Happy New Year: 2021లో ఈ 21 చిలిపి కోరికలతో హ్యాపీగా ఉందాం.. 11వది క్రేజీగా ఉంటుంది

Happy New Year: 2021లో ఈ 21 చిలిపి కోరికలతో హ్యాపీగా ఉందాం.. 11వది క్రేజీగా ఉంటుంది

ప్రతీకాత్మక చిత్రం

ఇవేవీ చాలా ఖర్చుతో కూడుకున్నవి మాత్రం కావు. మనం మనసు పెట్టి చేయాల్సినవి. చాలా చిన్నవి. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. 2020లో కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని 2021లో అయినా పొందుదాం.

  • Share this:
    హ్యపీ న్యూ ఇయర్ 2021 అంటూ జనం మళ్లీ కొత్త కొత్తగా వాట్సాప్ స్టేటస్‌లు సిద్ధం పంపుతున్నారు. కొందరు మీమ్స్ తయారు చేస్తున్నారు. 2020లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన వాళ్లు కనిపిస్తే కొడతామంటూ కూడా జనం సరదాగా జోకులు వేస్తున్నారు. అయితే, 2020 లాగా కాకుండా, 2021 ఆనందంగా, హ్యాపీగా ఉండాలంటే ఇలా చేయండి అంటూ కొందరు సూచిస్తున్నారు. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అందులో కొన్ని చిలిపి కోరికలు ఉన్నాయి. మరికొన్ని మనల్ని మరింత కార్యోన్ముఖుల్ని చేసేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం.

    1. ఏదైనా ఒక కొత్త ఆట నేర్చుకోండి
    2. మూగభాష నేర్చుకోండి. లేదా ఒక భాష నేర్చుకోండి
    3. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి
    4. మీరెవరో చెప్పకుండా మీకు తెలిసిన వారికి ఓ బహుమతి పంపండి
    5. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఎలాగో నేర్చుకోండి
    6. అఆలు, లేకపోతే ఏబీసీడీలు వెనుక నుంచి పలకడం నేర్చుకోండి
    7. మీ భాషా ప్రావీణ్యత పెంచుకోండి. అది ఏ భాష అయినా కావొచ్చు.
    8. ప్రతి వారం ఓ కొత్త రకం వంట ఏడాది మొత్తం వండండి
    9. ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ లేదా హెయిర్ కలర్ ట్రై చేయండి
    10. చాప్ స్టిక్స్ ఎలా వాడాలో నేర్చుకోండి
    11. ఏదైనా ఓ రోజు సూపర్ హీరో అండర్ వేర్ వేసుకుని ఆనందించండి
    12. ఒక చెత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేయండి
    13. ఓ అనాథ బాలిక లేదా బాలుడి చదువు కోసం సాయం చేయండి
    14. మీ పేరు కలిగిన వ్యక్తితో పరిచయం పెంచుకోండి
    15. ఓ వీధి కుక్కను పెంచుకోండి
    16. టెక్నాలజీ నుంచి ఒక వారం బ్రేక్ తీసుకోండి.
    17. ఒక గ్రాడ్యుయేట్ జర్నల్‌ని ప్రారంభించండి
    18. రోడ్డు మీద ఓ అపరిచితుడితో అతన్ని ఎప్పుడో మిస్ అయిన ఫ్రెండ్‌లా ట్రీట్ చేయండి
    19. ప్రతి రోజూ చదవండి
    20. భయాన్ని నిర్భయంగా ఎదుర్కోండి
    21 ఓ మొక్కను నాటి దాన్ని పెంచండి

    ఇవేవీ చాలా ఖర్చుతో కూడుకున్నవి మాత్రం కావు. మనం మనసు పెట్టి చేయాల్సినవి. చాలా చిన్నవి. ఇలా చేయడం వల్ల మన మనసుకి ఆనందం, ఆహ్లాదం దొరుకుతుంది. 2020లో కరోనా వల్ల కోల్పోయిన ఆనందాన్ని 2021లో అయినా పొందుదాం. ఓ రకంగా చెప్పాలంటే ఇవి కొన్ని మాత్రమే. ఇంతకు మించిన క్రియేటివ్ ఆలోచనలు చాలా ఉంటాయ్. మీకు నచ్చినవి, మీ అభిరుచికి తగినట్టు వాటిని ఎంచుకోండి. మీకు తోచిన దారిలోనే ఆనందాన్ని వెతుక్కోండి. కానీ, ఏదో ఒకటి చేయండి. అదే ఆనందం. పాస్, ఫెయిల్ అనేదాంతో సంబంధం లేకుండా అదే ఆనందాన్ని ఇస్తుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు