Health Tips : రోజంతా హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..

చాలామంది ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఉండలేరు.. దీనికి ఏవేవో కారణాలుంటాయి. ఇలా కాకుండా కొన్ని పద్ధతులను మార్చుకుని రోజంతా హ్యాపీగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: May 29, 2019, 11:18 AM IST
Health Tips : రోజంతా హ్యాపీగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 29, 2019, 11:18 AM IST
త్వరగా నిద్రలేవడం: చాలామంది రాత్రి త్వరగా పడుకోరు.. ఉదయాన్నే లేవరు. దీంతో పనులు కాస్తా లేట్‌గా అవుతాయి. ఆఫీస్ లేట్. బ్రేక్‌ఫాస్ట్ లేట్.. అన్నింటా లేట్.. అలా కాకుండా అనుకున్న టైమ్‌కి ముందే లేచి చూడండి.. దీనివల్ల పనులు సక్రంగా జరుగుతాయి.. మీరూ హ్యాపీగా ఉంటారు.
గ్యాడ్జెట్స్‌ని పక్కనపెట్టండి : చాలామందికి నిద్రలేవగానే.. వాట్సప్, ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో ఏం మెసెజెస్ వచ్చాయో అని చూస్తుంటారు. కానీ.. ఇలా చేయడం మాని.. లేవగానే.. ఓ జోక్ చదవడం కానీ, చూడడం కానీ చేసి హాయిగా ఫీల్ అవ్వండి..
విష్ చేయడం : లేచినప్పట్నుంచీ మనకి కనిపించిన వారందరికీ విష్ చేయడం మరిచిపోవద్దు.. ఇది ఎదుటివారికే కాక.. మీకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది.

మ్యూజిక్ : ఏదైనా మ్యూజిక్ కాస్తా తక్కువ వాల్యూమ్‌తోనే వినండి.. దీనివల్ల చక్కటి రిలాక్సేషన్ ఉంటుంది.
నీరు తాగడం : చాలామంది లేవగానే టీ, కాఫీ తాగుతారు. అలా కాకుండా గోరువెచ్చని, నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి.
సీజనల్ ఫ్రూట్స్ : రోజూ ఏవేవో తీసుకునేబదులు పండ్లని చిన్నముక్కలుగా కట్ చేసుకుని వీలున్నప్పుడల్లా కాస్తా తీసుకుంటూ ఉండడం. దీనివల్ల శరీరానికి, మనసుకు ఆనందంగా తోడవ్వుతుంది.


నిద్ర: నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజూ తప్పనిసరిగా 8గంటల నిద్ర ఉండాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా నిద్రపోవాలంటే నిద్రకు కనీసం ఓ గంటన్నరముందే డిన్నర్ ఫినిష్ చేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని పక్కనపెట్టి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇవన్నీ మొదట్లో కాస్తా ఇబ్బందిగా ఉన్నా ఇది అలవాటు అయితే మాత్రం మన లైఫ్‌లో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు.
First published: May 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...