Tea for Rs.1000: అతడి స్టాల్‌లో టీ ధర రూ. వెయ్యి.. వామ్మో అంత రేటా? ఎందుకు?

పార్థ గంగూలీని చుట్టుపక్కల ప్రజలు ముద్దుగా 'పార్థ బాబూ' అని పిలుచుకుంటారు. కొన్ని రకాల టీలకు ముందే అడ్వాన్స్ చెల్లిస్తుంటారు అక్కడి స్థానికులు.

news18-telugu
Updated: November 21, 2020, 10:47 PM IST
Tea for Rs.1000: అతడి స్టాల్‌లో టీ ధర రూ. వెయ్యి.. వామ్మో అంత రేటా? ఎందుకు?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉదయాన్నే టీ తాగనిదే చాలా మందికి రోజు ప్రారంభమవదు. కేవలం తెల్లవారుజామునే మాత్రమే కాదు.. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. అప్పుడప్పుడై సరదాగా చాయ్ తాగడం మనలో చాలా మందికి అలవాటు. కాస్త మానసికంగా ఒత్తిడి అనిపించినా.. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినా.. టీ తాగుతుంటాం. మరి ఈ టీ రేటు ఎంతుంటుంది? రూ.5తో మొదలుకొని.. మహా అయితే రూ.20 వరకు ఉంటుంది. కానీ అతడి స్టాల్‌లో మాత్రం కప్పు టీ రూ. వెయ్యి. అవును ఇది నిజం. మరి ఆ చాయ్‌కి అంత రేటు ఎందుకు? అందులో ఏం కలుపుతారు?

కోల్‌కతాలో గంగూలీ టీ స్టాల్ చాలా ఫేమస్. రోడ్డు పక్కనే టీ స్టాల్ నడిపే పార్థ ప్రతిమ్ గంగూలీ.. గతంలో ఓ ప్రైవేట్ జాబ్ చేసేవాడు. కానీ ఇతడికి టీ అంటే ఎంతో ఇష్టం. అందుకే మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకొని.. 2014లో టీ వ్యాపారంలోకి దిగాడు. ముకుంద్‌పూర్‌లో నిర్జాస్ టీ పేరిట టీ స్టాల్ పెట్టేశాడు. ఒక రకంగా అది టీ బార్ లాంటిది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లభించే 115 రకాల చాయ్‌లు అందుబాటులో ఉంటాయి. కేజీకి రూ. 2.8 లక్షలు పలికే జపాన్‌ స్పెషల్ టీ సిల్వర్ నీడిల్ వైట్ టీ, రూ. 50వేలు నుంచి రూ.32 లక్షల వరకు ధర పలికే ఉండే (Bo-Lay) టీ కూడా లభిస్తుంది.

చమోమైల్ టీ (Chamomile teap-Rs 14,000/kg), హిబిస్కస్ (Hibiscus tea- Rs 7,500/kg), రూబియస్ (Roobios tea-Rs 20,000/kg), ఒకాయ్టి (Okayti Tea-Rs 32,000/kg), లావెండర్ (Lavender tea-Rs 16,000/kg), బై ముదాన్ (Bai Mudan tea-Rs 20,000/kg) వంటి టీ కూడా గంగూలీ స్టాల్‌లో దొరుకుతాయి. అంతేకాదు కేజీకి రూ.14కే లభించే యెర్బా టీ కూడా ఇక్కడ దొరుకుతుంది. వీటితో పాటు చాకొలేట్, వైట్ టీ, మైజ్ టీ, బ్లూ టీ సైతం విక్రయిస్తాడు గంగూలీ.

ఇంత రేటు పెడితే ఎవరైనా టీ కొంటారా... అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ ఇతడి స్టాల్ మీదుగా వెళ్లే ప్రతి 1000 మందిలో 100 మంది ఖచ్చితంగా అక్కడ ఆగి టీ తాగుతారు. గంగూలీ స్టాల్‌లో వెయ్యి రూపాయలకు అమ్మే టీ ఏంటో తెలుసా..? జపనీస్ వైట్ లీఫ్ టీ. ఈ ప్రీమియం టీకి వెయ్యి రూపాయలు అంత ఎక్కువ ధరేమీ కాదని చెబుతాడు గంగూలీ. ఇక్కడ ఎక్కువ మంది మాత్రం మస్కటెల్ టీని తాగుతారు.

పార్థ గంగూలీని చుట్టుపక్కల ప్రజలు ముద్దుగా 'పార్థ బాబూ' అని పిలుచుకుంటారు. కొన్ని రకాల టీలకు ముందే అడ్వాన్స్ చెల్లిస్తుంటారు అక్కడి స్థానికులు. కేవలం టీ అమ్మడం మాత్రమే కాదు.. టీ పౌడర్‌ని కూడా విక్రయిస్తాడు గంగూలీ. అన్ని రకాల ముడి టీని అమ్ముతాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇక్కడకు వచ్చి బ్యాగులు బ్యాగులు తీసుకెళ్తారని న్యూస్‌18తో మాట్లాడుతూ చెప్పాడు పార్థ గంగూలీ. ఎప్పుడైనా కోల్‌కతా వెళ్తే మీరూ గంగూలీ టీని ట్రై చేయండి.
Published by: Shiva Kumar Addula
First published: November 21, 2020, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading