• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • 5 VITAMIN E RICH FOODS FOR HEALTHY SKIN AND HAIR YOU MUST HAVE FOR BREAKFAST IN WINTER SEASON DETAILS HERE MS

Skin Care: చలికాలంలో చర్మ నిగారింపు.. ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ ఫుడ్స్ బెస్ట్...

Skin Care: చలికాలంలో చర్మ నిగారింపు.. ఆరోగ్యమైన జుట్టు కోసం ఈ ఫుడ్స్ బెస్ట్...

ప్రతీకాత్మక చిత్రం

చలికాలం వచ్చిందంటే చర్మం మొత్తం పొడిబారిపోతుంది. శరీరంలో తేమ తగ్గి.. చర్మం పగుళ్లు కూడా వస్తాయి. ఇక కాలుష్యంతో జుట్టు సమస్యలు సరేసరి. మరి ఈ నేపథ్యంలో శీతాకాలం ఏ ఆహారం తీసుకుంటే మంచిదో ఇక్కడో చూద్దాం.

  • News18
  • Last Updated:
  • Share this:
    దేశవ్యాప్తంగా చలికాలం ప్రారంభమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం పలు చోట్ల విపరీతంగా మంచు కురుస్తున్నది. ఇక అటవీ ప్రాంతాలైతే చెప్పాల్సిన పనే లేదు. అక్కడ చలి పులి పంజా విసరుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. తేమ సరిగా లేకపోవడంతో అనేక చర్మ సమస్యలు వస్తాయి. చర్మం తో పాటు చలికాలంలో జుట్టును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి చర్మం పొడిబారకుండా.. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? ఈ కాలంలో ఏం తినాలి..?

    సాధారణ సమయంలో కంటే చలికాలంలో శరీరానికి విటమిన్ ఇ ఎంతో అవసరం. చర్మ సమస్యలు కలిగించే క్రిముల నుంచి కాపాడటంలో విటమిన్ ఇ కలిగిన ఆహారం ఎంతో తోడ్పడుతుంది. విటమిన్ ఇ కలిగి ఉన్న ఫుడ్స్ లో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. వాటికి పోరాడే సామర్థ్యం ఉంటుంది. ఈ ఆహారం తీసుకుంటే చర్మ సమస్యలతో పాటు వృద్ధాప్య సంబంధిత లక్షణాల నుంచి కూడా రక్షించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో ఉదయం తీసుకునే అల్పాహారంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండే ఈ పదార్థాలు తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.

    బాదం పప్పు..
    పోషకాలు అత్యధికంగా కొలువున్న ఆహారపదార్థాల్లో బాదం ఒకటి. రాత్రి పూట 5 బాదం పప్పు గింజలను నానబెట్టి.. ఉదయం లేవగానే అల్పాహారం చేసే సమయంలో వాటిని తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే వాటిపై ఉండే తొక్కను తీసేసి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బాదంను అల్పాహారం తీసుకునే ముందు గానీ.. బెడ్ కాఫీ తాగేప్పుడు గానీ తీసుకోవచ్చు.

    బచ్చలి కూర...
    గ్రీన్ లీవ్స్ (ఆకు కూరలు) లలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. బచ్చలి కూర ను వండుకుని గానీ.. లేదా ఉడకబెట్టిగాని తినవచ్చు. గుడ్లను ఉడికించిన తర్వాత అందులో తరిగిన బచ్చలికూరను వేసి వండుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆకు కూరలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో ఎంతో తోడ్పడుతాయి.

    అవకాడొ...
    ఈ రుచికరమైన పండు అల్పాహారంలో సంచలనంగా మారింది. ఉదయం తీసుకునే గుడ్లు, పాలు, ఇతర ఉడకబెట్టిన కూరగాయల మాదిరే చాలా మంది అవకాడొను తీసుకుంటారు.

    పొద్దుతిరుగుడు విత్తనాలు..
    ఈ విత్తనాలలో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాల్చిన పొద్దు తిరుగుడు విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో గానీ.. టీ తాగిన తర్వాత గానీ తింటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానితోపాటు ఓట్స్, తృణ ధాన్యాలు తినేవాళ్లు కూడా ఈ విత్తనాలను వాటితో కలిపి తినవచ్చు.

    వేరుశెనగ...
    వేరుశెనగ లు లేకుండా ఉదయం పూట చేసే టిఫిన్లు తయారుకావంటే అతి శయోక్తి కాదేమో. ఉప్మా, పోహా, ఫ్రూట్ షేక్స్ లో వేరుశెనగలు ఉండాల్సిందే. వీటిని వేయించుకుని తిన్నా రుచికరంగానే ఉంటాయి.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు