పెప్సీ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ...77 ఏళ్ల బామ్మ!

పెప్సీ

తను 13 ఏళ్ల ప్రాయంలో ఉండగా 1954 నుంచి పెప్సీ తాగడం మొదలుపెట్టిన 77 ఏళ్ల ఆ బామ్మ..గత 64 సంవత్సరానికి ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉంది.

 • Share this:
  ఆరోగ్యవంతమైన దీర్ఘకాల జీవితానికి పౌష్టికాహరం, డైట్ ఎంతో ముఖ్యం. ఎక్కువ రోజులు జీవించాలంటే మాంసాహారంతో పాటు శీతల పానీయాలు, కోలాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెబుతారు. చాలా మంది వృద్ధులు ఈ ఆరోగ్య సూత్రాలనే తమ తర్వాతటి తరానికి కూడా సూచిస్తారు. అయితే ఓ వృద్ధురాలు మాత్రం దీన్ని పూర్తిగా కొట్టిపరేస్తోంది. పెప్సీ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటున్న ఆ బామ్మ...ఆరోగ్యవంతమైన జీవితానికి రోజు పెప్సీ తాగండని ఉచిత సలహా కూడా ఇస్తోంది.

  77 ఏళ్ల జాకీ పేజ్ ప్రతి రోజూ నాలుగు క్యాన్ల పెప్సీని తాగుతోంది. తను 13 ఏళ్ల ప్రాయంలో ఉండగా 1954 నుంచి పెప్సీ తాగడం మొదలుపెట్టిన ఆమె...గత 64 సంవత్సరానికి ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉంది. ఆ రకంగా ఆమె ఇప్పటి వరకు 93,440 క్యాన్ల పెప్సీ తాగగా...దీని ద్వారా ఆమె శరీరంలోకి దాదాపు 3,000 కేజీల చెక్కర వెళ్లింది.


  రోజూ పెప్సీ తాగుతున్నా..ఈ వయస్సులోనూ తాను ఆరోగ్యకరంగా, సన్నగా, పూర్తి ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నట్లు చెబుతోంది. తనకు కోకా కోలా తాగడం అంటే ఇష్టం లేదని, పెప్సీ మాత్రమే తాగుతానని చెబుతోంది. అయితే తాను పెప్సీకి బానిసగా మారినట్లు భావించడం లేదని తెలిపింది. మద్యానికి బదులుగా తాను ఎక్కడ పార్టీకి వెళ్లినా...పెప్సీయే తాగుతానని చెప్పింది. పెప్సీ ముందుంటే తనకు మంచినీళ్లు, పాలు కూడా ఇష్టం ఉండదని చెబుతోంది. తాను ఈ వయస్సులోనూ  ఆరోగ్యవంతంగా ఉండగలుగున్నానంటే దానికి పెప్సీయే కారణమని చెబుతోంది.

  అయితే  పెప్సీకి వ్యాపార ప్రయోజనాలు చేకూర్చేందుకే ఆ బామ్మతో ఇలా చెప్పిస్తున్నారని విమర్శించే వారూ లేకపోలేదు. అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను చెప్పేది మాత్రం నిజమేనని, రోజుకు 4 క్యాన్ల పెప్సీ తాగనిదే తనకు రోజు గడవదని ఆ బామ్మ ఘంటాపథంగా చెబుతోంది.
  First published: