Health Tips To Sever Cough: దగ్గు ఎంతకీ తగ్గట్లేదా? ఈ 6 సహజ చిట్కాలు పాటించండి

Health : దగ్గు ఎంతకీ తగ్గట్లేదా? ఈ 6 సహజ చిట్కాలు పాటించండి

Health Tips To Sever Cough: ఈ రోజుల్లో దగ్గు వస్తే ఇబ్బందే. అలా అదే పనిగా దగ్గుతూ ఉంటే పక్కనున్న వారు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దగ్గే వారు కూడా దగ్గలేక చాలా ఇబ్బంది పడతారు. అందుకే దగ్గును తరిమేసే ఐదు సహజ చిట్కాలు తెలుసుకొని పాటిద్దాం.

 • Share this:
  Health Tips To Sever Cough: దగ్గును తగ్గించుకోవాలంటే... ముందు అది ఎందుకు వస్తోందన్నది మనకు తెలియాలి. మన శరీరంలో కీలకమైన ఊపిరి తిత్తులు (Lungs)లోకి ఏవో సూక్ష్మక్రిములు ఎంటరైతే... అవి కుదురుగా ఉండవు. ఊపిరి తిత్తుల్ని తింటూ... అక్కడే కాపురాలు పెట్టి... అడ్డమైన రోగాలూ వచ్చేలా చేస్తాయి. వాటిని తరిమేసేందుకు మన బాడీలోని మంచి బ్యాక్టీరియా ప్రయత్నిస్తుంది. ఐతే... ఆ బ్యాక్టీరియా తరమలేకపోతే... అప్పుడు మనకు సమస్య మొదలవుతుంది. దగ్గు వస్తుంది. అది రాన్రానూ పెరుగుతూ... చివరకు క్షయ (టీబీ లేదా ట్యూబర్ క్యులోసిస్) వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఐతే... దగ్గు రాగానే కొంత మంది మందులు వేసేసుకుంటారు. అలా చెయ్యడం మంచిది కాదు. ఆ మందుల వల్ల చెడు బ్యాక్టీరియాతోపాటూ... మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అందుకే... దగ్గు వస్తుంటే... కనీసం ఒకట్రెండు రోజులు వెయిట్ చెయ్యాలి. అప్పటికీ తగ్గకపోతే... అప్పుడు మందుల జోలికి వెళ్లాలి. ఈ గ్యాప్‌లో కొన్ని సహజ పద్ధతుల్ని పాటిస్తే... దగ్గు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.

  1.ఆవిరి పట్టండి : ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటించే చిట్కానే. ఓ గిన్నెలో వేడి నీరు పోసి. దుప్పటి కప్పుకొని... ఆ నీటి ఆవిరిని పీల్చాలి. ఇలా చెయ్యడం వల్ల మ్యూకస్‌ (Mucous)లో కణాలు ముక్కలై... శ్వాస చక్కగా ఆడుతుంది. ఈ ఆవిరి అనేది యాంటీసెప్టిక్‌లా పనిచేస్తూ... గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది కూడా.

  2.వేడి నీరు, తేనె : తేనె అనేది స్కిన్, ఆహార నాళం, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. దగ్గు వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరి తిత్తులకు కావాల్సిన మాయిశ్చర్ అందిస్తుంది. అందువల్ల గోరు వెచ్చటి నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. ఐతే... డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనె ఎంత తీసుకోవాలో ఆ జాగ్రత్తలు పాటించాలి.

  3.నిమ్మ రసం : నిమ్మరసంలో విటమిన్ C ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయల్లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ C టాబ్లెట్లు వాడే బదులు సహజ పండ్లను వాడటం మేలు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతు గరగర తగ్గుతుంది. దగ్గు కూడా పరారవుతుంది.

  4.తేలికపాటి ఆహారం తీసుకోవాలి : కొంతమంది ఎప్పుడు ఫ్రైలు, స్పైసీ ఫుడ్ కావాలంటారు. దగ్గు వచ్చే సమయంలో మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్యాట్ ఉండే ఫుడ్ కూడా తినకూడదు. నాన్ వెజ్‌కి దూరంగా ఉంటే మంచిది. చక్కగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఆహారం తింటే... దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు, క్లియర్ సూప్స్ వంటివి కూడా కొంత మేలు చేస్తాయి.

  5) మ్యులేథి (Mulethi - Liquorice) : ఈ పుల్లల్ని నమిలితే కూడా దగ్గు తగ్గుతుంది. ఇప్పుడు ఇవే పుల్లల్ని పౌడర్ రూపంలో అమ్ముతున్నారు. ఆ పొడిని టీ, అల్లం టీ, మిరియాల టీతో కలిపి, తక్కువ షుగర్ వేసుకొని తాగితే మేలు జరుగుతుంది.

  6.కరక్కాయ : దగ్గును సహజంగా తగ్గించేందుకు ఈ కాయ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బుగ్గలో పెట్టుకొని.. దీని నుంచీ వచ్చే చేదు రసాన్ని మింగేస్తూ ఉంటే... ఓ రోజంతా అలా చేస్తే... దగ్గు కచ్చితంగా తగ్గుతుంది.

  ఇన్ని సహజ పద్ధతులు పాటించినా దగ్గు తగ్గట్లేదంటే... అప్పుడు మందులు వాడటం మేలే. మందులకూ తగ్గకపోతే... డాక్టర్‌ను కలవాల్సిందే.
  Published by:Krishna Kumar N
  First published: