Weight Lose : ఇప్పుడు అధిక బరువు(Weight) అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారింది. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడంతో ఈ సమస్య ఆందోళనకరంగా మారింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం తప్పకుండా చేయాల్సిందే. జిమ్, జిమ్నాస్టిక్స్, యోగా లాంటివి వయసులో ఉన్న వారైతే ఈజీగా చేయగలరు. కానీ వయసు పైబడిన వారు పిజికల్ యాక్టివిటీ చేయడం కష్టమే. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని అందరూ పాటించగలిగిన సులభమైన, శక్తివంతమైన మార్గాలను చెబుతున్నారు నిపుణులు.
ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొన్ని కిలోల బరువు తగ్గొచ్చు. ఇందులో కష్టమైన నియమాలేమీ లేవు. బరువు తగ్గాలంటే 80 శాతం ఆహారం, 20 శాతం వ్యాయామం అని తరచుగా చెబుతుంటారు. ఇది చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ప్రయత్నిస్తే వచ్చే ఫలితాలు చూస్తే నమ్మకం కలుగుతుంది. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గేందుకు ఎంతో ప్రభావవంతంగా పని చేసే ఈ ఐదు మార్గాలపై ఓ లుక్కేయండి.
స్వీట్లు వద్దే వద్దు
అధిక బరువును తగ్గించుకునే పనిలో ముందుగా చేయాల్సిన పని.. కృత్రిమ చక్కెరలతో చేసే తీపి పదార్థాలను తినడం మానేయడం. చక్కెరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ శరీర బరువును డైరెక్ట్‌గా ప్రభావితం చేస్తుంది. అయినా సరే మేం తీపి తినకుండా ఉండడం చాలా కష్టం. అది మా వల్ల కాదు అనుకునే వారు పంచదారకు బదులుగా బెల్లం, తేనె మితంగా వాడవచ్చు.
మైదాను దూరం పెట్టండి
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు మైదా పిండితో చేసే పదార్థాలు తినడం పూర్తిగా మానేయాలి. దీనితో చేసే పదార్థాలు.. అంటే బ్రెడ్, బన్, నాన్, పాస్తా లాంటివి అసలు తినకూడదు. దీనికి బదులుగా ఊక ఉన్న గోధుమ పిండి(Atta With Bran) ఉపయోగించవచ్చు. దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.
గ్రీన్ టీ
బరువు తగ్గాలని అనుకుంటుంటే రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగండి. ఇది మీ జీవక్రియను బూస్ట్ చేయడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. దీంతో మీ శరీరం డిటాక్స్(Detox) అయి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
Samsung: శామ్సంగ్ యూజర్లకు గుడ్‌న్యూస్..అతి త్వరలో అన్ని డివైజ్‌లకు ఆండ్రాయిడ్ 14 అప్డేట్
రిఫైన్డ్ ఆయిల్ వద్దు
ఇంట్లో ఆహారం వండేటప్పుడు నూనెను, ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్ (Refined Oil) వాడకాన్ని తగ్గించేందుకు ప్రయత్నించండి. రిఫైన్డ్ ఆయిల్ బరువు పెరగడానికి సహకరిస్తుందని గుర్తుంచుకోండి. దీనికి బదులుగా ఆవ నూనె, వేరుశెనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగించవచ్చు.
వేడి నీరు తాగండి
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగు పడుతుంది. తద్వారా ఆరోగ్యకరంగా, సునాయాసంగా బరువు తగ్గడంలో ఈ అలవాటు ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల టాక్సిన్లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న చల్లటి నీటిని కాకుండా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వులు తొలగిపోతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Weight loss, Weight loss tips