Lockdown: ఈ లాక్‌డౌన్ సమయంలో ఆ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారట.. సర్వేలో ఆసక్తికర విషయాలు

Lockdown: కరోనా లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేశారు. దీంతో పాటు అనేక మంది ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో టీవీలు చూసే వారి సంఖ్య పెరిగింది.

news18-telugu
Updated: October 29, 2020, 2:00 PM IST
Lockdown: ఈ లాక్‌డౌన్ సమయంలో ఆ సినిమాలే ఎక్కువగా చూస్తున్నారట.. సర్వేలో ఆసక్తికర విషయాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేశారు. అప్పటి నుంచి టీవీలు చూసే వారి సంఖ్య పెరిగింది. బుల్లితెర ప్రేక్షకుల్లో ఎక్కువమంది హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తాజా సర్వే చెబుతోంది. ఈ అధ్యయనాన్ని నీల్సన్ సంస్థ నిర్వహించింది. ‘హాలీవుడ్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్’ అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక టీవీ వీక్షకులకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించింది. భారత్‌లో 177 మిలియన్ల మంది ప్రేక్షకులు టీవీల్లో ఇంగ్లీష్ సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లను చూస్తున్నారని ఆ సర్వే తెలిపింది. ముంబై, దిల్లీ, చెన్నై, పుణె, అహ్మదాబాద్, లక్నో, ఇండోర్‌ వంటి మెట్రో, మెట్రోయేతర నగరాల నుంచి 1500 కి పైగా సినిమా అభిమానులపై నీల్సన్ సర్వే చేసింది.

లాక్డౌన్ వల్ల టీవీ చూడటం అనేది థియేటర్ అనుభవానికి దగ్గరగా వచ్చిందని 82 శాతం మంది చెప్పారు. 81 శాతం మంది కుటుంబంతో కలిసి హాలీవుడ్ సినిమాలు చూస్తున్నామని తెలిపారు. ఆంక్షల వల్ల కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో టీవీల్లో హాలీవుడ్ సినిమాలు చూడటాన్ని ఇలాంటి విహార యాత్రలకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నామని 81 శాతం మంది ప్రేక్షకులు చెప్పారు. ఒక్కరే టీవీ చూడటానికి బదులుగా ఇతరులతో కలిసి టీవీ చూసే అనుభవం మంచిదని 76 శాతం మంది చెప్పారు.

ఫోన్‌కంటే టీవీలే ఎక్కువగా చూస్తున్నారు
హాలీవుడ్ వీఎఫ్ఎక్స్, సూపర్ హీరో స్టంట్‌లను స్మార్ట్‌ఫోన్లలోని OTTలకంటే టీవీల్లోనే బాగా ఎంజాయ్ చేస్తున్నామని 88 శాతం మంది ప్రేక్షకులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ వాడుతూ, టీవీలో సినిమాలు చూడటం సరైన కాంబినేషన్ అని 77 శాతం మంది తెలిపారు. కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఒక సర్వీస్‌ ప్రొవైడర్‌కే డబ్బు చెల్లిస్తున్నామని 76 శాతం మంది వివరించారు. ఏమేం చూడాలో నిర్ణయించుకోవడానికి కంటెంట్ కోసం బ్రౌజ్ చేయవలసిన అవసరం లేదని 71 శాతం మంది చెప్పారు.

హాలీవుడ్ ఫ్యాన్స్ ఎక్కువ
బాలీవుడ్, ప్రాంతీయ సినిమా అభిమానుల్లో ప్రతీ పదిలో ఎనిమిది మంది హాలీవుడ్ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తున్నాయని, వాటిని ఇంగ్లీష్‌లోనే చూస్తామని చెప్పారు. ప్రతీ 10 మందిలో ఏడుగురు ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసిన హాలీవుడ్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారని నివేదిక పేర్కొంది. హాలీవుడ్ సినిమాల్లో ఉండే సూపర్ హీరోలను చూస్తూ పెరిగినట్లు 90 శాతం మంది ప్రేక్షకులు చెప్పారు. తమ అభిమాన హీరోల నుంచి ప్రేరణ పొందామని, వారిలా కనిపించడానికి ప్రత్యేకంగా దుస్తులు వంటివి కొంటున్నామని దాదాపు 80 శాతం మంది ప్రేక్షకులు తెలిపారు.

కొత్త విషయాలు నేర్చుకోవడానికి...హాలీవుడ్ కంటెంట్ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడిందని సర్వేలో పాల్గొన్న 86 శాతం మంది ప్రేక్షకులు చెప్పారు. ఇంగ్లీష్‌పై పట్టు సాధించడానికి ఈ సినిమాలు ఉపయోగపడ్డాయని 85 శాతం తెలిపారు. ప్రతీ పదిలో ఎనిమిది మంది ప్రేక్షకులు ఇండియన్ టీవీ ఛానెళ్లలో హాలీవుడ్ సినిమాలు చూడటానికి కొన్ని నెలల పాటు వేచి ఉండటాన్ని ద్వేషిస్తున్నారు. ప్రపంచంతో పాటు టీవీలో కొత్త హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ సినిమాలను చూడాలని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు.

ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు
భారతదేశంలో హాలీవుడ్ సినిమాల అభిమానులు లేటెస్ట్ ట్రెండ్‌తో అప్‌డేట్లో ఉన్నామని చెప్పారు. బాలీవుడ్, ఇతర ప్రాంతీయ భాషల సినీ ప్రేక్షకులతో పోలిస్తే, హాలీవుడ్ అభిమానులు అధిక ధర ఉండే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని, వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా, బలంగా ఉన్నారని సర్వే తెలిపింది. హాలీవుడ్ అభిమానులు కొత్త అనుభవాలను కోరుకుంటున్నారని ఈ సర్వే రుజువుచేస్తుందని ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ చానల్ చీఫ్‌ కన్స్యూమర్ ఆఫీసర్ ప్రత్యూష అగర్వాల్ చెబుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: October 29, 2020, 1:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading