ఖైరతాబాద్ మహాగణపతికోసం లడ్డూప్రసాదం సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంకు చెందిన పీవీవీవీ మల్లిఖార్జునరావు గణనాయకుడి కోసం రెండోసారి భారీ లడ్డూని తయారుచేసి సమర్పించనున్నారు.
220 కిలోల పంచదార, 145కిలోల నెయ్యి, 175 కిలోల శనగపిండి, 25 కిలోల జీడిపప్పు, 13 కిలోల బాదం పప్పు, 3 కిలోల యాలకులు, ఒక కిలో పచ్చకర్పూరాన్ని వినియోగించి ప్రసాదాన్ని తయారుచేశామని, ఇలా తయారుచేసి ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు మల్లికార్జునరావు తెలిపారు.
580 కేజీల లడ్డూకి మండపేటకి చెందిన సూక్ష్మ కళాకారుడు వీరబాబు తుదిమెరుగులు దిద్దారు. జీడిపప్పు పేస్ట్‌తో శివపార్వతి ఆకారం, గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. బుధవారం సిటీలోని ఫిల్మ్‌నగర్ దైవసన్నిదానంకి లడ్డూప్రసాదం చేరింది. ఇవాళ సాయంత్రం ఖైరతాబాద్ గణనాథుడికి ప్రసాదాన్ని సమర్పించనున్నట్లు మల్లిఖార్జునరావు అలియాస్ మల్లిబాబు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Vinayaka Chaviti