5 BEST HOME MADE DRINKS TO SOOTHE YOUR SORE AND SCRATCHY THROAT NK
Health Tips: గొంతు గరగరను పోగొట్టే ఆరోగ్య చిట్కాలు
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
ఈ రోజుల్లో మనం తినే ఆహారాల్లో కల్తీలు ఎక్కువవుతుండటంతో... అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో గొంతు గరగర అన్నది కామన్. అది పోవడానికి ఐదు సింపుల్ చిట్కాలున్నాయి. ఫాలో అయిపోదామా.
గొంతులో కిచ్ కిచ్ ఉంటే... ఇబ్బందే. మాటిమాటికీ గొంతు సవరించుకోవడం, కఫాన్ని ఉమ్మివేయడం కష్టమే. కొంతమందైతే కఫాన్ని మింగేస్తారు కూడా. అది చాలా ప్రమాదకరం. అందుకే ఈ గొంతు గరగరకు మనం చెక్ పెట్టాలి. నిజానికి గొంతులో గరగరగా ఉందంటే దానర్థం... మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా వస్తున్నాయనీ, వాటిపై మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పోరాడుతోందని. ఐతే, వ్యాధి నిరోధక శక్తి ఓడిపోతున్నప్పుడు మ్యూకస్ (కఫం లేదా శ్లేష్మం) ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. జలుపు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. ఈ కఫానికి ఆరంభంలోనే చెక్ పెట్టాలి. లేదంటే అది దగ్గును క్రియేట్ చేస్తుంది. ఆ దగ్గు రెండు వారాల కంటే ఎక్కువసేపు ఉంటే... ప్రాణాంతకమైన క్షయ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం గొంతులో కిచ్ కిచ్ అంతు చూద్దాం. అందుకు మందులతో పనిలేదు. ఆయుర్వేదం, హోం రెమెడీస్ ఉన్నాయిగా....
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
1.పసుపు, పాలు :గోరు వెచ్చని పాలలో... అర టీ స్పూన్ పసుపు వేసి... కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది కూడా.
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
2. అల్లం, దాల్చినచెక్క : అల్లాన్ని పేస్ట్ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీపొడి కలిపి టీ పెట్టుకొని తాగేయండి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది. చక్కటి ఫలితం ఉంటుంది. కావాలంటే కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు.
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
3. అల్లం టీ : అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలున్నాయి. గొంతులో మంటను తగ్గించే లక్షణాలున్నాయి. కాబట్టి... అల్లాన్ని మెత్తగా నూరి... టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగితే ఉంటుంది చూడండి... గొంతులో కిచ్ కిచ్ మొత్తం మాయమవుతుంది.
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
4. పుదీనా టీ : పుదీనా చేసే మేలేంటో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి... ఆకులు తీసివేసి... వాటర్ తాగాలి. అంతే... గొంతు అంతు చూస్తుంది. మ్యూకస్ పెట్టే బెడా సర్దుకోవాల్సిందే.
గొంతు గరగరకు వంటింటి చిట్కాలు
5. చామంతి టీ : ఇది పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు. నిజానికి ఇది కూడా బాగా పనిచేస్తుంది. కొన్ని చామంతి రేకుల్ని నీటిలో వేసి... మరిగించి తాగడమే. కావాలంటే కాస్త తేనె కలుపుకోవచ్చు. ఈ టీ బ్యాక్టీరియాను ఉతికారేస్తుంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.