Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...

Health : పెసరపప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో... చలికాలంలో... రకరకాల స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 13, 2019, 11:09 AM IST
Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...
Health : చలికాలంలో తినదగ్గ 5 రకాల ప్రోటీన్ స్నాక్స్...
  • Share this:
Health : జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఈ రోజుల్లో కామనైపోతోంది. కానీ... ఇలాంటి ఫుడ్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎంతో రుచికరంగా ఉండటం, తినడానికి తేలిగ్గా ఉండటం, వండుకునే పనిలేకుండా పోవడంతో... చాలా మంది ఇలాంటి ఫుడ్ ఆర్డర్ తెప్పించుకొని తినేస్తున్నారు. కానీ డాక్టర్లను అడిగితే... తమ దగ్గరకు వచ్చే వారిలో... ఇలాంటి ఫుడ్ తిని అనారోగ్యాల పాలవుతున్నవారే ఎక్కువని చెబుతున్నారు. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్ ఉండేలా చేసుకోవాలి. ఇవి కండరాల్ని బలపరుస్తాయి. మనకు బాగా దొరికే పెసరపప్పులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా. అవి అధిక బరువు ఉండేవాళ్లను బరువు తగ్గిస్తాయి. అందువల్ల పెసరపప్పుతో చేసుకునే స్నాక్స్ సంగతి చూద్దాం.

పెసరపప్పు చిలా (credit - twitter - Most Yummy Today!)


1. (Moong Dal Chila) పన్నీర్‌తో కూడిన పెసరపప్పు చిలా : ఇదో పాపులర్ బ్రేక్ ఫాస్ట్. ఇది పుల్లగా, తియ్యగా భలే ఉంటుంది. దీన్ని తయారుచేసుకోవడం కూడా తేలికే. అందువల్ల ఉదయం వేళ పెసరపప్పు చిలా చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం.

పెసరపప్పు పకోడి (credit - twitter - Rida Khan)




2. (Moong Dal Pakoda) పెసరపప్పు పకోండి : పకోడీ, చాయ్ తీసుకోవడం ఇండియాలో కామన్. సాయంత్రం వేళ చాలా మంది ఈ మంచింగ్ తీసుకుంటారు. ఎక్కువ కేలరీలు ఉండకూడదని అనుకుంటే... పెసరపప్పును ఫ్రై చెయ్యకుండా... ఎయిర్ ఫ్రై లేదా బేకింగ్ చెయ్యడం మేలు.

పెసరపప్పు మొలకలు (credit - twitter - Archana Doshi)


3. (Moong Dal Sprouts) పెసరపప్పు మొలకలు : మొలకల్ని సూపర్ ఫుడ్ అంటున్నారు. ఇవి ఎంతో ఆరోగ్య కరం. అలాగే... పోషకాలు కూడా ఎక్కువే. పెసరపప్పు మొలకల్లో ప్రోటీన్స్ ఎక్కువ. ఈ మొలకల్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా స్లైసెస్, నిమ్మరసం కలుపుకొని తింటే... యమ్మీ యమ్మీ స్నాక్స్ మీ సొంతం.
పెసరపప్పు సమోసా (credit - twitter - LBB)


4. (Moong Dal Parcel/Samosa) పెసరపప్పు సమోసా : ఇది వరైటీగా అనిపిస్తోంది కదూ. పెసరపప్పు, ఉల్లిపాయలు, పసుపు, చాట్ మసాలా కలిపి సమోసాలా చేసి తింటే... ఆ టేస్టే వేరు.

పెసరపప్పు సూప్ (credit - twitter - Sanjeev Kapoor)


5. (Moong Dal Kiwi and Coconut Soup) పెసరపప్పు సూప్ : పెసరపప్పుతో గోరు వెచ్చటి సూప్ తాగితే ఎంతో మంచిది. బరువు తగ్గడమే కాదు... మంచి ఆహారం తీసుకున్నట్లవుతుంది కూడా. ఇంకా మీకేవైనా పెసరపప్పు ఐటెమ్స్ తెలిస్తే... వాటిని ట్రై చేసుకోండి. శీతాకాలంలో పెసరపప్పు తీసుకోవడం చాలా మంచిది.

 

మళ్లీ ట్రాక్‌లోకి భావన... వరుస సినిమాలతో బిజీ...




ఇవి కూడా చదవండి :

Baby Names : చిన్నారికి పేరు పెట్టాలా? ఈ టిప్స్ పాటించండి

Health : పర్పుల్ ఆలూ... తింటే మేలు

Health : సంతాన సమస్యలను దూరం చేసే ఆహారం... తప్పక తినాలి...


చక్కెర కంటే బెల్లం తినడం మేలు... ఎందుకంటే...

Apple Cider Vinegar : చక్కటి ఆరోగ్యానికి మేలైన ఔషధం... యాపిల్ సైడెర్ వెనిగర్...

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>