హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cancer Causing Foods: ఈ ఫుడ్స్ తింటే క్యాన్సర్ కు ఎంట్రీ పాస్ ఇచ్చినట్టే...

Cancer Causing Foods: ఈ ఫుడ్స్ తింటే క్యాన్సర్ కు ఎంట్రీ పాస్ ఇచ్చినట్టే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cancer Causing Foods: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9.6 మిలియన్ల మంది (అంటే దాదాపు కోటి మంది) మరణించారు. ప్రపంచంలో ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్. ఏటా దీని భారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 9.6 మిలియన్ల మంది (అంటే దాదాపు కోటి మంది) మరణించారు. ప్రపంచంలో ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్. ఏటా దీని భారిన పడి లక్షలాది మంది చనిపోతున్నారు. యువరాజ్, సోనాలిబింద్రే వంటి ఎందరో సెలబ్రిటీలు సైతం క్యాన్సర్ బారిన పడ్డవాళ్లే. అయితే వాళ్లు ముందు స్టేజ్ లోనే గుర్తించారు. కానీ ఆలస్యమైతే మాత్రం ప్రాణాలు దక్కవు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు ఆహారాలవాట్లలో మార్పులు... మన జీవనశైలి.. క్యాన్సర్ కు కారకం అవుతున్నది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో.. పౌష్టికాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. కానీ ఈ కింది ఆహార పదార్థాలను తీసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.

తక్షణ అవసరాల నిమిత్తం కంటే భవిష్యత్ చూసుకోవడం ముఖ్యం. మన ఆహార అలవాట్లే మన అనారోగ్యానికి కారణమవుతాయి. ప్యాక్ చేసిన ఆహారం.. కల్తీ ఆహారం.. ప్రోటిన్లు లేని ఫుడ్స్ మన ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయి. ఈ కింద సూచించిన పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బంగాళ దుంప చిప్స్..

నోరూరించే ఆలూ చిప్స్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ప్లేట్ లో వేడి వేడిగా ఆలూ చిప్స్ వేసుకుని తింటే ఆ మజానే వేరు. కానీ ఇందులో ఉండే కొవ్వులు.. అక్రైలమైడ్ (acrylamide) క్యాన్సర్ కు కారకమవుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

తెల్ల పిండి..

తృణ ధాన్యాలు, రైస్ ను ప్రాసెస్ చేయగా వచ్చే పిండి ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు నిపుణులు. ఆ ఉత్పత్తులను మరలో వేసినప్పుడు తెల్ల కలర్ లో రావడానికి క్లోరిన్ గ్యాస్ అవసరమవుతుందని.. అది క్యాన్సర్ కు కారకమని తేలింది. అంతేగాక ఇందులో ఉండే గ్లైసెమిక్ కూడా బ్లడ్ షుగర్ ను పెంచుతుందట.

వెజిటెబుల్ ఆయిల్ (vegetable oil)

సాధారణంగా మనం ఇంట్లో వెజిటేబుల్ ఆయిల్ ను ఎంతో ఇష్టంగా వాడతాం. దీనిని ఆరోగ్యకరమైనదని అనుకుంటాం. కానీ ఈ నూనెలు తయారుచేసే ప్రక్రియలో వాడే కెమికల్ ప్రక్రియ.. అత్యంత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.

రెడ్ మీట్ (red meat)

మాంసం (రెడ్ మీట్) ను ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదట. మోతాదుకు మించిన గొడ్డు మాంసం, పంది మాంసం, గొర్రె మాంసాలను వినియోగిస్తే.. అది ప్రమాదమేనట.

తక్కువ కొవ్వు ఉన్న ఉత్పత్తులు (Low fat products)

కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి ఆరోగ్యకరమైనవి అయితేనే ఉపయోగం. అలా కాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వెంట దొరికే బర్గర్లు, ఫిజ్జాలు, నూడుల్స్ వంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే.. వాటి వల్ల అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టేనట.

First published:

Tags: Cancer

ఉత్తమ కథలు