• HOME
 • »
 • NEWS
 • »
 • LIFE-STYLE
 • »
 • 79 YEAR OLD PUNE WOMAN LIVING IN A HOUSE WITHOUT ELECTRICITY KNOW WHY SS

OMG: జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు... ఎందుకో తెలుసా?

OMG: జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు... ఎందుకో తెలుసా?

OMG: జీవితంలో ఒక్కసారి కూడా కరెంట్ వాడని 79 ఏళ్ల వృద్ధురాలు... ఎందుకో తెలుసా? (image: @ANI/twitter)

జీవితాంతం కరెంట్ లేకుండా బతకడం సాధ్యమా? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా! ఓ మహిళ తన జీవితమంతా కరెంట్ ఉపయోగించలేదు. ఆమె వయస్సు 79 ఏళ్లు.

 • Share this:
  వేసవికాలంలో ఓ గంట సేపు కరెంట్ లేకుండా ఉండగలరా? వామ్మో అస్సలు సాధ్యం కాదు. ఓ గంట సేపు విద్యుత్ నిలిపేస్తే విలవిల్లాడిపోతారు. మళ్లీ కరెంట్ వచ్చిందంటే ప్రాణం లేచి వచ్చినట్టవుతుంది. ఓ రోజంతా పవర్ కట్ ఉంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. సెల్‌ఫోన్‌లో బ్యాటరీ డౌన్ అవుతుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంట్లో ఫ్యాన్ తిరగదు. ఫ్రిజ్ పనిచేయదు. ఇలా చెప్పుకుంటూ పోతే బతుకంతా కరెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. మరి అలాంటిది జీవితాంతం కరెంట్ లేకుండా బతకడం సాధ్యమా? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా! ఓ మహిళ తన జీవితమంతా కరెంట్ ఉపయోగించలేదు. ఆమె వయస్సు 79 ఏళ్లు.

  Viral news, Pune Budhwar Peth, Pune professor, pune woman, Dr Hema Sane, Hema Sane living without electricity, Viral news, పూణె బుధ్వార్‌పేట్, పూణె ప్రొఫెసర్, పూణె వృద్ధురాలు, హేమా సానె, డాక్టర్ హేమా సానె, వైరల్ న్యూస్
  (image: @ANI/twitter)


  ఆమె పేరు హేమా సానే. వయస్సు 79 ఏళ్లు. మాజీ ప్రొఫెసర్. పూణెలోని బుధ్వార్ పేఠ్‌లో నివసిస్తారామె. ఆమె ఇంటికి కరెంట్ లేదు. ఇప్పుడు కాదు... మొదట్నుంచీ ఆమె ఇంటికి అసలు కరెంటే లేదు. పర్యావరణం, ప్రకృతిపై ప్రేమతో ఆమె కరెంట్‌ను ఉపయోగించట్లేదు. ఆమె ఇల్లు పూరిగుడిసెలా ఉంటుంది. అది తన ఇల్లు కాదు తన పెంపుడు శునకం, రెండు పిల్లులు, ముంగీస, పక్షుల నివాసమని, వాటిని చూసుకోవడానికే ఇక్కడ ఉన్నానని అంటారామె.

  తిండీ, నీడ, బట్టలు ప్రాథమిక అవసరాలు. ఒకప్పుడు అసలు ఎలక్ట్రిసిటీ లేదు. తర్వాత వచ్చింది. విద్యుత్ లేకపోయినా అన్నీ మేనేజ్ చేసుకోగలను. ప్రజలంతా నన్ను పిచ్చిదాన్నని అంటారు. నేను పిచ్చిగా ఉండొచ్చు. నేనేం పట్టించుకోను. నా బతుకు నాది. నాకు ఇలా ఉండటమే ఇష్టం. ఎలక్ట్రిసిటీ లేకుండా మీరు ఎలా ఉండగలరని ఎవరైనా అడిగితే, అసలు ఎలక్ట్రిసిటీతో మీరెలా బతుకుతున్నారని నేను ఎదురు ప్రశ్నిస్తాను.
  హేమా సానే, 79 ఏళ్ల మాజీ ప్రొఫెసర్


  Viral news, Pune Budhwar Peth, Pune professor, pune woman, Dr Hema Sane, Hema Sane living without electricity, Viral news, పూణె బుధ్వార్‌పేట్, పూణె ప్రొఫెసర్, పూణె వృద్ధురాలు, హేమా సానె, డాక్టర్ హేమా సానె, వైరల్ న్యూస్
  (image: @ANI/twitter)


  సావిత్రీబాయి ఫూలే పూణె విశ్వవిద్యాలయంలో బాటనీలో పీహెచ్‌డీ చేశారు హేమా సానే. పూణెలోని గర్వారే కళాశాలలో ప్రొఫెసర్‌గా చాలా ఏళ్లు పనిచేశారు. పర్యావరణం, వృక్ష శాస్త్రంపై అనేక పుస్తకాలను రాశారు. ఆ పుస్తకాలు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పటికీ ఆమె పుస్తకాలు రాస్తుంటారు. పూణెలోని బుధ్వార్ పేఠ్‌లో చిన్న గుడిసెలో నివసిస్తారామె. ఆమె ఇంటి చుట్టూ అన్నీ చెట్లు, పక్షులే. ఆ పక్షుల కిలకిలరావాలతో రోజూ తెల్లవారుతుంది. ఆ పక్షులే ఆమెకు తోడు. వాటి కోసం ఆ ఇంటిని కూడా అమ్మట్లేదు. రాత్రయిందంటే ఆ ఇంట్లో దీపపు కాంతులు కనిపిస్తుంటాయి. ఎవరికీ సందేశం ఇవ్వడం ఇష్టంలేని హేమా సానే... మీ సొంత మార్గాన్ని మీరే వెతుక్కోవాలనే బుద్ధుడి సందేశాన్ని నమ్ముతారు.

  Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

  ఇవి కూడా చదవండి:

  SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...

  ATM Services: ఏటీఎం నుంచి మరిన్ని ఉచిత సేవలు... ఇలా పొందండి

  Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
  First published:

  అగ్ర కథనాలు