున్నట్టై జరిగితే నవంబర్ 11న తన కలల రాకుమారుడిని మనువాడేది. కానీ విధి పగబట్టింది. పెళ్లికి 12 రోజుల ముందే పెళ్లికొడుకు దుర్మరణం చెందాడు. అక్టోబర్ 29న ఇండోనేషియా విమానం లయన్ ఎయిర్ క్రాష్‌లో చనిపోయిన వారిలో కాబోయే పెళ్లికొడుకు 26 ఏళ్ల రియో నందా ప్రతమ కూడా ఉన్నాడు. జకార్తాలో విమానం ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే ఫ్లైట్ క్రాష్ కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
మరో 12 రోజుల్లో పెళ్లి ఉందనగా కట్టుకోబోయేవాడు లోకం విడిచి వెళ్లిపోతే ఆ అమ్మాయి పరిస్థితి వర్ణనాతీతం. పెళ్లికూతురు ఇన్తన్ స్యారీది అదే విషాదం. "ఒకవేళ నవంబర్ 11లోగా నేను తిరిగిరాకపోతే నీకోసం నేను సెలెక్ట్ చేసిన వెడ్డింగ్ డ్రెస్ వేసుకో. మంచి మేకప్ వేసుకో. మిస్ షీలా దగ్గర తెల్లని గులాబీ పువ్వులు తీసుకో. మంచి ఫోటోలు దిగి నాకు పంపించు" అని స్యారీతో రియో సరదాగా అనేవాడట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది ఆ అమ్మాయి. రియో సరదాగా అన్న మాటలు చివరికిలా నిజం అవుతాయని అనుకోలేదు స్యారీ. రియో చెప్పినట్టుగానే అతను సెలెక్ట్ చేసిన వెడ్డింగ్ డ్రెస్ వేసుకుంది. మంచిగా మేకప్ చేసుకొని తెల్లని గులాబీలతో ఫోటోలు దిగింది. కానీ ఆ ఫోటోలు పంపడానికి ఇప్పుడు రియో ఈ లోకంలో లేడు.
పెళ్లికూతురిలా ముస్తాబై ఫోటోలు తీసుకున్న స్యారీ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. రియో సోదరితోనూ ఫోటోలు దిగింది. ఇలాంటి సోదరిని ఇచ్చినందుకు సంతోషంగా ఉందంటూ రియోకు కృతజ్ఞతలు తెలిపింది.
ఇప్పుడీ ఫోటోలు ఇండోనేషియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాలం విధించిన కఠిన పరీక్షల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలిచిన స్యారీని అందరూ కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
చిల్డ్రన్స్ డే: మీ పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పించండి
డయాబెటిస్ డే: మధుమేహాన్ని స్మార్ట్‌గా కంట్రోల్ చేయడానికి 5 టిప్స్
టాప్ 10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?
కాళ్లూచేతులతో క్యూబ్ సాల్వ్: చైనా బాలుడి ప్రపంచ రికార్డ్
తాగుడు అలవాటు చేస్తున్న ఫేస్‌బుక్
Diabetes Day: ఈ సెలబ్రిటీలకు షుగర్ ఉందని తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Plane Crash