ప్రతి ఏటా వరల్డ్ రెబీస్ డే world rabies day ను సెప్టెంబర్ 28న నిర్వహిస్తారు. దీన్ని రెబీస్కు వ్యతిరేకంగా మొదటిసారి టీకా vaccine ను కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ Louis Pasteur కు గుర్తుగా నిర్వహిస్తారు. రెబీస్ బారిన పడుతున్నవారిలో 15 ఏళ్లలోపు ఉన్నవారే అ«ధికం. ఇది నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ను లిసా వైరస్ అంటారు.
ఈ వైరస్ ఒంట్లో ఉన్న కుక్కలు మనల్ని కరచినపుడు.. మన శరీరంపై ఏదైనా గాయాలు ఉన్నపుడు, వాటిమీద కుక్కలు నాకినపుడు మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. మిగతా జంతువుల నుంచి కూడా రెబీస్ సోకే ప్రమాదం ఉంది. కానీ, 99 శాతం కేవలం కుక్క ద్వారా మాత్రమే ఈ వ్యాధి సోకుతుంది. ఇది ఏ కుక్క కరచిన వ్యాధి రాదు. కేవలం ఆ కుక్కలో రెబీస్ వైరస్ rabies virus ఉంటేనే మనకు సోకుతుంది.
ఆ వైరస్ నాడులను చేరుకుని గంటకు మూడు మిల్లీలీటర్లకు చేరుకుని వ్యాపిస్తుంది. వీధి కుక్కలకు రెబీస్ వ్యాధి ఎక్కువగా ఉండే అవకా ఉంటుంది. 2–3 వారాల్లో మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి నివారణే మార్గం. గాబరగా ఉండటం, భయంకరమైన చూపు, నోటి నుంచి లాలాజలం కారడం.
గొంతులోని అవయవాలు పెరాలిసిస్ బారిన పడి పనిచేయవు. కుక్క గాటు గాయాలకు త్వరగా టీకా తీసుకోవాలి. ముఖ్యంగా యాంటీ రెబీస్ టీకా తీసుకోవాలి.కుక్క కరవగానే సబ్బుతో వెంటనే కడగాలి. అవకాశం ఉంటే అయోడిన్ సొల్యూషన్ వేసి కడగాలి. ఇది చేస్తే 90 శాతం రెబీస్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతంలో యాసిడ్ పోయడం, కాల్చడం వంటివి చేస్తారు. అలా చేస్తే.. నష్టాలే ఎక్కువ. గాయాన్ని నేరుగా మన చేతులతో కడగకూడదు. వీరు వాటర్ చూస్తే కూడా భయపడతారు. దీన్నే హైడ్రోఫోబియా. వీరిని ముక్యంగా ఐసొలేట్ చేయాలి.
గాయం పెద్దగా ఉన్నా.. కుట్లు వేయకూడదు. అవసరమైతేనే వేయాలి. యాంటీ సెప్టిక్ లోషన్ రాయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానడానికి యాంటీ బయోటిక్స్ వంటివి తీసుకోవాలి. యాంటీ రెబీస్ వ్యాక్సిన్ చేతిపై చేయించుకోవాలి. ఐవీ ఇమ్యూనో వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇవి పరిస్థితిని బట్టి డోసులు ఇస్తారు. కుక్కకాటు రాకముందే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫ్లాక్సెస్ అంటారు.
కుక్కకాటు జరిగిన తర్వాత తీసుకునే టీకాను పోస్ట్ ఎక్స్పోజర్ అంటారు. రాబీపుర్ చిక్ వంటి టీకా ఇస్తారు. దీన్ని బొడ్డు చుట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు. చేతులకు లేదా నడుముకు ఇస్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు సమయాన్ని అనుసరించి వ్యాక్సిన్స్ వేస్తారు కాబట్టి వీటితో భయపడాల్సిన అవసరం లేదు. ఇది సోకిన 3–4 రోజుల్లో లక్షణాలు తెలిసిపోతుంది.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.