మీ లైంగికజీవితం సాఫీగా సాగాలంటే.. ఈ 7 మార్గాలను అనుసరించండి

శృంగారం దివ్యౌషధం అంటారు. కానీ ఈ ఔషధాన్ని సరైన క్రమంలో ఆస్వాధిస్తేనే దాని మజా తెలుస్తుంది. ఆదరాబాదరగా.. ఏదో అవగొట్టాంలే అన్నట్టుగా ఉంటే.. అంతే సంగతులు. మీ లైంగిక జీవితం సాఫీగా సాగాలంటే ఈ టిప్స్ పాటించమని సూచిస్తున్నారు నిపుణులు..

news18
Updated: November 3, 2020, 3:02 PM IST
మీ లైంగికజీవితం సాఫీగా సాగాలంటే.. ఈ  7 మార్గాలను అనుసరించండి
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 3, 2020, 3:02 PM IST
  • Share this:
శృంగారం దివ్యౌషధం అంటారు. పెళ్లయిన కొత్తలో నూతన దంపతులు రతి క్రీడను బాగా ఆస్వాదిస్తుంటారు. కానీ క్రమంగా వారిలో లైంగికాసక్తి తగ్గిపోతుంది. ఉరుకుల పరుగుల జీవితం, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. తద్వారా దంపతుల్లో శృంగారానికి ఉన్న ప్రాధాన్యం తగ్గిపోతుంది. అయితే, కొంతమంది తమ లైంగిక కోరికలను భాగస్వామితో పంచుకోవడానికి భయపడుతూ ఉంటారు. దీని వల్ల వారి మధ్య రతి క్రీడ రొటీన్ గా మారడమే కాకుండా శృంగారంపై ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి, మీ లైంగిక జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడానికి భిన్నమైన మార్గాలను అన్వేషించండి. దీనికి గాను మీరు చేయగలిగే ఏడు విషయాలను ఇక్కడ పొందుపరిచాం. వాటిని పరిశీలించండి.

1. భాగస్వామితో మీ కోరికలను పంచుకోండి:

శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే ముందుగా మీ భాగస్వామితో మీ కోరికలను పంచుకోండి. దీనికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ వల్ల మీరు శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు. అయితే, చాలా మంది తమ కోరికలను భాగస్వామితో పంచుకోవడానికి సంకోచిస్తుంటారు. కానీ అలాకాకుండా నిస్సంకోచంగా మీ కోరికలను పంచుకోండి మంచిది. దీనివల్ల ఎక్కువ శృంగార అనుభూతికి లోనవ్వడమే కాకుండా, మీ పట్ల మీ భాగస్వామి మరింత నమ్మకంగా ఉండటానికి సహాయపడుతుంది.

2. మీ లైంగిక జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి:
మీ సహచరులతో లేదా పొరుగువారితో పోలిస్తే మీ లైంగిక జీవితం బాగా లేదని చింతించకండి. మీరు ఈ నెగెటివ్ ఆలోచనలతో బిజీగా ఉంటే శృంగారాన్ని ఆనందించడంపై ఎక్కువ దృష్టి పెట్టలేరు. అయితే, ఇతరులతో మీ లైంగిక జీవితాన్ని పోల్చుకోవడం ద్వారా ఆత్మనూన్యతా భావానికి లోనయ్యే అవకాశం కూడా ఉంది. దీన్ని ఎదుర్కొనేందుకు వీలైనన్ని ఎక్కువ సార్లు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్సాలజిస్ట్ వెనెస్సా మురాడియన్ మాట్లాడుతూ, మీ శృంగార జీవితాన్ని ఇతరులతో పొల్చుకునే ముందు మొదటగా మీరు శృంగారాన్ని ఆనందించడంపై ఎక్కువ దృష్టి పెట్టండి.

sex life, sex, sexual habits, habits, sexual confidence, sex education, healthy life, life partner, sexual issues, sexologists

3. శారీరక స్పర్శను పెంచండి: శృంగారం అంటే కేవలం పడకగదిలోనే చేయాలనే భావన చాలా మందిలో ఉంటుంది. అలా కాకుండా, పడకగది వెలుపల కూడా మీ శృంగారానికి ప్రాధాన్యతనివ్వండి. శృంగారంలో పాల్గొనే ప్రతి ఒక్కరు ఫోర్ ప్లేతోనే ప్రారంభించాలి. ఎందుకంటే మీ లైంగిక జీవితాన్ని పెంచే ఉత్తమ మార్గాలో ఫోర్ ప్లే ఒకటి. మీ భాగస్వామిని మూడ్ లోకి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే, శృంగారం ముగింపు సమయంలో మీ భాగస్వామికి ఆరు సెకన్ల పాటు ముద్దు ఇవ్వడం ద్వారా మీ సాన్నిహిత్య శారీరక సంబంధాన్ని పెంచుతుందని గుర్తించుకోండి.

