హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Breast Feeding: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ పోషకాహారం తినండి

Breast Feeding: పాలిచ్చే తల్లులూ.. పిల్లల ఎదుగుదలకు ఈ పోషకాహారం తినండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Breast Feeding: మాతృత్వాన్ని (motherhood) ఆస్వాదించే క్రమంలో ప్రసవానంతరం తల్లులు పోషకాల లేమికి బలవుతుంటారు. వీటిని అధిగమించాలంటే కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ మంచి పోషకాహారాన్ని తీసుకునేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

బిడ్డకు మంచి పోషకాలు అందాలంటే ఒకే ఒక మార్గం తల్లిపాలల్లో పోషకాలు ఉండేలా చూడటమే. తల్లిపాలకు ప్రత్యామ్నాయం సృష్టిలో లేదు, అందుకే తల్లిపాలు (breast feeding) సరఫరా చేసే బ్యాంకులు (milk bank) పుట్టుకొచ్చాయి. మాతృత్వాన్ని (motherhood) ఆస్వాదించే క్రమంలో ప్రసవానంతరం తల్లులు పోషకాల లేమికి బలవుతుంటారు. వీటిని అధిగమించాలంటే కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ మంచి పోషకాహారాన్ని తీసుకునేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. తృణధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ (complex carbohydrates) ఎక్కువ కనుక పాలిచ్చే తల్లులకు ఇలాంటివి చాలా అవసరం, బ్రౌన్ బ్రెడ్ వంటివి తీసుకోవటం ద్వారా తృణధాన్యాన్ని నిత్యం తీసుకునే అవకాశం ఉంటుంది.

బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, ప్రసవించాక కూడా తల్లి తినే ఆహారాన్ని బట్టి మాత్రమే పసిగుడ్డుకు పోషణ అందుతుంది. కాబట్టి తల్లి ఎంత బలవర్ధకమైన ఆహారం తింటే అంత మంచిది. తల్లీ, బిడ్డల పోషణ అంటే సరైన పోషకాలుండి తీరాల్సిందే. తొలిసారి తల్లైనవారికి ఈ విషయంపై పెద్దగా అవగాహన లేక అనారోగ్యంపాలవుతుంటారు. బిడ్డకు పాలిచ్చినన్ని రోజులూ సరైన ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిఆహార పదార్ధాలకు దూరంగా ఉంటూనే పోషకాల లేమి (malnutrition) నుంచి బయటపడాలి.

వెల్లుల్లి

బాలింతలు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లిని చేర్చాల్సిందే. పప్పు, కూర, చారు, పొడి ఇలా అన్నింటిలోనూ వెల్లుల్లి వేసి వండితే తల్లి-బిడ్డలకు పోషకాలు పుష్కలంగా అందుతాయి, తల్లి పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో బిడ్డకు కడుపునిండా పాలిచ్చే అవకాశం ఉంటుంది. పోత పాలకు దూరంగా ఉండాలంటే వెల్లుల్లిని ఆహారంలో చేర్చండి.

ఎక్కువ ఆహారం

ప్రసవం తరువాత ఆహారం ఎక్కువ తీసుకోవటాన్ని తల్లి ఎప్పుడూ మరవరాదు. అప్పుడే తల్లి ఒంట్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి, మీ బిడ్డకు కడుపు నిండుతుంది. Nuts, విత్తనాలు, అవకాడో వంటి మంచి కొవ్వు ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తల్లి తినాలి. తాజా పళ్లు, కూరగాయలు, పొట్టు ధాన్యాలు వంటి మంచి కార్బోహైడ్రేట్స్ ను , ప్రొటీన్స్ ను తల్లికి ఇవ్వాలి. చేపలు, సీ ఫుడ్, చికెన్, గుడ్లు, కందిపప్పు వంటివి తల్లి తినే మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. తల్లి తినే ఆహారం ఇద్దరికి సరిపడేంత పోషకాలు అందించాలనే విషయాన్ని మరిస్తే తల్లీ, బిడ్డ ఇద్దరూ నీరసిస్తారు.

నీరు బాగా తాగండి

తల్లికి డీహైడ్రేషన్ కాకుండా ఉండేలా నీళ్లు తాగుతూ ఉండాలి. తల్లి పాలు తక్కువ కాకుండా మీ చిన్నారి కడుపునిండా పాలు తాగాలంటే పాలిచ్చే తల్లులు డీహైడ్రేషన్ బారిన పడకూడదు. పాలిచ్చే తల్లులు రోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాల్సిందే.

పాల పదార్థాలు

పాలు, పాలపదార్థాలు (milk products) ఎక్కువగా తీసుకోవాలి. ప్రసవానంతరం నెయ్యి, పెరుగు పుష్కలంగా తీసుకోవటం అవసరం. దీంతో తల్లికి, బిడ్డకు క్యాల్షియం హీనత రాకుండా, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఓట్ మీల్ తీసుకోవటంతో తల్లిపాలకు కొరత రాకుండా చూసుకోవచ్చు.

ఏరేటెడ్ డ్రింక్స్ కు నో చెప్పండి

డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఏరేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండేలా చూసుకోవాలి. పాలిచ్చే తల్లులు ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ , ఆల్కహాల్ కు దూరంగా ఉండాల్సిందే. తాజా పళ్లు, కూరగాయల రసం, కొబ్బరి నీళ్లు, నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగితే మరీ మంచిది.

First published:

Tags: Breastfeeding, Health, Health Tips, Life Style, Pregnant, Women

ఉత్తమ కథలు