Home /News /life-style /

ACUPUNCTURE CAN HELP WARD OFF DIABETES SAYS STUDY UMG GH

Acupuncture: ఈ థెరపీ పాటిస్తే డయాబెటిస్ దెబ్బకి పారిపోద్ది అంతే.. నూతన అధ్యయనంలో నమ్మలేని నిజాలు..!

ఈ థెరపీ పాటిస్తే డయాబెటిస్ దెబ్బకి పారిపోద్ది అంతే..

ఈ థెరపీ పాటిస్తే డయాబెటిస్ దెబ్బకి పారిపోద్ది అంతే..

ఆక్యుపంక్చర్ థెరపీ టైప్ 2 డయాబెటిస్‌ (Type 2 Diabetes)ను కూడా నివారించడంలో దోహదపడుతుందని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (Edith Cowan University) నుంచి వచ్చిన ఓ కొత్త అధ్యయనం కనుగొంది. ఆ వివరాలు చూడండి.

వెన్నునొప్పి, మెడ నొప్పి, తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి రకరకాల సమస్యలను పోగొట్టేందుకు ఆక్యుపంక్చర్ థెరపీ (Acupuncture therapy)ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ థెరపీలో వైద్యులు శరీరంలోకి చాలా సన్నని సూదులను గుచ్చుతారు. వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్సగా వేర్వేరు ప్రదేశాలలో, వేర్వేరు లోతులలో సూదులను గుచ్చుతారు. అయితే తాజాగా ఈ ఆక్యుపంక్చర్ థెరపీ టైప్ 2 డయాబెటిస్‌ (Type 2 Diabetes)ను కూడా నివారించడంలో దోహదపడుతుందని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (Edith Cowan University) నుంచి వచ్చిన ఓ కొత్త అధ్యయనం కనుగొంది. ప్రీడయాబెటిస్‌తో బాధపడుతున్న 3600కి పైగా వ్యక్తులపై ఆక్యుపంక్చర్ ప్రభావాలను కవర్ చేసే డజన్ల కొద్దీ అధ్యయనాలను ఎడిత్ కోవాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా బృందం పరిశోధించింది. వారి పరిశోధనలలో టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడంలో ఆక్యుపంక్చర్ థెరపీ సహాయపడుతుందని తెలిసింది.

ప్రీడయాబెటిస్‌తో అంటే మధుమేహం అని చెప్పేంత తీవ్రంగా లేకుండా సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండే పరిస్థితి. యూనివర్సిటీ అధ్యయనంలో ఆక్యుపంక్చర్ థెరపీ ఉపవాసం చేసే ప్లాస్మా గ్లూకోజ్ (Fasting Plasma Glucose), రెండు-గంటల ప్లాస్మా గ్లూకోజ్, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ వంటి వాటిని గణనీయంగా మెరుగుపరిచిందని తేలింది. అంతేకాకుండా, ప్రీడయాబెటిస్ ముప్పును చాలావరకు తగ్గించిందని అధ్యయన పరిశోధకులు కనుగొన్నారు. ఈ రోగులలో ప్రతికూల ప్రభావాలు కనిపించినట్లు నివేదికలు పేర్కొనలేదు.

 ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


పీహెచ్‌డీ అభ్యర్థి, ప్రధాన పరిశోధకులు మిన్ జాంగ్ మాట్లాడుతూ.. మధుమేహాన్ని నివారించడానికి ఆక్యుపంక్చర్ థెరపీ ఒక మంచి మార్గంగా తేలిందన్నారు. డయాబెటిస్ నివారించడంలో ఈ థెరపీ ఉపయోగపడుతుందని అధ్యయనంలో కనుగొనడం సంతోషంగా ఉందన్నారు. మధుమేహంతో ప్రపంచంలోని అడల్ట్ జనాభాలో 11 శాతం మంది ప్రభావితులు అవుతున్నారు. అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అంచనా ప్రకారం 2045 నాటికి దాదాపు 130 కోట్ల మందికి మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ రావచ్చు. ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో 93 శాతం మంది 20 ఏళ్లలో టైప్ 2 డయాబెటిస్‌ బారిన పడతారని మిన్ జాంగ్ చెప్పారు. అయితే మెరుగైన ఆహారం తింటూ వ్యాయామం చేస్తే ప్రీడయాబెటిస్ నుంచి బయట పడవచ్చు. కానీ చాలా మంది వ్యక్తులు తాము జీవించే శైలిని ఎప్పటికీ మార్చరు. దీనివల్ల ప్రీడయాబెటిస్ అనేది డయాబెటిస్‌గా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఆక్యుపంక్చర్ వంటి నాన్-ఫార్మకోలాజికల్ చికిత్సలు చాలా ఉపయోగపడతాయని పరిశోధకులు చెప్పారు.

ఒక సమగ్ర విధానం

మధుమేహం తరచుగా పేలవమైన జీవనశైలితో వస్తుందని అనుకుంటారు. కానీ షుగర్ వ్యాధికి ఇతర అంశాలు కూడా కారణమవ్వచ్చు. ఇలాంటప్పుడు ఆక్యుపంక్చర్ థెరపీ ఉపయోగపడొచ్చని పరిశోధకులు అన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఒక్కటే కాదు... నిద్ర సమస్యలు, అధిక రక్తపోటు, చాలా ఒత్తిడి వల్ల కూడా మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ అని పేర్కొన్నారు. అయితే ఆక్యుపంక్చర్ ఈ సమస్యలన్నిటినీ తొలగిస్తూ.. ప్రజలు వారి జీవితంలో ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుందన్నారు.ఆక్యుపంక్చర్ థెరపీలో సూదులు మాత్రమే ఉపయోగించరని.. కాంతి, విద్యుత్ పల్సెస్ వంటి ఆక్యుపాయింట్ స్టిమ్యులేషన్ టెక్నిక్‌లను కూడా యూజ్ చేస్తారని జాంగ్ చెప్పారు. మోక్సిబస్షన్ వంటి ఇతర సాంప్రదాయ చైనీస్ ఔషధ చికిత్సలు కూడా ఆక్యుపంక్చర్ థెరపీలో భాగమేనని చెప్పారు. డయాబెటిక్ వ్యక్తుల చర్మంపై సూదులు ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చని, అందుకే ఆక్యుపంక్చర్, మధుమేహంపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు చెప్పారు. ప్రీడయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్‌గా అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి మరిన్ని మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
Published by:Mahesh
First published:

Tags: Diabetes, Health care, Health Tips, Sugar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు