మీకు తెలుసా.. లవర్ ఉంటే బీపీ రాదట..

అనేక కారణాల వల్ల ఒత్తిడికి గురవుతాం.. బీపీ సర్రున లేస్తుంది. ఈ టైంలో... లవర్‌తో స్పెండ్ చేసినవి గుర్తుతెచ్చుకోండి.. డాక్టర్ అవసరం లేకుండానే సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 4:22 PM IST
మీకు తెలుసా.. లవర్ ఉంటే బీపీ రాదట..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: February 10, 2019, 4:22 PM IST
ప్రేమలో పడ్డారా.. ఇక అయిపోయినట్టే మీ పని అంటూ ఆటపట్టిస్తాం కానీ, ఆ అనుభూతి వర్ణనాతీతం. మధురం.. మధురాతి మధురం.. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా సరే.. తమ ప్రేయసి, ప్రేమికుడిని కలిసేందుకు మనసు తహతహలాడుతుంది. కలిసాక వారితో గడిపిన ప్రతీక్షణం ఎంతో అందంగా ఉంటుంది. అయితే, ఆ జ్ఞాపకాలు ఆనందమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు..
రకరకాల కారణాలతో ఒత్తిడిగా ఉన్నప్పుడు ఒక్కనిమిషం కళ్లు మూసుకుని మీ లవర్‌, వారితో గడిపిన అందమైన క్షణాలు, ఆ చిలిపి పనులు గుర్తుతెచ్చుకోవడం వల్ల బీపీ పరారైపోతుందని అరిజోన్ యూనివర్సిటీ మానసిక నిపుణులు చెబుతున్నారు.

రెండు విభాగాలపై పరీక్ష నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేత్తలు.. అందులో లవర్స్‌ని తలుచుకుని పనులు నిర్వహించిన వారు మెరుగైన టాస్కుని కనబర్చగా.. తలుచుకోని వారు.. బీపీ పెంచుకుని గుండెవేగాన్ని పెంచుకున్నారట.

కాబట్టి.. ఏదైనా పట్టరాని కోపం, ఒత్తిడిలో ఉన్నప్పుడు గబగబ మందులు మింగి వైద్యుల దగ్గరికి పరిగెత్తడం కంటే.. ఈ చిట్కా పాటించడని చెబుతున్నారు.
మరి.. మీరూ ట్రై చేయండి..
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...