Pregnancy: గర్భిణి స్త్రీలు చేయించుకోవాల్సిన ఐదు కీలక పరీక్షలు

దంపతుల జీవన ప్రయాణంలో ఆడవాళ్లు గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి ముఖ్యమైన ఘట్టాలు. గర్భం దాల్చడం, శిశువు జననం అనేది ఒక అందమైన, సుదీర్ఘ ప్రయాణం.

news18-telugu
Updated: September 20, 2020, 6:05 PM IST
Pregnancy: గర్భిణి స్త్రీలు చేయించుకోవాల్సిన ఐదు కీలక పరీక్షలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దంపతుల జీవన ప్రయాణంలో ఆడవాళ్లు గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి ముఖ్యమైన ఘట్టాలు. గర్భం దాల్చడం, శిశువు జననం అనేది ఒక అందమైన, సుదీర్ఘ ప్రయాణం. ప్రెగ్నన్సీ అని తెలిశాక కాబోయే తల్లులు గర్భం, పిల్లల పెంపకం వంటి అంశాలను తెలుసుకోవాలి. తల్లీ బిడ్డల ఆరోగ్యం, పిండం ఎదుగుదల గురించి కనీస విషయాలు తెలుసుకోవాలి. ఇలాంటి సమయాల్లో చేసే పొరపాట్లు లేనిపోని సమస్యలకు దారితీస్తాయి. మాతృత్వానికి దగ్గరయ్యేవారు గర్భధారణ తరువాత వివిధ దశలలో తప్పక చేయించుకోవాల్సిన ఐదు పరీక్షలు..

1. విటమిన్ స్థాయి: మెడికల్ఎక్స్ప్రెస్.కామ్ ప్రకారం గర్భిణీ స్త్రీలలో విటమిన్ డి లోపం తల్లి, బిడ్డలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శిశువు ఎముకల ఎదుగుదల, దృఢత్వానికి అవసరమయ్యే కాల్షియం అందేలా చూడటానికి విటమిన్ డి తోడ్పడుతుంది. ఇలాంటి విటమిన్ లోపాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే పరీక్షలు చేయించుకోవాల్సిందే.

2. గ్లూకోజ్ స్థాయి: గర్భధారణ తరువాత కొంతమందిలో కనిపించే ప్రెగ్నెన్షియల్ డయాబెటీస్ శిశువు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. భారతదేశంలో సుమారు 16% మంది మహిళలు ఈ వ్యాధికి గురవుతున్నట్టు అంచనా. దీన్ని ఆదిలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

3. సిబిసి: రక్తంలో వివిధ రకాల కణాల సంఖ్యను సిబిసి ద్వారా తెలుసుకోవచ్చు. తక్కువ ఎర్ర రక్త కణాల స్థాయిలు రక్తహీనతను సూచిస్తాయి. తెల్ల రక్త కణాల సంఖ్య ద్వారా రోగనిరోధక శక్తిని అంచనా వేయొచ్చు. రక్తం గడ్డకట్టడంలో సమస్యలను ప్లేట్లెట్ల సంఖ్య వెల్లడిస్తుంది. గర్భధారణ సమయంలో ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గితే విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ లోపం వంటివి ఉన్నాయని అర్థం.

4. జన్యు పరీక్ష: తల్లి వయస్సు 37 సంవత్సరాలు దాటినప్పుడు, లేదా కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందే జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డకు కూడా జన్యుపరమైన రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం రెండు రకాల జన్యు పరీక్షలుంటాయి. అవి స్క్రీనింగ్, డయాగ్నస్టిక్ టెస్టులు. పుట్టుకతో వచ్చే లోపాలు ఉంటే స్క్రీనింగ్ పరీక్షల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలు పిండం ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్ధారించలేవు. పిండానికి జన్యుపరమైన రుగ్మత ఉందో లేదో తెలుసుకోవాలంటే డయాగ్నస్టిక్ టెస్టులు చేయాలి. ఈ పరీక్షలు చాలావరకు మొదటి త్రైమాసికంలోనే జరుగుతాయి. తల్లిదండ్రులు ముందుగానే బిడ్డకు ఉండే వ్యాధిని ఎలా ఎదుర్కోవచ్చో దీని ద్వారా తెలుస్తుంది.

5. పిండం పర్యవేక్షణ: ఇది పిండం హృదయ స్పందన రేటును కొలవడానికి ఒక సాధారణ విధానం. గర్భం దాల్చినప్పటి నుంచి పిండ పర్యవేక్షణ పరీక్షల ద్వారా శిశువు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పుట్టిన తరువాత పిల్లలను సాధారణంగానే ఉంచలా, సి-సెక్షన్ అవసరమా అని నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది. ఫెటోస్కోప్ ద్వారా ఈ పరీక్ష చేస్తారు.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 6:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading