హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cool drinks: తస్మాత్​ జాగ్రత్త... కూల్​డ్రింక్​ తాగి చనిపోయిన యువకుడు.. ఎందుకో తెలుసా?

Cool drinks: తస్మాత్​ జాగ్రత్త... కూల్​డ్రింక్​ తాగి చనిపోయిన యువకుడు.. ఎందుకో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు (Unhealthy problems) రావడం మొదలవుతాయి. షుగర్... బ్యాక్టీరియా  వైరస్ల సంతానోత్పత్తి ప్రదేశంగా పనిచేస్తుంది. శరీరమంతా సులభంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. షుగర్ రోగనిరోధక శక్తిని కూడా అణిచివేస్తుంది. ఇటీవల చైనా (China)కు చెందిన ఓ వ్యక్తి కోకాకోలా (Coca cola) తాగి చనిపోవడం కలకలం రేపింది.

ఇంకా చదవండి ...

చాలా మంది మంచినీళ్లు తాగినంత సులభంగా కూల్ డ్రింక్స్ (Cool drinks) తాగేస్తూ ఉంటారు. అదేంటో.. ఎండాకాలం అలా చల్లని కూల్ డ్రింక్ తాగడం వల్ల వచ్చే కిక్కే వేరు. మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. అయితే.. గొంతులో దిగుతున్నప్పుడు కూల్ డ్రింక్ హాయిగా అనిపించినా.. దాని వల్ల తర్వాత అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు (experts) హెచ్చరిస్తున్నారు.ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుందట.  శరీరంలోని రోగనిరోధక శక్తి (Immunity system)పూర్తి గా తగ్గిపోతుందట. కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. అది.. ఇమ్యూన్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది. ఏదైనా అనారోగ్యం దరిచేరినప్పుడు.. దానితో యుద్దం చేసే సత్తాలో మీలో లేకుండా చేస్తుంది.  దీంతో.. ఎక్కువ శాతం అనారోగ్యానికి (unhealthy) గురయ్యే ప్రమాదం ఉంది.

చైనాలో యువకుడు మృతి..

350ఎంఎల్ కూల్ డ్రింక్ లో దాదాపు 39 గ్రాముల షుగర్ (sugar) ఉంటుంది. కాగా.. ఈ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు (Unhealthy problems) రావడం మొదలవుతాయి. షుగర్... బ్యాక్టీరియా  వైరస్ల సంతానోత్పత్తి ప్రదేశంగా పనిచేస్తుంది. శరీరమంతా సులభంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది. షుగర్ రోగనిరోధక శక్తిని కూడా అణిచివేస్తుంది. ఇటీవల చైనా (China)కు చెందిన ఓ వ్యక్తి కోకాకోలా (Coca cola) తాగి చనిపోవడం కలకలం రేపింది.

బాటిల్​ దించకుండా..

చైనాకు చెందిన ఓ వ్యక్తి 1.5 లీటర్ల కోకా-కోలా డ్రింక్‌‌ తాగేశాడు. బాటిల్ దించకుండా తాగి తన స్నేహితుల ముందు హీరో అవుదామని అనుకున్నాడు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత బాగానే ఉన్నాడు. కానీ, ఆరు గంటల తర్వాత అతడి శరీరం అదుపు తప్పింది.

కడుపు నొప్పితో..

అతడికి కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయింది. తీవ్రమైన నొప్పితో అతడు బీజింగ్‌లోని చోయాంగ్ హాస్పిటల్‌కు పరుగులు పెట్టాడు. వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా.. కడుపు (stomach) నిండా గ్యాస్ (gas) నిండిపోయినట్లు గుర్తించారు. అతడికి ‘న్యుమాటోసిస్’ ఏర్పడిందని వైద్యులు తెలిపారు. పేగు, కాలేయానికి చెందిన సిరలో గ్యాస్ నిండిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని ‘క్లీనిక్స్ అండ్ రీసెర్చ్ ఇన్ హేపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ పేర్కొంది.

ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కాలేయానికి ఆక్సిజన్ (oxygen) నిలిచిపోతుంది. దీన్నే ‘షాక్ లివర్’ అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితి వల్ల వైద్యులు కూడా అతడిని రక్షించలేకపోయారు. కాలేయం, ఇతర అవయవాల్లోకి గ్యాస్ చేరడం వల్ల అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వైద్యులు.. అతడి శరీరంలోని గ్యాస్‌ను వెలికి తీసేందుకు ప్రయత్నించారు. కాలేయం దెబ్బతినకుండా కొన్ని మందులు (medicines) కూడా ఇచ్చారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. వైద్యులు దాదాఉప 18 గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది.

(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

ఇవి కూడా చదవండి: పాలు తాగితే అధిక బరువును తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

గదిలో ఒంటరిగా కూర్చుంటే తలనొప్పి తగ్గుతుందా? మరి నొప్పి తగ్గాలంటే ఇంకేం చేయాలి?

శరీరం నుంచి దుర్వాసన అధికంగా వస్తుందా? అయితే ఈ చిట్కాలతో సమస్య నుంచి బయటపడండి


First published:

Tags: Gas, Health Tips, Life Style, Side effects, Sugar

ఉత్తమ కథలు