షిల్లాంగ్‌లో చెర్రీ పూల పండుగ

స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్‌గా పేరు తెచ్చుకున్న షిల్లాంగ్‌లో పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు మేఘాలయ ప్రభుత్వం చెర్రీపూల పండుగ నిర్వహిస్తోంది. 3వ అంతర్జాతీయ చెర్రీపూల పండుగ నవంబర్ 14-17 వరకు జరగనుంది. చెర్రీ చెట్లపై తెలుపు, గులాబీ రంగుల పూవులు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.

news18-telugu
Updated: November 12, 2018, 1:29 PM IST
షిల్లాంగ్‌లో చెర్రీ పూల పండుగ
షిల్లాంగ్‌లో చెర్రీ పూల పండుగ
  • Share this:
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ గులాబీమయంగా మారిపోయింది. చెర్రీపూలు విచ్చుకోవడంతో తూర్పున ఉన్న కొండలు గులాబీవర్ణంలో కనువిందు చేస్తున్నాయి. హిమాలయ ప్రాంతానికి చెందిన చెర్రీ వృక్షాలు షిల్లాంగ్‌లో ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ సీజన్ వచ్చేసరికి చెర్రీ పూలు పూయడం, ఆ ప్రాంతమంతా గులాబీ వర్ణంలో కనిపించడం పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్‌గా పేరు తెచ్చుకున్న షిల్లాంగ్‌లో పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు మేఘాలయ ప్రభుత్వం చెర్రీపూల పండుగ నిర్వహిస్తోంది. 3వ అంతర్జాతీయ చెర్రీపూల పండుగ నవంబర్ 14-17 వరకు జరగనుంది. చెర్రీ చెట్లపై తెలుపు, గులాబీ రంగుల పూవులు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.

షిల్లాంగ్‌లో చెర్రీ పూల పండుగ, 3rd India International Cherry Blossom Festival 2018 frome November 14-17 at Shillong
షిల్లాంగ్‌లో చెర్రీ పూల పండుగ


చెర్రీపూల పండుగలో భాగంగా ఫ్యాషన్ షోస్, రాక్ మ్యూజిక్, అందాల పోటీలు, గోల్ఫ్ టోర్నమెంట్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాంతో పాటు ఈ ప్రాంత సంప్రదాయ వంటకాలు నోరూరించనున్నాయి. దాంతోపాటు జపాన్ సంస్కృతిని చాటే కార్యక్రమాలు, జపాన్ ఫుడ్ పెవిలియన్ మరిన్ని ఆకర్షణలు.





ఇవి కూడా చదవండి:

ఒంటరితనం, ఒత్తిడికి సోషల్ మీడియానే కారణం

పొల్యూషన్‌కి సొల్యూషన్: ఈ ఎలక్ట్రిక్-హైబ్రిడ్ కార్లు కొనొచ్చు...లోన్ డిఫాల్ట్ అయిందా? క్రెడిట్ స్కోర్ ఇలా పెంచుకోండి...

ఐదు కెమెరాలతో రానున్న నోకియా 9
First published: November 12, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు