#alwaysramcharan : ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్... తొలి పోస్ట్ అదిరిందిగా...

Hero Ram Charan : జనరల్‌గా సోషల్ మీడియాకు దూరంగా ఉండే... మెగా హీరో రాం చరణ్... లేటుగానైనా లేటెస్టుగా వస్తూ... ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:12 AM IST
#alwaysramcharan : ఇన్‌స్టాగ్రామ్‌లో రాంచరణ్... తొలి పోస్ట్ అదిరిందిగా...
ఇన్‌స్టాగ్రాంలో రాంచరణ్ తొలి పోస్ట్ (Image : Instagram)
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 11:12 AM IST
మిగిలిన హీరోల‌తో పోలిస్తే సోష‌ల్ మీడియాను త‌క్కువ‌గా ఫాలో అయ్యే హీరో రామ్ చ‌ర‌ణ్ ఒక్కడే. ఈ మెగా హీరోకు క‌నీసం ట్విట్టర్ అకౌంట్ కూడా లేదు. ఫేస్ బుక్‌లోనే ఇప్పటికీ త‌న సినిమా ముచ్చట్లు చెబుతుంటాడు. అయితే తాజాగా జులై 8న ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టాడు చరణ్. always ram charan పేరుతో త‌న ఖాతాను ఓపెన్ చేశాడు. త‌న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మార్చేసిన లుక్‌తో ప్రొఫైల్ ఫొటో పెట్టాడు. తొలి పోస్ట్‌గా తన తల్లితో చిన్నప్పుడు... ఇప్పుడు దిగిన రెండు ఫొటోలను మిక్స్ చేసి... అప్‌లోడ్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్‌ను తెగ లైక్ చేస్తున్నారు ఫ్యాన్స్, ఫ్రెండ్స్. చాలా మంది ఈ ఫొటో చాలా బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.



 




Loading...

View this post on Instagram




 

Somethings never change !! Dedicating my first post to u. Love u Amma. ❤#mamasboy #forever.


A post shared by Ram Charan (@alwaysramcharan) on





టాలీవుడ్ యాక్టర్‌గా, మంచి డాన్సర్‌గా... రామ్ చరణ్‌కు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఇప్పటికే 4 లక్షలకుపైగా రామ్ చరణ్‌ను ఫాలో అవుతున్నారు. గంటగంట‌కూ ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. రామ్‌కి అతని భార్య ఉపాసన, ఇండస్ట్రీలో ఫ్రెండ్స్, కొలీగ్స్ వెల్‌కం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు రామ్ చెప్పిన ఓ వీడియోను ఉపాసన పోస్ట్ చేశారు.



 




View this post on Instagram




 

FINALLY HE MADE IT @alwaysramcharan #ramcharan On @instagram #‪itsgonnabeMAD‬ #friday


A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on





ఇతర నటులైన సమంతా అక్కినేని, కియారా అద్వానీ, తమన్నా బాటియా, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు అర్జున్ వంటి ఎందరో రామ్‌కి వెల్ కం చెప్పారు.



 




View this post on Instagram




 

❤️


A post shared by Allu Arjun (@alluarjunonline) on





ఇకపై RRR మూవీకి సంబంధించిన విశేషాల్ని రామ్ ట్విట్టర్ ద్వారా పంచుకుంటాడని తెలుస్తోంది. లేటుగానైనా లేటెస్ట్ కబుర్లతో వస్తున్న రామ్‌ అకౌంట్‌ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...