Indian railway news: సారీ సిస్టర్స్..రైల్వేలో జాబ్స్‌ మీకివ్వలేం..

రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కొన్ని విభాగాల్లో విధులు నిర్వర్తించేందుకు మహిళలు వద్దంటూ సరికొత్త రూల్ తీసుకురానుంది.

Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 3:45 PM IST
Indian railway news: సారీ సిస్టర్స్..రైల్వేలో జాబ్స్‌ మీకివ్వలేం..
రైళ్లు (ఫైల్ ఫొటో)
Amala Ravula | news18-telugu
Updated: January 16, 2019, 3:45 PM IST
ఇప్పటివరకూ రైల్వే శాఖలో వివిధ విభాగాల్లో వేలాది మంది ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఇక మీద అన్ని విభాగాల్లో మహిళలను నియమించడం కుదరదని రైల్వే శాఖ నిర్ణయం తీసుకోనుంది. పని ఒత్తిడి, సురక్షితం కాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
డ్రైవర్స్, పోర్టర్స్, గార్డ్స్ వంటి విభాగాల్లో మహిళలు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అయితే, విధులు నిర్వర్తించే సమయంలో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కంప్లైంట్స్ కూడా రైల్వే శాఖ వరకూ వెళ్లాయి. వీటన్నింటిని పరీక్షించిన రైల్వే శాఖ కొన్ని విభాగాల్లో మహిళలను తీసుకోకూడదన్న నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు రైల్వేలో అన్ని విభాగాల్లో మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, కొన్ని పనుల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను గుర్తించి.. కొన్ని విభాగాల్లో మాత్రమే మహిళలకు ఉద్యోగాలు కల్పించాలి
-ఇండియన్ రైల్వే మాజీ చైర్మన్


ప్రస్తుతం భారతీయ రైల్వేలో 1.3 మిలియన్ల మంది ఉద్యోగులు ఉండగా.. ఇందులో 2 నుంచి 3 శాతం మంది మహిళలున్నారు. వీరిలో ఎక్కువమంది డెస్క్ విభాగంలో పనిచేస్తుండగా.. మిగతావారిలో డ్రైవర్లు, గార్డ్స్, ట్రాక్ మెన్ విభాగాల్లో చేస్తున్నారు.
అయితే, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లింగవివక్ష వంటివి లేవని.. కేవలం.. కఠినతరమైన ఉద్యోగాలను మహిళలు చేయలేరనే ఉద్దేశ్యమే ఉందంటూ ఓ అధికారి తెలిపారు.
తాజాగా తీసుకున్న నిర్ణయానికి కూడా మహిళలు సహకరించాలని ఇండియన్ రైల్వే లోకో అధికారి సంజయ్ పండి కోరారు. అదేవిధంగా.. రైల్వేలో మహిళల కోసం సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు.
First published: January 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు