Health Study: మీ భార్య సంతోషంగా ఉంటే.. మీకు పండగే

దాంపత్య జీవితంలో భార్యభర్తలిద్దరికీ సమాన బాధ్యతలు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. భార్య ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా.. భర్తకు, పిల్లలకు సపర్యలు చేస్తుంది.

news18-telugu
Updated: April 26, 2019, 12:36 PM IST
Health Study: మీ భార్య సంతోషంగా ఉంటే.. మీకు పండగే
రిలేషన్‌షిప్
  • Share this:
వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. క‌ష్ట‌ న‌ష్టాలు వ‌చ్చినా, సుఖదుఃఖాలు కలిగినా షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. దాంపత్య జీవితంలో భార్యభర్తలిద్దరికీ సమాన బాధ్యతలు ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇక, ఇల్లు, కుటుంబ విషయానికి వస్తే ఇల్లాలి పాత్రే కీలకం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా.. భర్తకు, పిల్లలకు సపర్యలు చేస్తుంది. ఏ బాధ ఉన్నా తనలో దాచుకొని పైకి చిరునవ్వుతో కనిపిస్తుంది. అయితే, భార్య బాగుంటేనే ఇంటిల్లిపాదికి మంచిదట. ఆమె సంతోషంగా ఉంటే ఆమెకే కాదు.. భర్త కూడా ఎక్కువ రోజులు సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తారని తాజా అధ్యయనం చెబుతోంది.

భార్య సంతోషం.. భర్త మానసిక, శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నెదర్లాండ్స్‌లోని టిల్బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 50 ఏళ్లు దాటిన 4400 జంటలపై పరిశోధనలు చేయగా, భార్య ఎక్కువ సంతోషంగా ఉన్న భర్తలు ఆరోగ్యంగా ఉన్నట్టు, భార్య సంతోషంగా లేని భర్తలు తరచూ అనారోగ్యాలకు గురవుతున్నట్లు తేలిందట. ఆ ప్రభావం జీవన శైలిపైనా పడుతుందని పరిశోధకులు తెలిపారు. భార్య ఆనందంగా ఉంటేనే భర్త ఎక్కువ కాలం జీవిస్తాడని పేర్కొన్నారు.
First published: April 26, 2019, 12:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading