Home /News /life-style /

6 MYTHS ABOUT DIABETES AND YOUR SIGHT NS

డయాబెటిస్ మరియు మీ కంటి చూపునకు సంబంధించిన 6 అపోహలు

డయాబెటిస్ మరియు మీ కంటి చూపునకు సంబంధించిన 6 అపోహలు

డయాబెటిస్ మరియు మీ కంటి చూపునకు సంబంధించిన 6 అపోహలు

డయాబెటిస్ కారణంగా కంటి చూపు ప్రభావితం అవ్వడం గురించి ఎవ్వరూ చెప్పరు. నిజానికి, డయాబెటిస్ కారణంగా కంటి చూపు ఎలా ప్రభావితం అవుతుంది అనే విషయంలో చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. 

  NetraSuraksha సెల్ఫ్ చెక్ ఇక్కడ చేసుకోండి.

  “డయాబెటిస్” అనే పదం చెప్పగానే అందరూ ఆహార నియంత్రణ, కార్బోహైడ్రేట్‌లు, డయాబెటాలజిస్ట్‌ను సంప్రందించిన విషయాలు ఇంకా రక్తంలో షుగర్ స్థాయులను చూసుకోవడానికి లేటెస్ట్‌గా వచ్చిన పరికరాలు గురించి చెప్పడం మొదలుపెడతారు. కానీ డయాబెటిస్ కారణంగా కంటి చూపు ప్రభావితం అవ్వడం గురించి ఎవ్వరూ చెప్పరు. నిజానికి, డయాబెటిస్ కారణంగా కంటి చూపు ఎలా ప్రభావితం అవుతుంది అనే విషయంలో చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. 

  ఈ అపోహలను పోగొట్టి, ప్రజలు తమ ఆరోగ్యం, కంటి చూపుపై సరైన శ్రద్ధ చూపించేలా అవగాహన కలిగించడానికి Network 18 ఇంకా Novartis కలిసి Netra Suraksha' – డయాబెటిస్‌పై భారతదేశపు పోరాటం కార్యక్రమం ప్రారంభించాయి. కార్యక్రమంలో భాగంగా, Network18 వైద్యరంగంలోని నిపుణులతో చేసిన రౌండ్ టేబుల్ చర్చలను ప్రసారం చేస్తుంది అలాగే డయాబెటిస్, కంటి చూపుపై దాని ప్రభావం, డయాబెటిస్ ఉన్న వారిలో దాదాపు సగం మందిని ప్రభావితం చేసే భయంకరమైన డయాబెటిక్ రెటినోపతీ1పై వివరణాత్మక వీడియోలు, కథనాలను కూడా ప్రచురిస్తుంది. 

  ఇక నిజాలు తెలుసుకుందం పదండి. 

  1వ అపోహ: నేను చూడగలుగుతున్నాను అంటే నా కళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే. 

  కంటి చూపు స్పష్టంగా ఉండటం కీలకమైన విషయం, కానీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి అనడానికి సంకేతం కాకపోవచ్చు. చాలా రుగ్మతలకు ప్రారంభ దశలలో లక్షణాలు అస్సలు ఉండకపోవడం కానీ తక్కువ ఉండటం కానీ జరుగుతుంది. 

  గ్లకోమాను కంటి చూపుపై దొంగ దెబ్బ తీసే వ్యాధి అంటారు ఎందుకంటే, దాని లక్షణాలు ఏవీ నష్టం జరిగిపోయే వరకు మీకు కనిపించవు. గ్లకోమా, మీ కంటి వెనుక భాగంలో ఉండే ఆప్టిక్ నరాన్ని దెబ్బతీస్తుంది. ఈ నరం మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది2. గ్లకోమాను, ఎలాంటి చికిత్స లేకపోవడం వలన, మీరు ఎంత త్వరగా గుర్తించి వైద్యం చేయించుకోగలిగితే అంత మంచిది. వైద్యం చేయించకపోతే, గ్లకోమా వలన కంటిచూపు పోవచ్చు. 

  క్యాటరాక్ట్ అంటే మీ లెన్స్‌లో మేఘావృతం అయ్యి ఉండే ప్రాంతం. క్యాటరాక్ట్‌లు పూర్తిగా వృద్ధి చెంది బయటపడటానికి చాలా సంవత్సరాలు పట్టువచ్చు. ఒక సారి ఈ వ్యాధి పెరిగితే సర్జరీ చేయాల్సిందే3

  ఇప్పటి వరకు, డయాబెటిక్ రెటీనోపతీ అనేది డయాబెటిస్‌కు సంబంధించిన అత్యంత సాధారణ సమస్య. డయాబెటిక్ రెటినోపతీలో, కంటికి (ప్రత్యేకించి రెటినాకు) రక్తం సరఫరా చేసే నాళాలలో బ్లాక్‌లు ఏర్పడటం లేదా వాటి నుండి ద్రవం కారడం లేదా అవి పగిలిపోవడం జరుగుతుంది4. డయాబెటిక్ రెటినోపతీ ప్రారంభ దశలలో ఎలాంటి లక్షణాలు కనిపించవు, కానీ అది పెరిగేకొద్దీ కళ్ళద్దాలు మార్చినా చదవడంలో ఇబ్బంది కలగే పరిస్థితి దారి తీస్తుంది. సమయానికి గుర్తించకపోతే, శాశ్వత అంధత్వానికి దారీ తీయవచ్చు4.

