ఆలివ్ నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చర్మంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. రసాయనాలతో చేసిన ఉత్పత్తులను వాడటానికి బదులుగా ఆలివ్ నూనెను బ్యూటీ ప్రొడక్ట్‌గా వాడుకోవచ్చు. మార్కెట్లో లభించే ఉత్పత్తులు అందరికీ పడకపోవచ్చు. వీటి వల్ల దుష్ప్రభావాలు కూడా ఎదుయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వాటికి బదులుగా ఆలివ్ నూనెను వాడి చూడండి. ఇది చర్మం, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
మేకప్‌ను తొలగించుకోవచ్చు
మేకప్ తొలగించడానికి ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. మేకప్‌ను తొలగించడానికి నేరుగా సబ్బు, క్రీమ్‌లతో కడగకుండా ముందు కొంచెం ఆలివ్ నూనె రాయాలి. దీంట్లో ఉండే సహజ కొవ్వులు ముఖం మీద వేసుకునే మేకప్‌కు అతుక్కుంటాయి. దీంతో కడిగినప్పుడు మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి. బయట లభించే మేకప్ రిమూవర్లు సున్నితమైన చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వాటి వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. వీటికి బదులుగా ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండని ఆలివ్ నూనెను వాడడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది
ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, స్క్వాలేన్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ నూనెలో ఉండే ఫ్యాటీ లిపిడ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ట్రాన్స్‌పిడెర్మల్ వాటర్ లాస్ (transepidermal water loss) వంటి అనారోగ్యాలను ఆలివ్ నూనె నివారిస్తుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని అదుపులో ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
గోర్లను మృదువుగా చేస్తుంది
ఇంట్లో మ్యానిక్యూర్ చేసుకోవాలనుకునేవారు ఆలివ్ నూనెను వాడవచ్చు. ఈ మాయిశ్చరైజింగ్ ఆయిల్ గోరు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. గోరుపై ఉండే పగిలిన క్యూటికల్స్, నిర్జీవంగా మారిన గోరు పై పొరను కాపాడుతుంది. ముందు వేళ్లను నీటిలో ముంచి తీసిన తరువాత, యాపిల్ సిడర్ వెనిగర్ తో గోర్లను శుభ్రం చేసుకోవాలి. ఇది బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. ఆ తరువాత ప్రతీ గోరుపై కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేసి మసాజ్ చేయండి. ఇది హాంగ్ నెయిల్స్, చిప్పింగ్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
షేవింగ్ క్రీమ్‌గా కూడా..
ఆలివ్ ఆయిల్ మంచి హైడ్రేటింగ్ షేవింగ్ క్రీమ్‌గా పనిచేస్తుంది. ఇది రేజర్ బర్న్ సమస్యను నివారిస్తుంది. దీన్ని షేవింగ్ క్రీమ్‌గా వాడటం వల్ల మృదువైన షేవ్ అనుభూతి కలుగుతుంది. కోతలు, గాట్లు ఏర్పడకుండా చూస్తుంది. కానీ గడ్డం చేసుకోవడానికి కాకుండా, హెయిర్ రిమూవల్ క్రీమ్‌లకు ప్రత్యామ్నాయంగానే ఆలివ్ ఆయిల్‌ను వాడాలని నిపుణులు చెబుతున్నారు. చేతులు, కాళ్లపై వెంట్రుకలు షేవ్ చేసుకునేవారు ఆలివ్ నూనెను వాడవచ్చు.
జుట్టు పెరుగుదలకు..
ఆలివ్ నూనెలో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఈ నూనెతో హాట్ ఆయిల్ ట్రీట్‌మెంట్ చేసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఇది రంగు మారిన, పొడిబారిన జుట్టును ఆరోగ్యంగా మారుస్తుంది. వెంట్రుకలను మృదువుగా మారుస్తుంది. తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు చిక్కులు పడకుండా కాపాడుతూ, మెరిసేలా చేస్తుంది. ఆలివ్ నూనెను కాసేపు వేడి చేసి, దాంతో హెడ్ మసాజ్ చేసుకుంటే జుట్టు బలంగా మారుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda health tips, Health Tips