హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Vegan Skincare: వేగన్ స్కిన్‌ కేర్‌ రొటీన్‌తో బెస్ట్‌ రిజల్ట్స్‌..ఈ టిప్స్‌పై ఓ లుక్కేయండి..

Vegan Skincare: వేగన్ స్కిన్‌ కేర్‌ రొటీన్‌తో బెస్ట్‌ రిజల్ట్స్‌..ఈ టిప్స్‌పై ఓ లుక్కేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం ఎన్నో రకాల వేగన్ స్కిన్ కేర్‌ ప్రొడక్టులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్‌ విధానం, అద్భుతమైన ప్రయోజనాలతో ఇవి పాపులర్‌ అవుతున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఇలాంటి ప్రొడక్టులను తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Vegan Skincare: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది శాకాహారులుగా ఉన్నారు. కేవలం శాకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఎంతోమంది భావిస్తున్నారు. ఈ ట్రెండ్‌ ఆహార పదార్థాలకు మాత్రమే కాకుండా.. సౌందర్య సాధనాలను కూడా వ్యాపించింది. ఇందుకు అనుగుణంగానే వేగన్ స్కిన్ కేర్‌ ప్రొడక్టులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్‌ విధానం, అద్భుతమైన ప్రయోజనాలతో ఇవి పాపులర్‌ అవుతున్నాయి. దీంతో అనేక కంపెనీలు ఇలాంటి ప్రొడక్టులను తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. అయితే వీటిని ఎలా వాడాలో తెలుసుకోండి.

ఎక్స్‌ఫోలియేట్

చర్మం పైపొర నుంచి డెడ్‌ స్కిన్‌ సెల్స్‌ను తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. ఇది చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యంగా మారుస్తుంది. అయితే ఇందుకు సాల్ట్‌, వెదురు లేదా బెంటోనైట్ క్లే తో తయారు చేసిన వేగన్‌ ఎక్స్‌ఫోలియేటర్స్ ఉపయోగించడం మంచిది. ఇవి చర్మానికి ఎటువంటి హాని చేయవు.

ఫేషియల్‌ క్లెన్సింగ్

ఫేషియల్‌ క్లెన్సింగ్ అనేది ఏదైనా స్కిన్‌ కేర్‌ రొటీన్‌కు బేస్‌ లేదా ఫౌండేషన్‌ లాంటిది. ఇది చర్మ రంధ్రాలలో రోజంతా పేరుకుపోయిన మురికి, ఆయిల్‌ను తొలగిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే, చర్మం ఇతర స్కిన్‌ కేర్‌ రొటీన్‌లను గ్రహిస్తుంది. వేగన్ ఫేస్ వాష్‌ వినియోగిస్తుంటే.. రోజుకు రెండుసార్లు ముఖాన్ని కడగాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని ఫేస్‌ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి.

 టోనింగ్

టోనింగ్ ద్వారా చర్మ రంధ్రాలు బిగుతుగా మారుతాయి. దీంతో మురికి, దుమ్ము, మేకప్‌ చర్మ రంధ్రాల లోతుల్లోకి చేరదు. మార్కెట్లో అనేక టోనర్ ప్రొడక్టులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌డ్ pH ఉండే రోజ్ వాటర్ వంటి సహజ పదార్థాలను ఇందుకు ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజింగ్‌ను ఫైనల్‌గా అప్లై చేయాలి. ఉపయోగించిన అన్నింటినీ లాక్ చేయడానికి ఇది చాలా అవసరం. అన్ని స్కిన్‌ కేర్‌ రొటీన్‌లలో మాయిశ్చరైజర్‌ కీలకంగా పని చేస్తుంది. మార్కెట్‌లో స్కిన్‌ టైప్‌ను బట్టి చాలా వేగన్‌ మాయిశ్చరైజర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

iPhone 13: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై బంపర్ ఆఫర్..రూ. 50వేల లోపు లభిస్తున్న డివైజ్

 సీరమ్

చాలా మందికి సీరం ఎలా ఉపయోగించాలో తెలియదు. సీరమ్‌ టోనర్ లేదా మాయిశ్చరైజర్‌ని పోలి ఉండటంతో చాలా మంది దీన్ని ఉపయోగించరు. సాధారణ చర్మ సంరక్షణ రొటీన్‌లలో సీరం చాలా ముఖ్యమైంది. వేగన్‌ సీరంలో చర్మం సహజ మాయిశ్చరైజర్‌ను లాక్ చేయడంలో సహాయపడే అధిక సాంద్రత కలిగిన హైడ్రేటింగ్ పదార్థాలు ఉంటాయి. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ తర్వాత సీరం వినియోగిస్తే బెస్ట్‌ రిజల్ట్‌ ఉంటుంది. ఇక చివరకు ఫేస్‌ మసాజ్ కోసం వేగన్‌ ఫేస్‌ రోలర్‌ ఉపయోగించవచ్చు. ఇది పఫ్వినెస్‌ను తగ్గించి, చర్మాన్ని రిలాక్స్‌ చేస్తుంది. దీన్ని ఎంత బాగా ఉపయోగిస్తే, ఫలితాలు అంత చక్కగా ఉంటాయి.

First published:

Tags: Life Style, Skin care

ఉత్తమ కథలు