Coconut Oil Usage: కొబ్బరి నూనెతో అద్భుతమైన 7 ఆరోగ్య ప్రయోజనాలు.. వీటిపై ఓలుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

Coconut Oil Usage: జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థ(immune system)ను మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ(metabolism)ను నిర్మిస్తుంది.

  • News18
  • Last Updated :
  • Share this:
సౌందర్య సాధనలో, ఆరోగ్యం విషయంలో కొబ్బరి నూనెకు ఉన్న ప్రాముఖ్యత గురించి మనకు తెలిసిందే. భూమిపై సహజంగా లభించే కొబ్బరి కాయ(Coconut )ల నుండి తీసే కొబ్బరినూనె(Coconut Oil)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి గింజలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది మీ శరీరాన్ని చల్లబర్చడానికి, మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కేవలం జుట్టు సంరక్షణకే కాకుండా దీన్ని అనేక వంటకాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థ(immune system)ను మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ(metabolism)ను నిర్మిస్తుంది. అంతేకాక, ఇది హృదయానికి ఆరోగ్యాన్ని చేకూర్చడానికి, శరీరానికి తక్షణ శక్తినివ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బిస్కెట్లు(biscuits), స్వీట్లు(sweets), డెజర్ట్‌(desserts)లు తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎండిన కొబ్బరికాయకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఇది పిండి, క్రీమ్, పాలు వంటి కొబ్బరి ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో పోషక విలువను కలిగిన కొబ్బరికాయలతో కలిగే ప్రయోజనాలపై ఓలుక్కేయండి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మీ రోజూవారి వంటకాల్లో కొబ్బరి నూనెను జోడించడం వల్ల -మీ కడుపులో కొవ్వు కరిగి శరీర బరువు తగ్గడానికి(Weight Reduction) సహాయపడుతుంది. అందువల్ల, మీ వంటకాల్లో ఇతర నూనెలకు బదులు కొబ్బరి నూనెను వాడటం ప్రారంభించండి. దీనిలోని కొవ్వు ఆమ్లాలు(fatty acids) మీరు బరువు తగ్గే ప్రక్రియను సులభతరం చేస్తాయి. అంతేకాక, ఇది మీ జీవక్రియ రేటును వేగవంతం చేయడానికి, కేలరీ(calories)లను బర్న్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిని మెరుగుపరుస్తుంది

కొబ్బరి నూనె మీ రక్తంలోని చక్కెర స్థాయి(Blood Sugar Level )ని మెరుగుపరుస్తుంది.- మీ ఆహారంలో కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. దీనిలో సహజమైన చక్కెర స్థాయిలు కలిగి ఉన్నందున, శుద్ధి చేసిన ఇతర నూనెలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. అంతేకాక, ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని(insulin sensitivity) పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె ముఖ్యంగా డయాబెటిక్ సమస్యలకు చెక్ పెడుతుంది.

గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తుంది

కొబ్బరి నూనె శరీరంలోని కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిని తగ్గించడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. మీ ఆహారంలో కొబ్బరి నూనె జోడిస్తే అది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండటం వల్ల, ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, కొబ్బరి నీళ్ళలో చక్కెర, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల, కొబ్బరి నీళ్లు మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఇందులో మెగ్నీషియం(magnesium), పొటాషియం(potassium), కాల్షియం(calcium) వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.



క్యాన్సర్ వ్యాధికి చెక్ పెడుతుంది

కొబ్బరి నూనె దీర్ఘకాలిక క్యాన్సర్‌(Cancer) వ్యాధిని నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరి నూనెలో ఉన్న కొవ్వు ఆమ్లాలు(fatty acids) శరీరంలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందనీయకుండా వాటిని నిరోధిస్తాయి.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది

కొబ్బరి నూనె మనిషిలోని రోగనిరోధక వ్యవస్థ(Immune System)ను మెరుగుపరుస్తుంది.- దీనిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు ఫ్రీ రాడికల్స్, ఇతర హానికరమైన ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి బాగా పనిచేస్తాయి. అంతేకాక, దీనిలో లారిక్ ఆమ్లం మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఉత్తమంగా పనిచేస్తుంది.

ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది

నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ల(infections)ను నివారించండి కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది.- దీనిలోని యాంటీమైక్రోబయల్(antimicrobial), యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్‌ను నివారిస్తాయి. కొబ్బరి నూనెలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా దంతాలు మరింత బలంగా తయారవుతాయి. ఇది చెడు శ్వాస, దంత క్షయానికి చికిత్స చేస్తుంది.

వైరస్లను చంపుతుంది

కొబ్బరి నూనె మూత్ర సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (Urinary Infection) బారిన పడే మహిళలకు ఇది ఊరట కలిగిస్తుంది.కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల వైరస్లు, హానికరమైన బ్యాక్టీరియాలను అంతం చేయవచ్చు. ఇది మూత్రాశయ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.
Published by:Srinivas Munigala
First published: