గే కొడుకు, అతని భర్త కోసం 61 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి...

స్వలింగ సంపర్కుడైన కొడుకుకి సంతానం ఇచ్చేందుకు ‘సరోగసి’ ద్వారా గర్భం దాల్చిన 61 ఏళ్ల మహిళ... ప్రపంచంలో మనవరాలికి జన్మనిచ్చిన మొదటి మహిళగా రికార్డు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 11:16 PM IST
గే కొడుకు, అతని భర్త కోసం 61 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి...
గే కొడుకు కోసం 61 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి...
  • Share this:
స్వలింగ సంపర్కంలో శారీరక సుఖాన్ని అయితే పొందవచ్చు కానీ సంతానం పొందాలనే కోరిక మాత్రం సాధ్యం కాదు. అయితే స్వలింగ సంపర్కుడైన తన కొడుకు కోసం 61 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం దాల్చిందో తల్లి. తల్లి కావాలనుకున్న కొడుకు కోరిక తీర్చడం కోసం మనవడిని తన కడుపులో మోసింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సంఘటన అమెరికాలోని నెబ్రస్కా ఏరియాలో జరిగింది. నెబ్రస్కాలో నివాసం ఉంటున్న 61 ఏళ్ల సెసిల్ ఎలెగ్‌కు ఒకే ఒక్క కొడుకు మ్యాథ్యూ. మ్యాథ్యూ స్వలింగ సంపర్కుడు కావడంతో ఇలియట్ డౌగెర్టీ అనే మరో యువకుడిని పెళ్లిచేసుకున్నాడు. పెళ్లైన తర్వాత లైంగిక సుఖాన్ని అనుభవిస్తూ కాలం గడిపేసిన వీరికి సంతానం కావాలనే కోరిక కలిగింది. అయితే పురుషుల శరీరంలో గర్భాశయం ఉండదు. గర్భం దాల్చే అవకాశం ఉండదు. దాంతో తన కోరికను తల్లి సెసిల్ ఎలెగ్‌కు చెప్పాడు కొడుకు మ్యాథ్యూ.

కొడుకు కోరిక విని, సరోగసి విధానం ద్వారా వారి బిడ్డకు జన్మనిచ్చేందుకు ముందుకొచ్చింది సెసిల్ ఎలెగ్‌. అయితే ప్రస్తుతం ఆమె వయసు 61 ఏళ్లు కావడంతో ఈ సమయంలో బిడ్డను కడుపులో మోయడం, ప్రసవం చాలా కష్టమవుతాయని చెప్పారు వైద్యులు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోని సెసిల్ ఎలెగ్‌... వైద్యపరీక్షలు చేయించుకుంది. ఈ నివేదికల్లో బిడ్డను కని, మోసేంత సామర్థ్యం సెసిల్ ఎలెగ్‌ శరీరానికి ఉందని నిరూపితమైంది. మ్యాథ్యూ నుంచి వీర్యాన్ని, అతని భర్త ఇలియట్ చెల్లి నుంచి సేకరించిన అండాన్ని సేకరించి సెసిల్ ఎలెగ్‌ గర్భాశయంలో ప్రవేశపెట్టారు వైద్యులు. సరోగసి విధానంలో బిడ్డను తొమ్మిదినెలల పాటు మోసింది సెసిల్ ఎలెగ్‌. తాజాగా ఒమహాలోని ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిందామె. ఆ చిన్నారికి ఉమా అని పేరు కూడా పెట్టారు అప్పుడే. సరోగసి విధానం ద్వారా తన మనవరాలికి జన్మనిచ్చిన మొదటి తల్లిగా రికార్డు క్రియేట్ చేసింది సెసిల్ ఎలెగ్‌.

First published: April 4, 2019, 11:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading