Sleep : రోజంతా ఉత్సాహంగా పని చేయడానికి, అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి మంచి నిద్ర చాలా అవసరం. చాలా మంది ప్రస్తుతం నిద్ర లేమి(Sleepless)తో బాధపడుతున్నారు. ఒక్క రోజు రాత్రి సరిగా నిద్రపోకపోయినా.. ఆ ప్రభావం తర్వాత రోజు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది ఎక్కువకాలం నిద్రతో సమస్యలు ఎదుర్కొంటుంటే ముప్పు తప్పదు. ప్రతిరోజు నిద్ర కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. స్లీపింగ్ డిజార్డర్ ఉందేమో తెలుసుకోవాలి. ఒకవేళ అది లేకపోతే స్లీపింగ్ హైజీన్ పాటించాలి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగపడే 5 బెస్ట్ టిప్స్ ఇవే..
మంచి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి
మంచి నిద్ర కావాలంటే మంచి వాతావరణం ఉండాలి. నిద్రపోయే వాతావరణ ఎంత ప్రశాంతంగా ఉంటే నిద్ర కూడా అంతే ప్రశాంతంగా లభిస్తుంది. నిద్రపై గదిలోని వాతావరణం, వెలుతురు, శబ్దాలు, వస్తువుల అమరికా ప్రభావం చూపిస్తాయి. మంచి పరుపు, దుప్పటి, తలగడను సెలక్ట్ చేసుకోవాలి. నిద్రపోయే గదిలోకి వీలైనంతవరకు బయట శబ్దాలు వినపడకుండా, బయటి వెలుతురు పడకుండా చూసుకోవాలి.
మధ్యాహ్నం నిద్ర పోకపోవడం మంచిది
రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే మధ్యాహ్నం నిద్ర మానుకోవాలని పెద్దలు చెప్పే మాట. అది వందకు వంద శాతం నిజం. మధ్యాహ్నం సమయంలో పది నిమిషాల నుంచి 30 నిమిషాల కునుకు తీస్తే.. ఉత్తేజంగా ఉంటారని, ఉత్సాహంగా పని చేస్తారని ఒక అధ్యయనం పేర్కొంది. అయితే మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు నిద్రపోతే ప్రతిరోజు అదే అలవాటు అవుతుంది. ఇక రాత్రిపూట నిద్రపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది.
నిద్ర వేళలు పాటించాలి
డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్స్ ప్రకారం.. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం అలాగే ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. మంచి నిద్ర అలవాటు కావాలంటే రోజూ నిద్ర వేళలు పాటించాలి. వారంతరాల్లో కూడా ఇదే అలవాటును తప్పక పాటించాలి.
Christmas Vacation: క్రిస్మస్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? వీసా లేకుండా వెళ్లిరాగల 5 బ్యూటిఫుల్ కంట్రీస్ ఇవే..
కెఫైన్‌గా దూరంగా ఉండాలి
కెఫైన్ ఉన్న కాఫీ, ఇతర ప్రొడక్టులకు దూరంగా ఉండాలి. కెఫైన్ నిద్రకు అవరోధంలా పని చేస్తుంది. ఆశ్చర్యంగానే ఉన్నా నిద్రపోయే ముందు ఎక్కువ మోతాదులో కెఫైన్ తీసుకుంటే నిద్రకు భంగం కలిగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. నిద్రకు మూడు గంటల ముందు గాని, నాలుగు గంటల ముందు గాని కెఫైన్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అది నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
వ్యాయామం చేయాలి
ఓ అధ్యయనం ప్రకారం.. నిద్రలేమితో బాధపడే వృద్ధులు సాధారణ స్థాయి వ్యాయామం చేయడం ద్వారా నిద్రను మెరుగుపరచు కున్నట్లు తేలింది. రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేయడం కన్నా, పగటిపూట బయటకు తిరుగుతూ వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. వ్యాయామం చేయడం ద్వారా ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని ఉత్తేజపరిచి మరింత అప్రమత్తంగా ఉంచుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sleep tips, Sleeping