Health : నొప్పులు వేధిస్తున్నాయా... క్రయోథెరపీ చేయించుకుంటే మేలు...

Health : నొప్పులు వేధిస్తున్నాయా... క్రయోథెరపీ మేలు... (credit - twitter - Marty McClellan)

Cryotherapy Benefits : ఈమధ్య కాలంలో క్రయోథెరపీకి డిమాండ్ పెరుగుతోంది. దీని వల్ల కలుగుతున్న ప్రయోజనాలే అందుకు కారణం.

 • Share this:
  Cryotherapy Benefits : క్రయోథెరపీ అంటే... కోల్డ్ థెరపీ అన్నమాట. ఇదో రకమైన టెక్నిక్. ఇందులో మన శరీరాన్ని అత్యంత చల్లటి వాతావరణంలో కొన్ని నిమిషాలపాటూ ఉంచుతారు. మొత్తం శరీరం లేదా శరీరంలో ఏదైనా ఒక భాగానికి కూడా ఈ థరెపీ నిర్వహిస్తారు. ఐస్ ప్యాక్‌లు, ఐస్ మసాజ్, కూలాంట్ స్ప్రేలు, ఐస్ బాత్ ఇలా రకరకాలుగా ఈ థెరపీ నిర్వహిస్తారు. ఫుల్ బాడీ క్రయోథెరపీ (Whole-Body Cryotheray -WBC)లో... ఓ చిన్న అతి శీతల గదిలోకి మనల్ని పంపిస్తారు. ఇందులో తల తప్ప... మిగతా శరీరమంతా... మంచుతో నిండుతుంది. అందులో ఉష్ణోగ్రత మైనస్ 93 డిగ్రీల సెల్సియస్ నుంచీ మైనస్ 148 సెల్సియస్ డిగ్రీల మధ్య ఉంటుంది. రెండు నుంచీ 4 నిమిషాలు మాత్రమే ఆ ఉష్ణోగ్రతలో మనల్ని ఉంచుతారు. ఎక్కువగా అథ్లెట్లు ఇలాంటి థెరపీ చేయించుకుంటారు. కొంతమంది రోజుకు రెండుసార్లు చేయించుకుంటారు. కొంతమంది 10 రోజులు చేయించుకొని... ఆ తర్వాత నెలకోసారి చేయించుకుంటారు. దీన్ని రెగ్యులర్‌గా చేయించుకుంటూ ఉంటే... ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.

  1.Reduces migraine symptoms : కొంతమందికి మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది. తల తిరుగుతున్నట్లు, మెడ పట్టేసినట్లు అనిపిస్తుంది. వాళ్లు మెడపై రెండు ఐస్ ముక్కల్ని పెట్టుకుంటే... నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే... ఈ ప్రక్రియ వల్ల వేడెక్కిన రక్తం కాస్త చల్లబడి... సిరల్లోంచీ వెళ్తుంది. అందువల్ల ప్రయోజనం కలుగుతుంది.

  2. Numbs nerve irritation : అథ్లెట్లకు కలిగే గాయాలు అదే పనిగా నొప్పి పెడుతుంటాయి. అందుకే క్రయోథెరపీని వాళ్లు ఆశ్రయిస్తున్నారు. నొప్పిని అలా వదిలేస్తే... అది నరాలు లాగేసేలా చేస్తుంది. డాక్టర్లు ఎక్కడ నొప్పి వస్తుందో... అక్కడ క్రయోథెరపీ చేస్తారు. ఆ చుట్టుపక్కల కణాజాలాన్ని మెత్తపరుస్తారు. అంతే నొప్పులు మెల్లగా మటుమాయం అవుతాయి.

  3. Helps treat mood disorders : ఫుల్ బాడీ థెరపీలో... హార్మోన్లు రెస్పాండ్ అవుతాయి. శరీరంలో అడ్రినలిన్, నోరాడ్రెనలిన్, ఎండోర్ఫిన్స్ అనే రసాయనాలు విడుదల అవుతాయి. ఫలితంగా ఒత్తిడి, టెన్షన్ వంటివి తగ్గుతాయి.

  4. Reduces arthritic pain : కీళ్ల నొప్పులు ఓ పట్టాన తగ్గవు. వాటికి ఫుల్ బాడీ థెరపీయే కరెక్ట్ అంటున్నారు. చాలా అధ్యయనాల్లో ఇది నిరూపితమైంది.

  5. May help treat low-risk tumors : మీకు తెలుసా... కాన్సర్ ట్రీట్‌మెంట్‌కి కూడా ప్రత్యేక క్రయోథెరపీ చేస్తారు. దీన్నే క్రయోసర్జరీ అంటారు. ఇందులో కాన్సర్ కణాల్ని గడ్డకట్టేలా చేస్తారు. ఆ కణాలు చుట్టూ ఐస్ ముక్కలు పెడతారు. ప్రస్తుతానికి చిన్న చిన్న కాన్సర్ కణతులకే ఇలా చేస్తున్నారు. ప్రొస్టేట్ లాంటి కొన్ని రకాల కాన్సర్ లకే ఈ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.

  6. May help prevent dementia and Alzheimer’s disease : మతిమరపుకి కూడా ఈ థెరపీ చేస్తున్నా... ఇది ఎంతవరకూ పనిచేస్తోందన్నదానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

  7. Treats atopic dermatitis and other skin conditions : కొంత మందికి చర్మం మంటపుడుతూ ఉంటుంది. మాటిమాటికీ దురద వస్తూ ఉంటుంది. అలాంటి వారికి క్రయోథెరపీ చేస్తున్నారు. ఈ థెరపీ వల్ల మంట తగ్గడం, అందుకు కారణమయ్యే క్రిములు చనిపోవడం జరుగుతోందంటున్నారు డాక్టర్లు.

  క్రయోథెరపీతో కొన్ని సమస్యలూ ఉన్నాయి. ఇది చేయించుకున్నాక... లైట్‌గా కళ్లు తిరుగుతున్నట్లు, అక్కడక్కడా దురదల వంటివి వస్తాయి. ఐతే అవి కాసేపు మాత్రమే. అవి 24 గంటల కంటే ఎక్కువగా వస్తే మాత్రం డాక్టర్‌ను కలవడం మేలు.
  Published by:Krishna Kumar N
  First published: