Home /News /life-style /

8 LIFE STYLE CHANGES TO PROTECT YOUR HEALTH RNK

Heart stroke: మీ లైఫ్‌స్టైల్‌లోని.. ఈ 8 మార్పులు గుండెను కాపాడతాయి! అవేంటో తెలుసా..?

గుండెనొప్పి

గుండెనొప్పి

గుండెను పదిలంగా కాపాడటానికి మీ లైఫ్‌స్టైల్లో చేయాల్సిన కచ్ఛితమైన మార్పులు.. తేలిగ్గా తీసుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల గుండె సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. చిన్న వయస్సులేనే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా కార్డియోవాస్క్యూలర్‌ డిసీజ్‌ (CVD) బారిన పడి దాదాపు 17.9 మిలియన్‌ మంది బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం గుండె సంబంధిత సమస్యలతోనే చనిపోతున్నారు. అందులో 85 శాతం హార్ట్‌ అటాక్ (Heart attack), స్ట్రోక్‌ ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన కారణం వారి జీవనశైలి. ఆరోగ్యకరమైన డైట్‌ను (Healthy diet) ఫాలో అవ్వకపోవడమే. గుండెనొప్పి ఎప్పుడు వస్తుందో గుర్తించడం చాలా కష్టం. కానీ, కొన్ని నియమాలను పాటిస్తే తప్పకుండా ప్రమాదం తగ్గుతుంది.

గుండె నొప్పికి కారణాలు..
ఊపిరితిత్తులు, పక్కటెముకల మధ్య ఉండే గుండె, మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. బరువు 300–450 బరువు వరకు ఉంటుంది. గుండె ద్వారా పంప్‌ చేసిన రక్తం మన శరీరానికి పని చేయడానికి అవసరమయ్యే ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరోనరీ ఆర్డరీలు బ్లాక్‌ అవుతే అప్పుడు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫలకాలలో కొవ్వు ఏర్పడటం వల్ల కాలక్రమేణా ఇది పెరుగుతూ ఉంటుంది. ధమనులు ఇరుకుగా మారి గుండె,  శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని పంపడం కష్టతరం అవుతుంది. దీన్ని నివారించడానికి జీవనశైలిలో (Lifestyle) మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆహారంలో మార్పులు..
మొదటగా ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. సమతూల్యమైన న్యూట్రియెంట్స్‌ ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు చెక్‌ పెడతాయి. శరీరంలో బీపీ, కొలెస్ట్రాల్ (Cholestral), షుగర్‌ లెవల్స్‌ పెరగడంతో గుండె పనితీరుపై ప్రభావం పడుతుంది. రానురాను గుండెపోటుకు దారితీస్తుంది. ఆహారంలో న్యూట్రిషన్‌ ఫుడ్, విటమిన్స్, మినరల్స్‌ ఉన్న డైట్‌ను తీసుకోవాలి. రీఫైన్డ్‌ ఆహార పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తీసుకోకూడదు.

యాక్టీవ్‌గా ఉండాలి...
దీర్ఘకాలం పాటు ఏ వ్యాధుల లేని జీవితాన్ని గడపడానికి యాక్టివ్‌గా ఉండాలి. అంటే ఖరీదైన జిమ్‌లకు వెళ్లడం కాదు. రోజులో ఎక్కువ సమయం ఇంటి పనిలో నిమగ్నమై ఉన్నా.. నడక కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడూ స్థిరంగా ఉండకుండా.. ఎప్పుడూ కదులుతూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఈ వ్యాయామాలు గుండె కండరాలను బలోపేతం చేస్తాయి.

హై బ్లడ్‌ ప్రెషర్‌..
హై బీపీ గుండె పనితీరును డ్యామేజ్‌ చేస్తుంది. నిరంతరం అధిక రక్తపోటు ధమనులను తక్కువ సాగేలా చేయడం ద్వారా దెబ్బతింటుంది. ఇది గుండెకు ఆక్సిజన్‌ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. తక్కువ రక్తపోటు కూడా గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా హృదయ స్పందన రేటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, దాన్ని స్థిరంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి.

షుగర్‌ను నియంత్రణలో...
హై బీపీ వల్ల డయాబెటిక్‌ గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. డయాబెటీస్‌ గుండె నాళాలను పాడు చేస్తాయి. 68 శాతం.. 65 కంటే ఎక్కువ వయస్సు డయాబెటిక్‌ (Diabetes) రోగులు గుండెనొప్పితోనే చనిపోతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి. నెలలో రెండుమార్లు షుగర్‌ పరీక్ష చేసుకోవాలి.

కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయండి..
కొలెస్ట్రాల్‌ కొంత భాగం కొవ్వు, ప్రోటీన్‌ నుంచి తయారైన లిపిడ్‌. ఆరోగ్యకరమైన కణాలకు, శరీరానికి వెచ్చగా ఉండటానికి ఇది అవసరం. కానీ, అధిక చెడు కొలెస్ట్రాల్‌ ధమనుల్లో జమ చేస్తాయి. దీంతో గుండెకు ఒత్తిడి పెరిగుతుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

ఆల్కహాల్‌కు దూరంగా ..
ఎక్కువ ఆల్కహాల్‌..   స్మోకింగ్‌  (Chain smoking) రెండూ కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని పెంచేవి. సిగరేట్లు, ఆల్కహాల్‌ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. తద్వారా బరువు కూడా పెరుగుతారు. అందుకే వీటికి దూరంగా ఉండటమే మేలు.మానసిక ఒత్తిడి..
మానసిక ఆరోగ్యం, ఫిజికల్‌ ఫిట్నెస్‌ (Physical fitness) ఒకదానితో మరోటి ముడిపడి ఉంటుంది. అధిక ఒత్తిడి మెదడులో కార్యకపాలను ఒకవైపు పెంచుతుంది. ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది. గుండెపోటు ఇతర వ్యాధులకు దారితీస్తుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Alcohol, Heart Attack, Lifestyle, Smoking habbit

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు