Periods సమయంలో SEXలో పాల్గొంటే గర్భం వస్తుందా..? అపోహలు, వాస్తవాలు తెలుసుకోండి

శృంగారం పై ఎంత తెలుసుకున్నా తక్కువే. చాలా మంది సైకాలజిస్టులు.. సెక్స్ గురించిన అనేక విషయాలపై అనేకసార్లు చెప్తారు. కానీ మనలో ఇంకా పలు సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడం ఎంతో అవసరం.. అత్యావశ్యకం కూడా..

news18
Updated: November 26, 2020, 7:48 PM IST
Periods సమయంలో SEXలో పాల్గొంటే గర్భం వస్తుందా..? అపోహలు, వాస్తవాలు తెలుసుకోండి
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: November 26, 2020, 7:48 PM IST
  • Share this:
ఏ విషయంపై లేనన్ని అపోహలు, నమ్మకాలు ఒక్క శృంగారంపైనే చక్కర్లు కొడుతుంటాయి. శృంగారంపై అనేక తప్పుడు ప్రచారాలు యథేచ్ఛగా జరుగుతుంటాయి. కొందరు వాటిని నిజమని భావించి వారిలో వారే మదనపడుతుంటారు. మన మనస్సులో కూడా అప్పుడప్పుడూ అనేక శృంగారంపై సందేహాలు వస్తుంటాయి. అయితే, ఆ సందేహాలను మన దగ్గరి వారితో పంచుకోవడానికి సిగ్గుపడతాము. లైంగిక అనుభవం ఉన్నవారిలోనూ ఈ అపోహలు సాధారణమే. కొన్ని అపోహలను అనుభవంతో నివృత్తి చేసుకుంటే, మరికొన్ని ఇతర సామాజిక సాధనాల ద్వారా తెలుసుకుంటాం. శృంగారంపై బయట ఎక్కవగా ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలు, నిజాల గురించి తెలుసుకుందాం.

పీరియడ్స సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం రాదు..!

మహిళలకు రుతు స్రావం జరిగే సమయాల్లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. దీనికి గల కారణం పురుషుడు స్ఖలించిన వీర్యం మహిళల రక్తంతో పాటు బయటకు వస్తుందని కొందరు నమ్ముతుంటారు. ఇది పూర్తి అబద్ధం. నిజానికి ఆడవారి సంతానోత్పత్తి వ్యవస్థలో ఐదు రోజుల వరకు మగవారి వీర్యం నిల్వ ఉంటుంది. ఒకవేళ ఈ ఐదు రోజుల సమయంలో ఆడవారి అండాశయంలో అండాలు ఏర్పడితే గర్భం దాల్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి, రుతుస్రావం సమయాల్లోనూ సురక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చవచ్చు అని గ్రహించండి.

పురుషుడు బయట స్ఖలనం చేస్తే స్త్రీలు గర్భం పొందలేరు...!

శృంగారం పూర్తి కాగానే స్ఖలించకుండా సరైన సమయంలో బైటికి తీసివేయడం వల్ల గర్భం వచ్చే అవకాశం ఉండదు అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. శృంగారంలో టైమింగ్ ఖచ్చితంగా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అయితే, కొన్నిసార్లు తెలియకుండానే, పురుషులు ప్రీ-కమ్ అని పిలువబడే చిన్న మొత్తంలో ద్రవాన్ని విడుదల చేస్తారు. కొంత వీర్యం స్త్రీ యోని లోపల పడిపోయినా కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

పురుషాంగ పరిమాణం ముఖ్యం

మగవారికి పురుషాంగ పరిమాణం ముఖ్యమని చాలామంది గుడ్డిగా నమ్ముతుంటారు. నిజానికి సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటే చాలు శృంగార జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు. సెక్స్ చేసేటప్పుడు సరైన ఉద్దేశం, ప్రేమ, అభిరుచి, భావోద్వేగం ఉండాలి. అంతేతప్ప శృంగారాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే పురుషాంగం పరిమాణం ముఖ్యమైనది ఏమీ కాదని గుర్తించుకోవాలి.

ఓరల్ సెక్స్ చేయడం ద్వారా గర్భం వస్తుంది

ఇది కూడా ప్రచారంలో ఉన్న పెద్ద అపోహ. ఇది పూర్తిగా అవాస్తవం. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో పురుషుడు స్ఖలనం చేస్తే మాత్రమే స్త్రీ గర్భవతి అవుతుంది. ఓరల్ సెక్స్ ద్వారా గర్భం పొందడం సాధ్యం కాదు.

పురుషులు ఎల్లప్పుడూ శృంగారానికి సిద్ధంగా ఉంటారు

చాలా మంది మహిళలు, పురుషులు ఎప్పుడూ సెక్స్ చేయటానికి సిద్ధంగా ఉంటారని నమ్ముతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కొన్ని సందర్భాల్లో పురుషుల కంటే మహిళలకే శృంగార కోరికలు ఎక్కువ ఉండవచ్చు. పురుషులు ఎప్పుడూ శృంగారం కోసం వేచి చూస్తారనేది అపోహ మాత్రమే.

శృంగారం కేవలం యువతకు మాత్రమే

చాలా మంది శృంగారం అనేది కేవలం యువతకు మాత్రమే అని నమ్ముతారు. నిజానికి శృంగారంలో పాల్గొనడానికి వయసుతో పనే లేదు. 75 ఏళ్లు పైబడిన దంపతులు కూడా శృంగారంలో పాల్గొని ఆనందాన్ని పొందుతారని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.
Published by: Srinivas Munigala
First published: November 26, 2020, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading