8 Ideas for everymonth savings: ప్రతినెలా మీ లెక్క-పక్కాగా ఉండేందుకు 8 ఐడియాస్.. దీంతో మీ మనీ సేవింగ్ పక్కా!
ప్రతీకాత్మక చిత్రం
Money saving tips: సాధారణంగా మనమందరం ఎప్పటికప్పుడు బెట్టర్ పొజిషన్లో ఉండటానికి ప్రయత్నిస్తాం. దానికి కొన్ని నియమాలు, కట్టుబడి ఉండాలి. ప్రతినెలా మన ఇంటి ఖర్చుల్లో కొన్ని లెక్కలపై పక్కాగా ఉండే 8 ఐడియాలు ఏంటో తెలుసుకుందాం.
8 Ideas for every month savings: ప్రతీనెలా డబ్బులు ఆదా (Monthly savings) చేయడానికి, గతం కంటే ది బెస్ట్ గా ఉండటానికి మనం ప్రయత్నిస్తాం. ఇంట్లో ఉన్నా.. పనికి కోసం బయటికి వెళ్లాల్సి వచ్చినా.. డబ్బు ఆదా చేయడానికి 8 మార్గాలు (money saving ideas) ఉన్నాయి. చిన్న మార్పులు చేయడం వల్ల బెట్టర్ రిసల్ట్స్ (Better results) పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
సబ్ స్క్రప్షన్స్ ..స్టాప్ చేయండి..
మీరు రకరకాల యాప్స్, మ్యాగజైన్లను సబ్ స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా తక్కవగా ఉపయోగించే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేసుకోండి. ప్రతినెలా ఇలా చేయడం వల్ల మీరు ఎంత డబ్బు ఆదా చేస్తున్నారో మీరు రానురాను తెలుసుకుంటారు. మీకు అవసరమున్న ఒకటి లేదా రెండింటిని మాత్రమే సబ్ స్క్రైబ్ చేసుకోండి.
షాపింగ్..
ప్రతినెలా గ్రోసరీ షాపింగ్ చేయడం మనందరికీ ఉంటే అలవాటే. అయితే, దీనికి ముందుగానే ఇంట్లోనే లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్లండి. అదికూడా ఎక్కడ ఎక్కువ డిస్కౌండ్ దొరుకుతుందో తెలుసుకుని కొనండి. ఇలా చేస్తే కూడా ప్రతినెలా డబ్బు ఆదా అవుతుంది.
ఇన్వెస్ట్ మెంట్..
మీ దగ్గర ప్రతినెలా ఖర్చుపోయి డబ్బులు మిగిలితే వివిధ రకాల స్కీం లలో పెట్టుబడులు పెట్టండి. దీనికి ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న తెలిసిన మంచి వ్యక్తలను ఆరాతీయండి. మీ మనీకి బెస్ట్ రేట్ ఎక్కడ వస్తుందో అప్పుడు తెలుస్తుంది.
బయట ఫుడ్ కి బ్రేక్..
దీన్ని అనుసరిస్తే మీ పాకెట్ మాత్రమే కాదు.. మీ ఆరోగ్యం కూడా దృడంగా మారుతుంది. ప్రతినెలా రెండుమూడు సార్లు బయటకు వెళ్లండి కానీ, ఇంటి భోజనానికే ప్రాముఖ్యతనివ్వండి. మీకిష్టమైన చికెన్, సూప్స్ తయారు చేస్తుంటే మీలో ఉన్న మంచి చేఫ్ కూడా బయటకు వస్తాడు. మీకు ఇప్పటికే మెయిడ్ ఉంటే వారితో చేయించుకోండి. దీనివల్ల మీ డబ్బు చాలా ఆదా అవుతుంది.
పిగ్గీ బ్యాంక్..
ఇది కేవలం పిల్లలకు మాత్రమే అవసరమవుతుందని కాదు. మీ చేతిలో ఉండే చిన్న అమౌంట్ రూ.10, 50 కూడా ప్రతిరోజు దాచిపెడితే పనికి వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ మనీ యాడ్ చేస్తే.. అది మరీ మంచిది. దాన్ని అలాగే ఫుల్ అయ్యే వరకు పెట్టండి. కావాలంటే ఇంకో పిగ్గీ బ్యాంక్ తెచ్చుకోండి. ఇలా ఒక 10 పిగ్గీ బ్యాంకులు ఉంటే అవన్ని నిండాక వాటిని పగులకొట్టి ఫిక్సెడ్ డిపాజిట్ లేదా గోల్డ్ కొనుక్కోవచ్చు.
లెక్కా-పక్కా..
ఇది మన పెద్దవారు మనకు ఎప్పుడో చెప్పారు ప్రతీదానికి ఓ లెక్క ఉండాలని. దీనికి కారణం కూడా ఉంటుంది కదా.. ఇలా ప్రతినెలా మన ఖర్చులు లెక్క వేయడం వల్ల మనం ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. ఎక్కడ మనకు సేవ్ అయిందో తెలుస్తుంది. వచ్చే నెల ఇంకాస్త డబ్బు ఆదా చేయవచ్చు. ఇంకా మీరు డబ్బు మిస్సైతే కూడా మీకు వెంటనే తెలుస్తుంది.
కరెంట్ బిల్..
దీన్ని తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీరు ఉండే గదిలో మాత్రమే లైట్స్ వేసుకోండి. నిరుపయోగంగా ఉండే వాటిని స్వీచ్ ఆఫ్ చేయండి. టీవీ ఆఫ్ చేసి ఏదైనా మంచి పుస్తకం చదవండి. దీనివల్ల మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఏదైనా యాక్టివిటీని చేయండి. దీనివల్ల మీ కళ్లకూడ శ్రమ తగ్గుతుంది, మీ హాబీస్ ఏంటో చేయండి. దీనికి ఏ కరెంట్ ఖర్చు ఉండదు.
జిమ్@హోం..
జిమ్ కు వెళ్లడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇందులో నో డౌట్. అయితే, ఇంట్లోనే ఎక్సర్ సైజ్ చేయొచ్చు కదా? లాక్ డౌన్ నుంచి లైవ్ జుంబా క్లాసెస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రతినెలా ఇంట్లోనే జిమ్ చేసుకోవచ్చు. వీలైతే కొన్ని జిమ్ పరికరాలు తెచ్చుకోండి. ఇంట్లో ఉంటే ఫర్నిచర్ ని కూడా ఫుల్ గా వాడేయండి..
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.