  2వ అపోహ: డయాబెటిస్ ఉన్న వారిలో కంటి సమస్యల ప్రమాదం అంత ఎక్కువ కాదు

  గణాంకాలు అబద్ధాలు చెప్పవు. ప్రపంచవ్యాప్తంగా, డయాబెటిక్ రెటినోపతీ పని చేసే వయస్సు ఉన్న వారిలో అంధత్వానికి ప్రధాన కారణం5. భారతదేశంలో, 2025 నాటికి డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వారిలో దాదాపు 57 మిలియన్ ప్రజలు రెటినోపతీతో బాధపడతారు5

  పాజిటివ్‌గా ఆలోచించడం ఎప్పుడూ ఒక వరమే, కానీ ఆశలలో ఉండటం ప్రమాదకరం కావచ్చు. డయాబెటిక్ రెటినోపతీ అనేది డయాబెటిస్ ఉన్న వారికి వచ్చే ప్రమాదకరమైన అలాగే సాధారణమైన సమస్య. మీరు ఎంత ఎక్కువ కాలంగా డయాబెటిస్‌తో బాధపడుతుంటే, మీకు దీని ప్రమాదం అంత ఎక్కువ ఉంటుంది. 

  3వ అపోహ: డయాబెటిక్ రెటినోపతీ కేవలం టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారిని మాత్రమే ప్రభావితం చేస్తుంది. 

  డయాబెటిస్ ఉన్న వారు ఎవరికైనా కంటి వ్యాధులు రావచ్చు, వాటికి టైప్ 1 మరియు టైప్ 2ల మధ్య భేదం ఉండదు. ఇవి గర్భాధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ జెస్టేషన్ దశలో ఉన్నవారికి కూడా రావచ్చు. వ్యాధి మొదటి రెండు దశలలో డయాబెటిస్ టైప్ 1 ఉన్న వారు దాదాప అందరిలో అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో >60% మందిలో డయాబెటిక్ రెటినోపతీ సమస్య మొదలవుతుంది6.

  తరచుగా కంటి పరీక్షలు చేయుంచుకోవడం వలన మీ వైద్యుల డయాబెటిస్ కారణంగా వచ్చే కంటి సమస్యలను ముందుగానే పసిగట్టి చికిత్స చేయగలుగతారు.

  4వ అపోహ: నాకు డయాబెటిస్ ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది, కాబట్టి నేను ఇప్పుడే కంటి పరీక్షల చేయించుకోవలసిన అవసరం లేదు.

  డయాబెటిస్ కాలం పెరిగేకొద్దీ డయాబెటిక్ రెటీనోపతీ ప్రమాదం పెరుగుతుందన్నది గణాంకాల ప్రకారం వాస్తవమే. ప్రతీ ఒక్కరికీ ప్రమాదాలు వేరుగా ఉంటాయి. ప్రతీ ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది, సాధారణంగా గణాంకాల ప్రకారం వ్యాధి పెరిగే అవకాశం అంత ఎక్కువ కానప్పటికీ, వ్యక్తిగతం మీకు ఉంటే ప్రమాదం తక్కువ అనో లేదా మీకు అస్సలు రాదు అనో అర్థం కాదు. 

  అవును, కంటి చూపుకు ప్రమాదం వచ్చే స్థాయిలో డయాబెటిక్ టైప్ 1 రోగులలో మొదటి 3-5 సంవత్సరాలలో లేదా యవ్వన దశకు ముందు అరుదు. ఆ తర్వాతి రెండు దశాబ్దాలలో, దాదాపు టైప్ 1 డయాబెటిస్ ఉన్న అందరిలో రెటినోపతీ రావచ్చు. 

  కానీ, డయాబెటిస్ టైప్ 2 ఉన్న వ్యక్తులలో దాదాపు 21% మందిలో డయాబెటిస్ గుర్తించబడే సమయానికే రెటినోపతీ ఉంటుంది6!

  5వ అపోహ: డయాబెటిక్ రెటినోపతీ వల్ల ఖచ్చితంగా అంధత్వం వస్తుంది. 

  కాదు. ప్రారంభ దశలలోనే కనుగొంటే అలా జరగదు. మీ వైద్యులు ఎంత త్వరగా దీనిని గుర్తిస్తే, మీ నివారణ అంత మెరగ్గా ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతీ అనేది మెల్లగా వృద్ధి చెందుతూ ఉండే వ్యాధి, అంటే మీరు ఎంత త్వరగా దీనిని గర్తిస్తే మీరు దానిని అంత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు, అంతే ప్రభావంతంగా దానిని నివారించవచ్చు. 

