ఈ రోజుల్లో పిల్లలు (Children), తల్లిదండ్రులు (Parents) కలిసి గంటల పాటు సమయం గడిపే పరిస్థితులు లేవనే చెప్పాలి. ఎవరి పనుల్లో వారు మునిగి తేలుతూ ఖాళీ సమయాల్లో ఫోన్లతో (Phones) గడిపేస్తున్నారు. అయితే నవంబర్ 20న బాలల దినోత్సవం (World Children's Day) సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఒక గంట పాటు సమయం గడపాలని ప్రోత్సహిస్తోంది పేరెంట్‌సర్కిల్ సంస్థ. తల్లిదండ్రులకు పేరెంటింగ్ టిప్స్ అందించే పేరెంట్‌సర్కిల్ అనే జాతీయ సంస్థ ప్రతి ప్రపంచ బాలల దినోత్సవం నాడు #GadgetFreeHour అనే ఈవెంట్‌ను నిర్వహిస్తుంటుంది. ఈసారి కూడా ప్రపంచ బాలల దినోత్సవం రోజున తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఒక గంట పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు (Electronic Gadgets) దూరంగా ఉండి సమయాన్ని గడపాలని పేరెంట్‌సర్కిల్ పిలుపునిచ్చింది. తమ పిల్లలతో సమయాన్ని గడపడానికి 50 మిలియన్లకు పైగా పార్టిసిపెంట్లు తమ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల నుంచి ఒక గంట పాటు డిస్‌కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నట్లు పేరెంట్‌సర్కిల్ తాజాగా ప్రకటించింది.
గతేడాది 10 లక్షల కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు, 41,635 పాఠశాలల పార్టిసిపేషన్ తో ఫ్యామిలీ-కనెక్ట్ ప్రచారం విజయవంతం అయ్యింది. అయితే ఆనాటి ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది తల్లిదండ్రులు గాడ్జెట్ రహిత ప్రోగ్రాంలో పాల్గొంటారని పేరెంట్‌సర్కిల్ భావిస్తోంది.
"ఈసారి కూడా #గాడ్జెట్‌ఫ్రీఅవర్ (#GadgetFreeHour) సోషల్ మీడియాలో 10 మిలియన్లకు పైగా ఇంప్రెషన్‌లను సంపాదించింది. దాంతో ఈ ఉద్యమం ఊపందుకుంది. ఈ ఏడాది గాడ్జెట్‌ఫ్రీఅవర్ నవంబర్ 20, 2021న జరుగుతుంది. ఇందులో పాల్గొనే వారి సంఖ్య 50 మిలియన్లకు మించి ఉంటుంది" అని #గాడ్జెట్‌ఫ్రీఅవర్ మూడవ ఎడిషన్‌ను ప్రకటిస్తున్నప్పుడు పేరెంట్‌సర్కిల్ తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వ విద్యా శాఖ కూడా బాలల దినోత్సవం రోజు ఓ గంట పాటు తల్లిదండ్రులు తమ పిల్లలతో గడపాలని కోరుతోంది. ఆన్‌లైన్ షెడ్యూల్‌కు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ తమిళనాడు ప్రభుత్వం పేరెంట్‌సర్కిల్ ఈవెంట్ కు మద్దతు ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో గో-గాడ్జెట్-ఫ్రీ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమంలో చేరింది.
Ind Vs Nz : రాంచీలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక వంటకాలు.. ఫుడ్ మెనూలోని ఆహార పదార్ధాలు ఇవే ..!
ప్రతిఒక్కరికీ వినోదభరితమైన సమయాన్ని అందించడానికి పేరెంట్‌సర్కిల్ ఆన్‌లైన్‌లో #GadgetFreeHour, కుటుంబాల కోసం #HahaHehe ఛాలెంజ్‌ను ప్రారంభించింది. ఏడు లక్షలకు పైగా రీచ్‌తో భారీ ఎత్తుగా తల్లిదండ్రులు పార్టిసిపేషన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేరెంట్‌సర్కిల్ 14-రోజుల 'బ్యాక్ టు చైల్డ్‌హుడ్' ఛాలెంజ్‌ని కూడా నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతిరోజూ 5 నిమిషాల గాడ్జెట్-ఫ్రీ సమయాన్ని గడపాలని ఈ ఛాలెంజ్ ప్రోత్సహిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Childrens day, Gadget, Smartphones