హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Prevent Heart Attack: షుగర్‌ వ్యాధిగ్రస్తులకు గుండెపోటు రిస్క్‌ అధికం..ఈ ఆయుర్వేదం టిప్స్‌తో బెస్ట్‌ రిజల్ట్‌..

Prevent Heart Attack: షుగర్‌ వ్యాధిగ్రస్తులకు గుండెపోటు రిస్క్‌ అధికం..ఈ ఆయుర్వేదం టిప్స్‌తో బెస్ట్‌ రిజల్ట్‌..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారిన జీవనశైలిలో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోటు, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ రిస్క్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Prevent Heart Attack : మారిన జీవనశైలి(Lifestyle)లో చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో గుండెపోటు(Heart attack), ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్(Cardiac arrest) కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ రిస్క్‌ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువగా ఉంది. మిగతా వారితో పోలిస్తే వీరికి గుండెపోటు వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువగా ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. షుగర్‌ సోకితే శరీంలోని హై బ్లడ్ షుగర్ అనేది గుండె రక్త నాళాలు, నరాలను బలహీనపర్చుతుంది. కాబట్టి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవాలి. లేకపోతే గుండెపోటుకు గురయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ జీవన శైలిని మార్చుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించే అద్భుతమైన ఔషద గుణాలు ఉన్న ఆయుర్వేద ఉత్పత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

యాలకులు

షుగర్ వ్యాధి ఉన్నవారు యాలకులు తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. పైగా స్వీట్స్ తినాలనే కోరిక తగ్గిపోతుంది. తద్వారా శరీరంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. యాలకులను టీ లో వేసుకుని తీసుకోవచ్చు. లేదా తినడానికి గంట ముందు గోరు వెచ్చని నీటిలో యాలకుల పొడిని కలుపుని తీసుకోవాలి.

శొంఠి

ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శొంఠి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. రోజుకు ఒకసారి గోరువెచ్చని నీటితో తినడానికి ముందు అర టీస్పూన్ శొంఠి తీసుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఇది ఉత్తమ కార్డియో-ప్రొటెక్టివ్‌గా పనిచేస్తుంది. జీవక్రియ మెరుగుపడుతుంది.

WhatsApp: విండోస్‌ పీసీలకు కూడా మెసేజ్‌ యువర్‌ సెల్ఫ్‌ వాట్సాప్‌ ఫీచర్‌? లేటెస్ట్‌ అప్‌డేట్‌ డీటైల్స్‌ ఇవే

 నల్ల మిరియాలు

ఇన్సులిన్ సెన్సిటివిటీ, జీర్ణక్రియను మెరుగుపరచడంలో నల్ల మిరియాలు కీలక భూమికను పోషిస్తాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఒక నల్ల మిరియాను తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోతాయి. సీనియర్ సిటిజన్లలో గుండెపోటు రిస్క్ తగ్గించడంలో నల్ల మిరియాలు కీలకంగా వ్యవహరిస్తాయి.

 పునర్నవ(Punarnava)

ఈ మూలికను ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో 2 నుంచి 5 గ్రాములు తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు శరీరంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. అలాగే బీపీ, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. పునర్నవ తీసుకోవడం వల్ల కాలేయం, కిడ్నీ, కళ్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతీని నివారించడంలో కీలకంగా వ్యవహిరిస్తుంది. అంతేకాకుండా జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

అర్జున్-చాల్

షుగర్ వ్యాధి ఉన్నవారు అర్జున్ చాల్ పొడిని నిద్రపోయే ముందు టీ రూపంలో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా పాటించడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. దీంతో గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుంది. గుండె సమస్యలు ఉన్నవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

First published:

Tags: Diabetes, Health, Heart Attack

ఉత్తమ కథలు