news18-telugu
Updated: November 27, 2020, 5:54 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అందంగా ఉంటే చాలు అమ్మాయిలు ఇట్టే ఆకర్షితులవుతారు అనే భ్రమలో చాలా మంది అబ్బాయిలు ఉంటారు. కానీ ఈ భావన తప్పని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయిలు,అబ్బాయిల్లో కేవలం అందం, శృంగార పరమైన లక్షణాలను చూసే ఆకర్షితులు కారని, వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు లేదా అభిరుచులను చూసి ఆకర్షితులవుతారని ఆ అధ్యాయనాలు పేర్కొన్నాయి. లైంగిక పరమైన లక్షణాలు కాకుండా అబ్బాయిల్లో, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ఇతర లక్షణాలేంటో తెలుసుకుందాం.
పరిశుభ్రంగా ఉండే వారు..ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆకర్షనీయంగా ఉండే పురుషులు, స్త్రీలను ఇట్టే ఆకట్టుకుంటారు. అంతేకాక, మంచి పర్ఫ్యూమ్, బాడీ స్పే వాడితే మీరు కూడా అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకోగలరు. మంచి వాసన భావోద్వేగాలను, అనుభూతులను తెస్తుంది. చెడు వాసన, మానసిక స్థితిని పూర్తిగా నాశనం చేస్తుందని గుర్తించుకోండి.
కాన్ఫిడెన్స్ తో ఉండేవారు..
ఆత్మవిశ్వాసంతో మానసికంగా, దృఢంగా ఉండే పురుషులంటే స్త్రీలకు ఎనలేని ఇష్టమట. ఎందుకంటే అటువంటి వారు జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని వారు బలంగా నమ్ముతారు. అంతేకాక, జీవితంలో తమను బాగా చూసుకుంటారని కూడా భావిస్తారు. నమ్మకమైన వ్యక్తిత్వం కలిగి ఉండే పురుషులు, స్త్రీలను ఇట్టే ఆకట్టుకుంటారు.
వంట చేసే వారు..
స్త్రీలకు బాగా వంట చేసిపెట్టే పురుషులంటే చాలా ఇష్టమట. వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వంటకాన్ని తయారు చేస్తే చాలు స్త్రీలు ఇట్టే పడిపోతారు. ఒకవేళ ఆ వ్యక్తి ఆమె భాగస్వామి అయినట్లయితే వారి మధ్య బంధం మరింతగా బలపడుతుంది.ఫ్యాషన్ గా ఉండేవారు..
ఫ్యాషన్‌వేర్ ధరించే పురుషులంటే స్త్రీలకు చాలా ఇష్టమట. ఆకర్షనీయమైన దుస్తుల్లో తయారయ్యే పురుషుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని స్త్రీలు నమ్ముతారు. తద్వారా వారికి ఇతరుల్లో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుందని భావిస్తారు.
యాక్టివ్ గా ఉండేవారు..
మూస ధోరణిలో ఆలోచించే పురుషుల కంటే తెలివిగా ఆలోచించే వారు, ఇతర యాక్టివిటీస్ కలిగి ఉండేవారంటే స్త్రీలకు ఇష్టమట. అనగా.. వివిధ రకాల పుస్తకాలను చదవడం, గిటార్‌ను వాయించడం, పాటలు పాడటం వంటి యాక్టివిటీస్ ఉన్న వారు స్త్రీలను ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఇటువంటి భిన్నమైన అభిరుచులు ఉన్న పురుషులను తమ భాగస్వామిగా పొందాలని స్త్రీలు భావిస్తారు.
చలాకీగా మాట్లాడేవారు..
స్త్రీలకు చలాకీగా మాట్లాడే పురుషులంటే ఎక్కువ ఇష్టమట. ఎప్పుడు నీరసంగా, ఒంటరిగా, దిగాలుగా ఉండే పురుషులకు దూరంగా ఉండాలని వారు కోరుకుంటారు. అంతేకాక, తమకు నచ్చిన విషయాల గురించి, పురుషులు చర్చిస్తే మహిళలు ఇష్టపడతారట. అనగా తన జీవితాశయం, కుటుంబ సభ్యులు, పని వంటి విషయాల గురించి ఎక్కువగా చర్చించే వారిని అభిమానిస్తారు.
Published by:
Nikhil Kumar S
First published:
November 27, 2020, 5:54 PM IST