  ప్రపంచవ్యాప్తంగా 1980 మరియు 2008 మధ్య నిర్వహించిన 35 అధ్యయనాల విశ్లేషణ ఆధారంగా, రెటీనా చిత్రాలను ఉపయోగించి డయాబెటిస్‌ ఉన్నవారిలో ఏదైనా DR యొక్క మొత్తం ప్రాబల్యం 35%గా, మరియు ఇది 12% కంటి-చూపు కోల్పోయే స్థాయిలో ప్రమాదకరం అని అంచనా వేయబడింది4

  కాబట్టి, మీ వార్షిక కంటి పరీక్ష చేయించుకోండి (వైద్యుల దగ్గర, కళ్ళజోళ్ళ దుకాణంలో కాదు!), మీ రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుకోండి. 

  6వ అపోహ: నిజంగా నా కంటికి ఏదైనా సమస్య ఉంటే నాకు వెంటనే తెలిసిపోతుంది. 

  అనేక రకాల కంటి సమస్యలు ఉండటంతో, రోగులు అత్యంత సమర్థవంతంగా చికిత్స చేయగలిగే ప్రారంభ దశలలో వ్యాధి లక్షణాలను గుర్తించర. ఉదాహరణకు, డయాబెటిక్ రెటినోపతీ తీవ్రత పెరిగే వరకు లక్షణాలు ఏవీ కనిపించవు7

  అవును, అది నిజం: నొప్పి ఉండదు. కంటి చూపులో మార్పలు ఉండవు07. ఎలాంటి లక్షణాలు ఉండవు. నిజానికి, రెటినా సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ డా. మనీషా అగర్వాల్ ప్రకారం అత్యంత ముందుగా కనిపించే లక్షణాలలో ఒకటి కళ్ళజోడు మార్చినా కూడా చదవడం ఇబ్బందిగా అనిపించడం. ఈ సంకేతాన్ని మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని విస్మరిస్తే చూసే దృశ్యంలో ఎర్రటి లేదా తెల్లటి మచ్చలు లేదా మేఘావృతం అయ్యినట్టు ఉంటానికి లేదా ఉన్నట్టు ఉండి రక్తస్రావం కారణంగా పూర్తి బ్లాక్ అవుట్‌కు కాడూ దారి తీయవచ్చు. 

  అదృష్టవశాత్తు, లక్షణాలు తీవ్రంగా మారేలోపే దీనిని గుర్తించగల కంటి పరీక్షలు ఉన్నాయి. ఎలాంటి నొప్పిలేని డైలేటెడ్ కంటి పరీక్ష ద్వారా, దీనిలో మీ వైద్యులు మీ కనుపాపలను వ్యాకోచింప చేయడానికి కంటి మందును వేసి మీ కంటి వెనుక భాగాన్ని పరీక్షిస్తారు7 (ఇది రెటినా ఉండే భాగం). 

  ఇలాంటి సరళమైన చర్య మీ కంటి చూపును కాపాడగలదు. అలాగే ఇంకాస్త అవగాహన నివారించగల ఈ అంధత్వాన్ని పూర్తిగా నివారించడంలో చాలా ఉపయోగపడుతుంది. 

  ఏ వ్యాధితోనైనా పోరాడటానికి ఉత్తమ మార్గం దానిపై అవగాహన పెంచుకోవడం. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోకి తీసుకోండి అలాగే కంటి చూపును కూడా. ప్రత్యేకించి మీరు కానీ మీకు ప్రియమైన వారు కానీ డయాబెటిస్‌తో బాధపడుతుంటే, Netra Suraksha కార్యక్రమం గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం News18.com చూస్తూ డయాబెటిక్ రెటినోపతీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే, మీరు వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్ డయాబెటిక్ రెటినోపతీ స్వీయ చెకప్

  వ్యక్తిగతంగా మీకు ఉన్న ప్రమాదాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం మీ వైద్యులు చెప్పిన ప్లాన్ అనుసరించడం. సులభమైన సూచన ఏమిటంటే డయాబెటిక్ రెటినోపతీ ఉందేమో చూడటానికి – ఒక సరళమైన, సులభమైన, నొప్పిలేని మీది అలాగే మీ కుటుంబం యొక్క జీవన నాణ్యతను మెరుగుపరిచే పరీక్ష చేయించుకోవడం ఉత్తమ మార్గం. సంకోచించకండి, మీరు తప్పించుకోగలరు అనే అపోహలో ఉండవద్దు. 

  రిఫరెన్స్‌లు: 

  1. https://www.medicalnewstoday.com/articles/diabetes-in-india[U1]  10 Dec, 2021.

  2. https://www.nei.nih.gov/about/news-and-events/news/glaucoma-silent-thief-begins-tell-its-secrets 17 Dec, 2021

  3. https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/cataracts 17 Dec, 2021

  4. https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/diabetic-retinopathy 10 Dec, 2021

  5. Balasubramaniyan N, Ganesh KS, Ramesh BK, Subitha L. Awareness and practices on eye effects among people with diabetes in rural Tamil Nadu, India. Afri Health Sci. 2016;16(1): 210-217.

  6. https://care.diabetesjournals.org/content/27/suppl_1/s84 17, Dec 2021

  7. https://youtu.be/nmMBudzi4zc 29 Dec, 2021

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Diabetes, Health

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు