వయసు 83.. మనవలకు కథలు చెబుతు.. పూజలు చేస్తూ కాలక్షేపం చేయాల్సిన ఆమె ట్రెండ్ సెట్టర్ అవుతోంది. అందరిలా ఇంటికే పరిమితం కాకుండా ఈ వయసులోనూ కసరత్తులు చేస్తోంది. చెన్నైకి చెందిన కిరణ్‌బాయి తన మనవడి ప్రోత్సాహంతో హుషారుగా జిమ్ చేస్తూ ఆరోగ్యంలో.. బలంలో తనతో పోటీ పడగలరా అని యువకులకు సవాల్ విసురుతోంది. చైన్నై ఆర్.ఏ పురం లో నివాసం ఉండే కిరణ్ బాయి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ఆమె జిమ్ వర్కవుట్స్ వీడియోలకు లక్షలాది అభిమానులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉండే సహజమైన నిరాసక్తతగాని, నిర్లిప్తతగాని ఎక్కడా కనిపించదు. ఇప్పటికే ఆమె తన శరీరాన్ని బాలాన్ని పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తోంది. చెన్నైలో పుట్టి పెరిగిన కిరణ్‌బాయి చిన్నప్పటి నుంచి ఆటల్లో చాలా చురుగ్గా ఉండేవారంట.. ఈత కొట్టడం. పెళ్లయ్యాక ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చేయడం అలవాటు. ఆ రోజుల్లో మసాలాలు నూరేవాళ్లమని. నీళ్లు పైకి కిందకి మోసేవాళ్లమని. పశువుల పాలు పితికే వాళ్లమని. ఇవన్నీ తాను ఉత్సాహంగా చేసేదాన్ని అంటూ చెబుతున్నారు బామ్మ. అందుకే ఆరోగ్యంగా ఉండేదాన్ని అంటున్నారు. ఆమె తల్లిగా మారినా, బామ్మ వయసుకు చేరినా అంతే ఉత్సాహంగా ఉంటున్నారు. అంతేకాదు తమ కాలనీలో తానే అందరి కంటే హుషారైన బామ్మని అంటున్నారు.
ఏడాది క్రితం మాత్రం ఊహించని సంఘటన భయపెట్టింది ఆమెను. ఇలా హుషారుగా ఉంటున్న కిరణ్ బాయి ఒకరోజు మంచం మీద నుంచి లేస్తూ కింద పడింది. ఆమె కాలు బాగా బెణికింది. ఆ సమయంలో ఆమెకు తన స్వభావానికి తగని నిర్లిప్తత వచ్చిందని. తన జీవితం ముగింపుకు వచ్చేసిందని... ఇక తాను ఎప్పటికీ మామూలు మనిషిని కాలేను అనే భావనకు వచ్చేసేను అంటూ కన్నీరు పెట్టించిన గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆమె అలా డల్ కావడం గమనించిన కుటుంబ సభ్యులు చైన్నైలోనే ఆల్వార్‌పేటలో ఉంటున్న ఆమె మనవడు చిరాగ్‌కు పరిస్థితిని చెప్పారు. చిరాగ్‌కు సొంత జిమ్ ఉంది. సర్టిఫైడ్ జిమ్ ట్రైనర్ అతడు. దీంతో బామ్మ బాగోగులు తానే చూసుకోవాలి అనుకున్నాడు.
ఇదీ చదవండి: అమ్మ బ్రహ్మ దేవుడో... ఆ పని చేస్తూ ఇంత అందమా..?
చిరాగ్ ఆమె కోసం ఇంట్లోనే తాత్కాలికమైన జిమ్‌ను ఏర్పాటు చేశాడు. కొద్దిపాటి పరికరాలతో ఇంట్లో ఉన్న వస్తువులతో అతడు తయారు చేసిన జిమ్‌లో వారానికి మూడు రోజులు ఆమె ఎలా వర్కవుట్స్ చేయాలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిరణ్‌బాయి ముందు అనాసక్తిగా ఉన్నా తర్వాత వాటిని మొదలెట్టింది. సరిగ్గా మూడు నెలలు గడిచాయి. కిరణ్ బాయి మునుపటి కిరణ్బాయిగా మారిపోయింది. ఆమెకు శరీరం దారిలో పడింది. మనసుకు ఉత్సాహం వచ్చింది. మనవడితో కలిసి హుషారుగా వీడియోలు చేసింది. ఆ వీడియోలతో ఆమెకు పేరు వచ్చింది.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆర్టీఏ గుడ్ న్యూస్... జూలై 1 నుంచి..
ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా చేశారు. జిమ్ చేయడం వల్ల వృద్ధులలో కూడా కండరం శక్తిమంతం అవుతుంది. వాళ్ల ఎముకలు దృఢం అవుతాయి. శరీరం మీద బేలెన్స్ వస్తుంది. అంతే కాదు మెదడు కూడా చురుగ్గా తయారవుతుంది. మా బామ్మ ఇప్పుడు తను టాయిలెట్‌కు వెళ్లినా కింద కూచున్నా తనే లేవగలదని చిరాగ్ అంటున్నాడు.
ఇదీ చదవండి: ఈ-కామర్స్ ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం! మీ అభిప్రాయాలు చెప్పొచ్చు..ఏం చేయాలంటే
కిరణ్ బాయి తన మనవడు చెప్పినట్టుగా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా జిమ్ చేస్తుంది. తాను రోజూ కట్టుకునే చీరలోనే ఆ వ్యాయామాలన్నీ చేస్తుంది. జిమ్ పరికరాలతో కాకుండా కాళ్లతో సోఫా జరపడం, కుర్చీని కదల్చడం వంటివి కూడా చేస్తుంది. తన పనులు తాను చేసుకోలేనేమోననే భయం ఇక పోయింది అంటున్నారు బామ్మ. ఈ వయసులో ఇంత పేరా బామ్మా’ అని అడిగితే ‘అంతా నా మనవడి దయ’ అని మనవడికి ముద్దు పెడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gym, Old is gold, Old women