హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: మెదడుని షార్ప్‌గా చేసే పనులివే.. మీరూ ట్రై చేయండి..

Health Tips: మెదడుని షార్ప్‌గా చేసే పనులివే.. మీరూ ట్రై చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏ పని చేయాలన్నా మనకు మెదడు నుంచి సందేశాలు రావాల్సిందే. మెదడు ఏం చెబితే మనం అది చేస్తాం.. అలాంటి మెదడుని పనితీరుని మెరుగుపరుచుకోవడం మనపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఏ టిప్స్ పాటిస్తే మెదడు షార్ప్ అవుతుందో తెలుసుకోండి..

కొన్ని పనులు చేయడం ద్వారా మన  మొదడుని షార్ప్‌గా ఉంచుకోవచ్చు. తద్వారా మన చుట్టూ ఉన్న వారి నుంచి గుర్తింపు లభిస్తుంది. సొంత కుటుంబంలో మంచి గౌరవం, వృత్తిరీత్యా కూడా మంచి గుర్తింపు లభించేందుకు ఇది దోహదపడుతుంది. మరి దీని కోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

1.శారీరకంగా ఆరోగ్యంగా ఉండండి.. మనం ఆరోగ్యం ఉంటేనే మనలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. శారీరక ఆరోగ్యమే మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటేనే అది మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడూ అవసరమైన టెస్ట్‌లు చేసుకుంటూ ఏ ఆరోగ్య సమస్యను కూడా దరిచేరకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని తెలిస్తే ముందునుంచే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.

2.సరైన నిద్ర అవసరం.. 24 గంటలు పనిచేస్తుంటే ఎలా ఉంటుంది అలసిపోతాం.. విశ్రాంతి కోరుకుంటాం.. అలానే మెదడు 24 గంటలు ఆలోచించలేదు.. రోజులో దానికి కూడా తగినంత విశ్రాంతి అవసరం.. అవునండోయ్ కొన్ని సార్లు మన మెదడు నిద్రలోనూ ఆలోచిస్తుంది. కాబట్టి.. మెదడుకి తగినంత విశ్రాంతినివ్వండి.. హాయిగా గాఢనిద్రలోకి పోయి మెదడు ఆరోగ్యాన్ని కాపాడండి.

3.సమతుల్య ఆహారం, పోషకాహారం..మంచి ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్నీ పోషకాలు ఉన్నాయో లేదో చూసుకోండి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు సరిగ్గా ఉండాలి. అది ఎలా ఉంటే కార్బొహైడ్రేట్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు మాత్రం తప్పనిసరి. ముఖ్యంగా.. చేపలు మన డైట్‌లో ఉంటే మెదడు పనితీరు సరిగ్గా ఉంటుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు.. మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది.

4.వ్యాయామం:  శారీరాక వ్యాయామం, యోగాసనాల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగాసానాలు చేయండి. దీనివల్ల మనం మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

5.మెదడుకి పనిచెప్పండి.. 100శాతం ఉండే మెదడులో చాలా తక్కువ శాతాన్నే మనం వాడుతున్నాం. కాబట్టి, కొత్త పనులు చెప్పండి.. ఫజిల్స్ ఫిల్ చేయడం.. విద్యను అభ్యసించడం.. కొత్త విషయాన్ని నేర్చుకోవడం వంటివి చేయండి..

First published:

Tags: Health Tips, HOME REMEDIES, Tips For Women

ఉత్తమ కథలు