ఏపీలో కొలువుల జాతర.. మరో 14 నోటిఫికేషన్ల విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. త్వరలోనే మరో 14 నోటిఫికేషన్లను విడుదల చేయనుంది.

news18-telugu
Updated: January 4, 2019, 7:33 PM IST
ఏపీలో కొలువుల జాతర.. మరో 14 నోటిఫికేషన్ల విడుదల..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 4, 2019, 7:33 PM IST
యువతకు మరో తీపికబురు అందించింది ఏపీ ప్రభుత్వం. గతేడాది డిసెంబర్ 31లోపు పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. త్వరలోనే మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తలు చేస్తోంది. మొత్తం 21 నోటిఫికేషన్ల ద్వారా 3250 ఉద్యోగాల భర్తీకిచర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా.. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లలోనే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలు, క్యారీ ఫార్వార్డ్ పోస్టుల వివరాలు కూడా పొందుపరిచినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోపు 1500 ఉద్యోగాల భర్తీకి 14 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 47,001 మంది అప్లై చేయగా, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉద్యోగాల కోసం 16,130మంది, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు 5411, హార్టికల్చర్ అధికారి ఉద్యోగాలకు 1307 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు అధికసంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, అభ్యర్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని.. చివరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడం వల్ల సాంకేతిక సమస్యలు వస్తున్నాయని అధికారులు విజ్ఞప్తి చేశారు.

First published: January 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...