హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ఈ ఏడాది కరోనా కల్లోలమే కాదు.. గుర్తుంచుకోదగ్గ గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి.. అవేంటంటే..

ఈ ఏడాది కరోనా కల్లోలమే కాదు.. గుర్తుంచుకోదగ్గ గుడ్ న్యూస్ కూడా ఉన్నాయి.. అవేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Good News in 2020: కరోనా వైరస్ గుబులు, లాక్‌డౌన్‌, కోవిడ్-19 వ్యాక్సిన్‌.. ఈ మూడు అంశాలు ఈ సంవత్సరాన్ని చరిత్రలో గుర్తుండిపోయేలా చేశాయి. వీటితో పాటు ఈ ఏడాది కొన్ని ఆవిష్కరణలు కూడా జరిగాయి. మనకు మంచి చేసే పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి. వాటిలో కొన్ని...

ఇంకా చదవండి ...

2020 ముగింపు దశకు వచ్చింది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సంవత్సరం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 2020 అంటేనే కరోనా మహమ్మారి గుర్తుకొచ్చేంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంపన్న, పేద దేశాలనే తేడా లేకుండా.. అన్ని ప్రపంచ దేశాలకు ఈ ఏడాది ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కరోనా వైరస్ గుబులు, లాక్‌డౌన్‌, కోవిడ్-19 వ్యాక్సిన్‌.. ఈ మూడు అంశాలు ఈ సంవత్సరాన్ని చరిత్రలో గుర్తుండిపోయేలా చేశాయి. వీటితో పాటు ఈ ఏడాది కొన్ని ఆవిష్కరణలు కూడా జరిగాయి. మనకు మంచి చేసే పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి. వాటిలో కొన్ని...

క్యాన్సర్‌కు మందు..

క్యాన్సర్‌కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ మంచి ఫలితాలను ఇచ్చిందని జూలైలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో క్యాన్సర్ మందులపై చేస్తున్న అధ్యాయనాలు మరో మెట్టు ఎక్కాయి. ఈ వ్యాక్సిన్ బ్లడ్ క్యాన్సర్‌(blood cancers)కు చికిత్స చేయటానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, మూత్రపిండం, అండాశయాలకు వ్యాపించే భయంకరమైన క్యాన్సర్‌ల బారిన పడినవారి ప్రాణాలను కాపాడవచ్చని అధ్యయన బృంద సభ్యుడు, అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్టెన్ రాడ్‌ఫోర్డ్ (Kristen Radford) చెప్పారు. క్వీన్‌ల్యాండ్ యూనివర్సిటీ (The University of Queensland), ఆస్ట్రేలియా ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్‌(Australia’s Translational Research Institute) సంయుక్తంగా ఈ పరిశోధన చేశాయి.

ఉద్గారాలను తగ్గించేందుకు ముందుకొచ్చిన కంపెనీలు

గతేడాదితో పోలిస్తే కాలుష్యాన్ని, ఉద్గారాలను తగ్గించేందుకు ముందుకు వచ్చి.. నెట్‌-జీరో ప్లెడ్జ్ (Net-zero pledges) కార్యక్రమంలో భాగమైన సంస్థలు రెట్టింపు అయ్యాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ సెప్టెంబరులో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (United Nations Framework Convention on Climate Change- UNFCCC) ఈ వివరాలను వెల్లడించింది. 11.4 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆదాయం ఉండే కంపెనీలు ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి హామీ ఇచ్చాయి. ఈ శతాబ్దం చివరినాటికి ఉద్గారాలను సున్నాకు పరిమితం చేసి, వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేస్తామని వివిధ సంస్థలు వెల్లడించాయి. ఫేస్‌బుక్, ఫోర్డ్ వంటి పెద్ద కంపెనీలు, ఆస్ట్రేలియాలో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్ వంటి ప్రాంతాలు UN రేస్ టు జీరో క్యాంపెయిన్‌లో చేరాయి.

ఆకలి తీర్చినందుకు నోబెల్ ప్రైజ్

2020 సంవత్సరానికి గానూ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ (World Food Programme) నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ద్వారా గతేడాది 88దేశాల్లో.. సుమారు 100 మిలియన్లమందికి ఆహారాన్ని సరఫరా చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార అభద్రత, ఆకలి చావులు నమోదవుతున్న దేశాలు... కరోనా మహమ్మారి, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో కోట్లమందికి ఆహారం అందింది.

3D eye ఆవిష్కరణ

దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు 3D eyeను శాస్త్రవేత్తలు జూన్‌లో అభివృద్ధి చేశారు. దీని ద్వారా హ్యూమనాయిడ్ రోబోలకు చూపును తీసుకువచ్చే అవకాశంపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (HKUST) శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ది చేశారు. కొన్ని విషయాల్లో మనుషుల కళ్లకంటే తాము రూపొందించిన 3D eye పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. 3D ఆర్టిఫిషియల్ రెటినా(3D artificial retina)ను నానోవైర్ లైట్ సెన్సార్లతో తయారు చేశారు. ఫోటోరిసెప్టర్ల విషయంలో ఇది మనుషుల రెటినా మాదిరిగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

చట్టసభల్లో పెరిగిన మహిళల ప్రాతినిధ్యం

వివిధ దేశాల చట్టసభల్లో ఈ సంవత్సరం మహిళల ప్రాతినిధ్యం పెరిగినట్లు వరల్డ్ ఉమెన్ రిపోర్ట్‌-2020 (World’s Women report 2020) అక్టోబర్లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటులోకి అడుగుపెట్టిన మహిళల సంఖ్య రెట్టింపు అయ్యిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2020లో పార్లమెంటరీ స్థానాల్లో మహిళల సంఖ్య 25 శాతానికి చేరుకోవడం విశేషం. ప్రస్తుతం 20 దేశాలకు అధ్యక్ష్యులుగా లేదా ప్రధానమంత్రిగా మహిళలు ఉన్నారు.

చంద్రునిపై నీటి జాడలు

చంద్రుడిపై విస్తృత స్థాయిలో నీటి వనరులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఈ అక్టోబరులో కనిపెట్టింది. చంద్రుడిపై ఉండే నీటిని భవిష్యత్తు మిషన్లకు తాగునీరు, ఇంధన అవసరాలకు ఉపయోగించవచ్చని నాసా ప్రకటించింది. 2024లో నాసా చంద్రుడి మీదకు మొదటిసారిగా ఒక మహిళను పంపేందుకు ప్రయోగాలు చేస్తోంది. దీంతో పాటు జాబిల్లి మీదకు వ్యోమగాములను పంపించి, అక్కడ మనుషులు ఇళ్లను నిర్మించుకోవడానికి ఉన్న అవకాశాలను గుర్తించేందుకు ప్రణాళిక రచిస్తోంది.

First published:

Tags: Cancer, Corona, Year Ender 2020

ఉత్తమ కథలు