sex life, sex, sexual habits, habits, sexual confidence, sex education, healthy life, life partner, sexual issues, sexologists

4. లైంగిక విశ్వాసాన్ని పెంపొందించుకోండి:
మీతో మీ భాగస్వామి సాన్నిహిత్యం, విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి లైంగిక చర్యను మించింది లేదు. మీరిద్దరిలో లైంగిక విశ్వాసం మరింతగా పెరిగి, మంచి శృంగార అనుభూతి పెంపొందాలంటే మాత్రం కొన్ని చిట్కాలను పాటించడండి. మీ భాగస్వామి పట్ల మీపై విశ్వాసం పెంపొందాలంటే మీ కోరికలను లైంగిక భాగస్వామికి తెలియజేయడం ఉత్తమ మార్గం.

5. భాగస్వామి శృంగార కోరికలను తెలుసుకోండి:
శృంగారాన్ని ఉత్తమంగా ఆస్వాదించాలంటే మీ భాగస్వామి కోరికలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తమ సొంత లైంగిక కోరికలు ఉండటం సహజం. మీకు కొన్ని బాగా అనిపించినవి మీ భాగస్వామికి భిన్నంగా అనిపించవచ్చు. అందువల్ల వారి అభిరుచులకు కూడా ప్రాధాన్యతనివ్వండి. తద్వారా మీపై వారికి ఇష్టం పెరుగుతుంది. తద్వారా మీరు మంచి శృంగార కార్యకలాపాన్ని కొనసాగించవచ్చు. మీరిద్దరూ పడకగదికి చేరుకున్నాక మీ లైంగిక జీవితాన్ని ఇంకా బాగా ఆస్వాదించాలనుకుంటే శృంగారం పట్ల చాలా బోల్డ్ గా ఉండాలి. మీ భాగస్వామితో శృంగారం గురించి కొన్ని బూతులు మాట్లాడితే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది. తద్వారా మీ ఇద్దరి హార్మోన్లు యాక్టివేట్ అయి శృంగారాన్ని ఉత్తమంగా ఆస్వాదిస్తారు.

sex life, sex, sexual habits, habits, sexual confidence, sex education, healthy life, life partner, sexual issues, sexologists

6. నొప్పి, అసౌకర్యాన్ని గుర్తించండి:
ఆస్ట్రేలియన్ డేటా ప్రకారం 20.3 శాతం మహిళలు, 2.4 శాతం మంది పురుషులు సెక్స్ సమయంలో శారీరక నొప్పిని ఎదుర్కొన్నారని తేలింది. సాధారణంగా మహిళలు బాధాకరమైన, సంతృప్తికరంగా లేని శృంగారాన్ని అనుభవించడానికి ఇష్టపడరు. అందువల్ల వారిని నొప్పించకుండా వారితో సాన్నిహిత్యంగా మెలగండి. శృంగారం సమయంలో మీరిద్దరూ ఆహ్లాదకరంగా ఉన్న సందర్భాల గురించి మాట్లాడండి. మీ భాగస్వామి శృంగారాన్ని బాధాకరంగా లేదా అసౌకర్యంగా భావిస్తే, సాన్నిహిత్యాన్ని తిరిగి కొనసాగించడానికి ప్లాన్–బిను సిద్ధం చేసుకోండి.

7. ఇబ్బందులుంటే థెరపిస్టును కలవండి:
మీ శృంగార సమస్యల నుంచి బయటపడటానికి సెక్స్ థెరపిస్ట్ సహాయం తీసుకోండి. లైంగిక చికిత్స, లైంగిక విద్య, లైంగిక గాయం, సాన్నిహిత్య సమస్యలు, శారీరక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, శృంగార కోరికలు సన్నగిల్లడం, శృంగారంలో నొప్పి తలెత్తడం వంటి సమస్యలకు వీరి సలహాలు ఉపయోగపడుతాయి.
Published by: Srinivas Munigala
First published: November 3, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading