హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Coffee: రోజూ కాఫీ తాగుతున్నారా..? అయితే, తలనొప్పి గ్యారెంటీ..! నమ్మకపోతే ఇది చదవండీ..!!

Coffee: రోజూ కాఫీ తాగుతున్నారా..? అయితే, తలనొప్పి గ్యారెంటీ..! నమ్మకపోతే ఇది చదవండీ..!!

రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే.. తలనొప్పి రావడం ఖాయం

రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే.. తలనొప్పి రావడం ఖాయం

అధిక మొత్తంలో తీసుకునే కెఫీన్ తలనొప్పికి దారి తీస్తుంది. ప్రతిరోజూ 400 మి.గ్రా లేదా 4 కప్పుల కాఫీ తాగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. రెండు వారాల కంటే ఎక్కువ రోజుల పాటు రోజుకు 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ తీసుకునే వారికి కూడా మైగ్రేన్ (Migraine) రావచ్చు.

ఇంకా చదవండి ...

కాఫీ (Coffee), టీ (Tea) పానీయాలు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వేడి పానీయాలు మానసిక ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలానే క్యాన్సర్ వంటి వ్యాధులను దరిచేరనివ్వవు. టీ తరువాత ప్రజలు ఎక్కువగా తాగే హాట్ డ్రింక్స్‌లో కాఫీయే ఉంటుంది. అయితే టీలో లాగే కాఫీలో కూడా కెఫీన్‌ (Caffeine) ఉంటుంది. కాఫీలోని కెఫీన్‌ శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే విద్యార్థులు పరీక్షల సమయంలో చురుకుగా ఉంటూ నిద్రరాకుండా కాఫీని తాగుతుంటారు. ఈ కెఫీన్‌ను మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. తాజాగా దీని వల్ల మరొక సమస్య వస్తుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే తలనొప్పి వస్తుందని ఆ అధ్యయనం వివరిస్తోంది.

కాఫీపై అధ్యయనం చెప్పిన సంచలన నిజాలు ఇవే

న్యూస్ టుడే మెడికల్ రిపోర్ట్ ప్రకారం, అధిక మొత్తంలో తీసుకునే కెఫీన్ తలనొప్పికి దారి తీస్తుంది. ప్రతిరోజూ 400 మి.గ్రా లేదా 4 కప్పుల కాఫీ తాగడం వల్ల ఇలాంటి సమస్య వస్తుంది. రెండు వారాల కంటే ఎక్కువ రోజుల పాటు రోజుకు 200 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ తీసుకునే వారికి కూడా మైగ్రేన్ (Migraine) రావచ్చు. మైగ్రేన్ అంటే తలకు ఒక వైపు వచ్చే తీవ్రమైన తలనొప్పి. తలనొప్పి సమస్య వచ్చే రిస్కు ఉంది కదా అని మీరు వెంటనే కాఫీ తీసుకోవడం మానేయకూడదు. ఎందుకంటే ఉన్నట్టుండి కాఫీని తాగడం మానేసినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాఫీ తాగే అలవాటును నెమ్మదిగా తగ్గించడం మంచిది. మీరు కాఫీ వాడకాన్ని నెమ్మదిగా తగ్గిస్తే మైగ్రేన్ ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.

* తలనొప్పి రాకుండా తక్కువ కాఫీ తాగాలి

కాఫీలో ఉండే కెఫిన్ అనేది ఒక్కో వ్యక్తి శరీరానికి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. అయినా కూడా తలనొప్పి వంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా కాఫీ తాగకపోవడమే శ్రేయస్కరం. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు కాఫీ తీసుకోవడం మానేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పితో పాటు అజీర్తి సమస్యలు, బ్లడ్ ప్రెజర్, గుండె వేగం పెరగడం, నీరసం రావడం, అతిమూత్రవ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా రావచ్చు. టెన్షన్, ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కూడా తలనొప్పికి దారితీయవచ్చు. కెఫీన్‌ను తగ్గించినా మీకు మరింత ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యాల సంకేతంగా నిలుస్తుంది.

Published by:Mahesh
First published:

Tags: Coffee, Health, Health issues, Side effects

ఉత్తమ కథలు